Valuable Information
::సకలపూజలు.కామ్ అభిమానులకు శుభవార్త ! ప్రేక్షకులకు శ్రీ కాశీభట్ల బాలకృష్ణ శర్మ గారు అన్నిరకముల జాతక సమస్యలకు ఖచ్చితమైన జాతక పరిశీలన చేసి ఆయా సమస్యలకు సరైన పరిహారములను తెలియజేయుదురు. 1. విద్యా, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, సంతానము, ఆరోగ్యము, విదేశీయాన మొదలగు జాతక సమస్యలు 2. వివాహ, వ్యాపార, గృహారంభ, గృహప్రవేశ, ఉపనయ తదితర వాటికి శుభ ముహూర్తములను నిర్ణయము చేయుట 3. వివాహ సంబంద జాతక పొంతలనకు మరియు వాస్తు సంబంద విషయములు. ఆసక్తి ఉన్నవారు అన్ని విషయములకు క్రింద తెలిపిన మొబైల్ ఫోన్ ద్వారా గాని లేదా ఈమైల్ ద్వారాగాని సంప్రదించవచ్చును. హైదరాబాద్ లో వుండే వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చు. ఇతర దేశాల్లో వుండే వారు ముందుగా ఈమెయిలు లో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు అడిగే ప్రశ్నలకు ఫోన్ ద్వారా గాని, ఈ మెయిల్ ద్వారా గాని సంప్రదించవచ్చు. అందరికి ఇదే మా ఆహ్వానం. ఫోన్ చేయవలసిన మా మొబైల్ నంబర్ : 9247326197

గురువు

గురువు దేవ గురువు. ఇతడు సద్బ్రాహ్మణుడు. గురువుకు బృహస్పతి అనేది ఇతడికి ఉన్న నామాలలో ఒకటి.ఇతడికి వాచస్పతి, దేవేజ్యుడు, ఆంగీరస, జీవ అనే ఇతర నామాలు ఉన్నాయి. ఆది వారంతో మొదలయ్యే వారాలలో గురువుది అయిదవ స్థానం. అందుకే దానిని బృహస్పతి వారం అని కూడా అంటారు. అత్యంత శక్తి వంతమైన గ్రహం. పురుష గ్రహం, అధి దేవత బ్రహ్మ, రుచులలో తీపికి రుచి కారకుడు, వయసు ముప్పై, ప్రకృతి కఫ ప్రకృతి, హేమంత ఋతువుకు అధిపతి, తత్వం ఆకాశ తత్వం, దిక్కు ఈశాన్య దిక్కును సూచిస్తాడు. లోహములలో బంగారమును, రత్నములలో పుష్యరాగమును సూచిస్తాడు. గురువు లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు. గోదావరి వింధ్య పర్వత నడుమ ఉన్న భూమికి గురువు అధిపతి. గురువు పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్రములకు అధిపతి. అంటే పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్ర జాతకులకు గురుదశ ప్రారంభ దశ. గురువు కటక రాశిలో ఉచ్ఛ స్థితిని, మకర రాశిలో నీచ స్థితిని పొందుతాడు. గురువు ధనస్సు రాశికి, మీనరాశికి ఆధిపత్యం వహిస్తాడు. గురువుకు మిత్రులు రవి, చంద్ర, కుజులు. శత్రువులు బుధ, శుక్రులు. సముడు శని. గురుదశ పదహారు సంవత్సరాలు. స్వభావం మృదు స్వభావం, సత్వగుణం, శుభ గ్రహం, జీవులు ద్విపాదులు, స్థానం ధనాగారం, అత్మాధికారత్వం జ్ఞానం, ధాతువు కొవ్వు, కుటుంబ సభ్యులు పుత్రుడు, గృహ స్థానం పూజ గది, ధన స్థానము, కాల బలం పగలు, స్థాన బలం లగ్నం, కాల ఆధిపత్యం మాసము, దిక్బలం తూర్పు, వర్ణం పసుపు వర్ణం, రాశిలో ఉండే కాలం ఒక సంవత్సరం, సమిధ రావి, మూలిక రావి అరటి వేరు, గోత్రము అంగీరస, వేదము ఋగ్వేదము, అవతారం వామనుడు.

1. రూపం

గురువుది స్థూల శరీరం, కపిల వర్ణ కనూలు, కపిల వర్ణ వెంట్రుకలు, పీతవర్ణ శరీర కాంతి కలవాడు. నాలుగు భుజములు కలిగి చేతులలో దండము, కమండలం, రుద్రాక్షమాల ధరించి ఉంటాడు. గురువు పీతాంబర ధారి, వాహనము సింహము. గురువు భార్య తార, తండ్రి అంగీరసుడు, తల్లి ప్రజాపతి మారీచి పుత్రిక అయిన సురూప.

2. గురువు కారకత్వం

ధనం,విద్య,పుత్రులు,జ్యేష్ట భ్రాత,దేహపుష్టి,బుద్ధి,అర్ధసంపద,యజ్ఞం,కీర్తి,గృహం,బంగారం,శస్త్రం,అశ్వం,మెదడు,జ్యోతిషం,వేదశాస్త్రం,శబ్ధశాస్త్రం, వాహనశాస్త్రం,ఆందోళికం,గంజం,యజ్ఞయాగాధి క్రతువులు,కర్మ,ఆచారం,ఛాందసం,సుజనత్వం,శాంతం,మంత్రిత్వం,ఐశ్వర్యం,బంధివృద్ధి,దయ, దాక్షిణ్యం,ధర్మం,దైవభక్తి,వస్త్రం,సత్యం,తర్కం,మీమాంస,సింహాసనం,వాగ్దోరిణి,పసుపురంగు,నృపసన్మానం,ధర్మం,వెండి,బ్రాహ్మణులు,జ్ఞానం, కోశాగారం,నవీనగృహం,బంధుసమూహం,సుబుద్ధి,ఉత్తరదిశ,కావ్యజ్ఞానం,నిక్షేపం,వైడూర్యం,ఊరువులు,అగ్నిమాంద్యం,దంతములు,వేదాంతజ్ఞానం, బ్రాహ్మణభక్తి,శ్రద్ధ,పాండిత్యం,బ్రాహ్మణవృత్తి,ఉపాద్యాయవృత్తి,ముద్రాధికారం,భాతృశుఖం,సంపత్తి,బహువిధ విద్వత్తు,వ్యాకరణం,రక్తం,పిత్తాశయం, రక్తనాళములు,ఉన్నత విద్యపై అధికారం,వాణిజ్య విషయములు,ధన విషయములు మొదలైనవి గురుగ్రహ కారకత్వాలు. ఆహార పదార్ధాలు నెయ్యి, నూనె, పాలు, వెన్నలకు కారకత్వం వహిస్తాడు. శనగలు, పనస కాయలు, దబ్బకాయలకు కారకత్వం వహిస్తాడు. పక్షులలూ పావురం, హంసలు జంతువులలో గుర్రములు, ఏనుగులకు, సింహములు వృక్షములలో వట వృక్షం కారకత్వం వహిస్తాడు. పుస్తకములు, కళాశాలలు, వైద్యులు, లాయర్లు, పూజారులు, ఫాదర్లు, బిషప్పులు, చర్చి మసీదు వంటి మత సంస్థలు, కరుణ, సంతోషం, పెట్టుబడులు, అభివృద్ధి , ఐశ్వర్యం, ఉపాసన, వీదేశీయులు, భవిష్యత్తు, బహుమతులు, ఆచారాలు బ్యాంకులు, ధనుర్విద్య, రేసులు, టైటిల్స్, నిజాయితీలను సూచిస్తాడు.

3. గురు ప్రభావం

గురు ప్రభావితులు స్థూలకాయం కలిగి మంచి ఆకారం కలిగి ఉంటారు. గురుగ్రహ ప్రభావితులకు ఆహారం, వస్త్రం వంటి జీవిత సౌఖ్యములు పుష్కలంగా ఉంటాయి. సంప్రదాయాల పట్ల గౌరవం, దైవభక్తి, పాండిత్యం, న్యాయ బుద్ధి, ధర్మనితరి, జ్ఞానం కలిగి ఉంటారు. చక్కని కంఠధ్వని, విశాల నేత్రాలు కలిగి ఉంటారు. విద్యావంతులై విద్యా సంస్థలతో సంబంధం కలిగి ఉంటారు. న్యాయశాస్త్ర అధ్యయనం, దేవాలయ వ్యవస్థ, విద్యా సంబదిత పదవులలో రాణిస్తారు.

4. కొన్ని విశేషములు

  1. వృత్తులు :- గురువు న్యాయవాదులు, న్యాయ మూర్తులు, బోధకులు, ఉపాద్యాయులు, సామాజిక రచయితలు, మత ప్రవక్తలు, పురోహితులు, మత ప్రచారకులు, ఉన్నత ప్రభుత్వ పదవులు వహిస్తారు. గురువు రవి చంద్రులతో కలిసిన బ్యాంకులు, అధ్యక్షులు, మేయర్, కౌన్సిలర్లు, పార్లమెంటు సభ్యులు, మేనేజరు, మేనేజింగు డైరెక్టర్లు అయ్యే అవకాశం ఉంది. గురు బుధులు కలిసిన విదేశీ భాషలు, ఎగుమతులు దిగుమతులు , సివిల్ ఇంజనీరింగ్ వంటి వృత్తులను సూచించును.
  2. వ్యాధులు :- మధుమేహం, కాలేయము, ప్రేగులకు సంబంధించిన వ్యాధులు, బోధకాలు, చెమట, నీరు చేరటం, నిస్సంతానం, కాన్సర్ వంటి వ్యాధులు.గురువు చంద్రుడితో కలిసిన గర్భాశయ వ్యాధులు, శుక్రుడితో కలిసిన మధుమేహం, విచిత్రమైన కోరికలు, రవితో కలిసిన కొలెస్ట్రాల్, మూత్ర పిండ వ్యాధులు, అతిమూత్ర వ్యాధి, పసికర్లు కామెర్లు వంటి వ్యాదులను సూచించును.
  3. గురువు ఆశ్వీజ శుక్ల ద్వాదశి గురు వారం ధనిష్టా నక్షత్రం నాడు అంగీరస సురూపలకు పుత్రుడుగా జన్మించాడు.

5. పూజా విధానం

గురువుని పూజించుటకు బంగారు ప్రతిమను వాడాలి. దధ్యోజనం, శనగలు నైవేద్యం చేయాలి. శివ సహస్ర నామావళి, గురువుకుఆధిదేవత బ్రహ్మ, ప్రత్యధి దేవత ఇంద్రుడు కనుక వీరిని ఆరాధించాలి. దోష నివారణకు పసుపు వర్ణ వస్త్రములను దక్షిణ తాంబూలముతో దానం చెయ్యాలి. గురు అష్టోత్తర నామావళి, దత్త చరిత్ర, బ్రహ్మంగారి చరిత్ర వంటి గురు చరిత్రలను పారాయణం చెయ్యాలి. గురువుకు ఇష్టమైన వ్రతం అనఘా వ్రతం. గురువుకు ప్రీతికరమైన రోజు అషాఢ పూర్ణిమ. ధరించ వలసిన మాలలు చందన మాల, పుష్యరాగ మాలలు. పంచ ముఖ రుద్రాక్షను ధరించ వచ్చు. బంగారం, పసుపు, శనగలు, పసుపు రంగు వస్త్రాలు దానం చెయ్యాలి. పసుపు రంగు పండ్లు, పసుపు రంగు పూలను పూజకు ఉపయోగించాలి. గ్రహశాంతికి చేయవలసిన జపం పదహారు వేలు. హోమముకు రావి చెట్టు పుల్లలను వాడాలి. గురువులను ఆరాధించుట, గురువు ఆలయాలను దర్శించుట, గురుదీక్షలను స్వీకరించుట వలన దోష నివారణ చేయవచ్చు.

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

sharma

Watch

Rayaprolu
Mallikharjuna
Sharma Garu
  • ntv
  • bhakthi-tv
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb