Valuable Information
::సకలపూజలు.కామ్ అభిమానులకు శుభవార్త ! ప్రేక్షకులకు శ్రీ కాశీభట్ల బాలకృష్ణ శర్మ గారు అన్నిరకముల జాతక సమస్యలకు ఖచ్చితమైన జాతక పరిశీలన చేసి ఆయా సమస్యలకు సరైన పరిహారములను తెలియజేయుదురు. 1. విద్యా, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, సంతానము, ఆరోగ్యము, విదేశీయాన మొదలగు జాతక సమస్యలు 2. వివాహ, వ్యాపార, గృహారంభ, గృహప్రవేశ, ఉపనయ తదితర వాటికి శుభ ముహూర్తములను నిర్ణయము చేయుట 3. వివాహ సంబంద జాతక పొంతలనకు మరియు వాస్తు సంబంద విషయములు. ఆసక్తి ఉన్నవారు అన్ని విషయములకు క్రింద తెలిపిన మొబైల్ ఫోన్ ద్వారా గాని లేదా ఈమైల్ ద్వారాగాని సంప్రదించవచ్చును. హైదరాబాద్ లో వుండే వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చు. ఇతర దేశాల్లో వుండే వారు ముందుగా ఈమెయిలు లో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు అడిగే ప్రశ్నలకు ఫోన్ ద్వారా గాని, ఈ మెయిల్ ద్వారా గాని సంప్రదించవచ్చు. అందరికి ఇదే మా ఆహ్వానం. ఫోన్ చేయవలసిన మా మొబైల్ నంబర్ : 9247326197

ఈ శరీరమనే క్షేత్రంలో ఏ పంటలు వేయాలి ?

మహాభారతం యొక్క సమగ్ర సారాంశం భగవద్గీత అనేక పుష్పములనుండి తేనెను సేకరించి తేనెటీగ తేనెపట్టులో కూడబెట్టి మనకందిస్తున్నట్లు శ్రీకృష్ణపరమాత్ముడు ఉపనిషత్తులను వివిధ పూలరాశులనుండి గీతామకరందమును వెలికిదీసి మనకందించారు.


జన్మరీత్యా వ్యవసాయకుటుంబంలో పుట్టి వ్యవసాయంతోనే జీవనం సాగిస్తున్న కారణంగానేనేమో నాకు భగవద్గీతలో పదమూడవ అధ్యాయమైన క్షేత్ర క్షేత్రవిభాగయోగం అంటే చాలా ఇష్టం. ఇక్కడ శ్రీకృష్ణభగవానుడు శరీరాన్ని క్షేత్రమని ,అందులో ఉండేవాడిని క్షేత్రజ్ఞుడంటారని అన్నారు. క్షేత్రజ్ఞుడు శరీరంలోకి ఎందుకొచ్చాడు ? రావడానికి కారణం సత్వ రజ తమో గుణాలనే త్రిగుణాలన్నాడు.

ఈ మానవ శరీరం బంగరు పంటనేల. అందులో మనమేమైనా పండిచ్చుకోవచ్చు.వ్యవసాయక్షేత్రంలో అయితే వేరుశనగ , వరి,జొన్న ,కంది,శనగ ఇత్యాది పంటలనెలా పండిచ్చవచ్చో అలాగే ఈ మానవ శరీరంలో మనం ఏదైనా పండిచ్చుకోవచ్చు. బంగారం కావాలంటే బంగారం పండిచ్చుకోవచ్చు. జ్ఞానం కావాలంటే జ్ఞానం పండిచ్చుకోవచ్చు, ఆనందం కావాలంటే ఆనందం పండిచ్చుకోవచ్చు. చక్కని నేల, సారవంతమైన నేల దానినంతటికి దానినే వదలివేస్తే కలుపుమొక్కలు వాటికంతట అవే మొలచిపోతాయి. కనుక దానిని ముందుగా బాగా దుక్కి దున్నాలి. అలా దున్ని భగవంతుని పై భక్తి, విశ్వాసం అనే వర్షపు నీటిని చుట్టూ గట్టు వేసి బాగా నేలలోకి ఇంకి పోయేటట్లు చేయాలి.పొలంలోని రాళ్ళను ఏరి వేయాలి.కలుపు మొక్కలను ఏరివేయాలి.అపుడు ఆ పొలంలో ఏ గింజవేసినా అది చక్కగా మొలిచి పలసాయమిస్తుంది.. ప్రతి శరీరం ఓ ఉత్తమ క్షేత్రం. సారవంతమైన స్వర్ణభూమి.జ్ఞానము ఒక పుష్పము.అది పూయాలి. రసములు మనలో ఉండే రకరకాల ఆనందాదులు, రసములు. అవి భగవంతుడి ప్రీతికోసం ఏర్పడాలి చెయ్యల్సిన జీవుడు వ్యవసాయదారుడు. ఏ ప్రాణికుండే శరీరమైనా క్షేత్రమని అంటారు. ఇది క్షేత్రం అని ఎవడైతే తెలుసుకోగలుగుతాడో వాడు క్షేత్రజ్ఞుడు. ఎప్పుడూ కూడా కేవలం తెలుసుకోవడం కోసం కాకూడదు. తెలుసుకున్న దానికి అనుగుణంగా ఆచరించడంకోసం కావాలి.ఇది క్షేత్రమని తెలుసుకుంటే ఆ క్షేత్ర లక్షణాన్ని బట్టి, భూమి సారాన్ని బట్టి ఏ పంట ఏ సమయంలో వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందో,కలుపు ఎప్పుడు తీయాలో ,సస్యరక్షణ ఎప్పుడు చేయాలో తెలుసుకుంటే ఆపొలాన్ని ఎంతో ఆనందాన్ని, ఎంతో ఫలసాయం ఇచ్చేటట్లుగా తాను తీర్చిదిద్దుకుంటాడు.మనిషి ఒక్కడే ఈ వి ష యం తెలుసుకోగలుగుతాడు.. తెలుసుకుని మనిషి ఏం చేయాలి మంచి విత్తనాలను నాటాలి.13 వ అధ్యాయంలో భగవానుడు దాదాపు 20 గుణాలను మనకు బీజాలుగా నాటమని అందించి వాటిని అభ్యసించమన్నాడు. అభ్యసిస్తే ఏమవుతుంది. పొలాన్ని సక్రమంగా దున్ని పంటను పండిస్తే అది వానికి, సమాజానికి ఆహారం పెట్టి లోకాన్ని సుభిక్షంగా ఉంచినట్లే.

మనం కూడా అమానిత్వం, అదంభిత్వం, అహింస మొదలైన ఇరవై గుణాలను జాగ్రత్తగా అభ్యసించగలిగితే మనకు, మనతోటి వారికి, సమస్త ప్రాణికోటికి క్షేమాన్ని అందిస్తుంది

అమానిత్వమంటే మానము లేకుండుట. మానము అంటే మనసులో ఏర్పడే ఒకరకమైన గొప్పవాడిననే గర్వం.నేను గొప్పవాడిని అనుకునే అహంకార ప్రవృత్తి. ఇది నాల్గింటివల్ల ఏర్పడవచ్చు. విద్య ఎక్కువైతే విద్యలేనివాడిని గురించి గేలిచేయాలనిపిస్తుంది. అలా కాకూడదు. విద్యలేనివాడికి విద్యను నేర్పాలి. రెండవది నాకు మందీమార్బలం ఉందనుకోగానే ఆ బలగర్వంతోడి రెండవవాడ్ని హింసించాలనిపిస్తుంది. కానీ మనం చేయాల్సిన పని వాడిని ఉద్దరించాలి. గొప్పవంశంలో జన్మించానని అనుకోగానే అదిలేని వాడిని గేలి చేయాలనిపిస్తుంది. అలా అన్పించకూడదు వాడికి కూడా సమాజంలో ఒక ఔన్నత్యాన్ని కల్పించగలగాలి. డబ్బు ఉండగానే బీదవాడిని చూస్తే బానిసను చేసుకోవాలన్పిస్తుంది. అలాగాక వాడికి ఉపకారం చేయాలనిపించాలి. మంచి పదవి రాగానే అహంకారం, గర్వం పెరిగిపోతుంది. అలా కాకుండా పదిమందికీ ఉపకారం చేయాలనిపించాలి.

విద్య, మందీమార్బలం, ధన, అధికారం ఈ నాలుగు నాలుగు రకాల మదాలను కలిగిస్తాయి. అయితే ఈ మదములను త్రిప్పితే అవి దమములై మన ఆధీనంలో ఉండి, మనని లోకానికి ఉపకరించేటట్లు చేస్తాయి. అలా ఈ క్షేత్రంలో అమానిత్వం పండించాలి. మనం పండించకుండానే మొలిచేది మానం అంటే గర్వం. పొలంలో మనం పండించకపోయినా కలుపుమొక్కలు వచ్చినట్లు. ఆకలుపును తీసివేసి మంచి విత్తనాలు వేయాలి. సత్పలితాలనందించాలి లోకానికి. అయితే అది కృషి చేస్తే వస్తుంది. నేలను కృషి చేస్తే మంచి పంట పండినట్లే. అది బంగారు భూమి అయినట్లే. ఈ దేహం మంచి యోగ్యతలు కలుగడానికి తగినట్లుగా కృషి చేయాలి. అందుకే శ్రీ కృష్ణభగవానుడు భగవద్గీత 13వ అధ్యాయంలో ఇరవై గుణాలనిచ్చి ఆచరించి ప్రయత్నం చేసి ఈ క్షేత్రాన్ని సత్ఫలితాలు పండే సుక్షేత్రంగా తయారుచేసుకోమంటున్నాడు. ప్రయత్నిద్దామా మరి !

 
పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

sharma

Watch

Rayaprolu
Mallikharjuna
Sharma Garu
  • ntv
  • bhakthi-tv
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb