దక్షిణావర్త శంఖం | ||||
లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువుల్లో ఒకటి శంఖం. లక్ష్మీదేవి క్షీరసముద్రరాజతనయ, పాలకడలి లో జన్మించినది. శంఖం ఉన్న చోట లక్ష్మి దేవి ఉంటుందనే భావన ఈ విషయాన్ని లస్ఖ్మిదేవి చెప్పింది. వాసామి పద్మోత్పల శంఖమధ్యే వాసామి చందేమహేశ్వరౌచ ఇక్కడ దక్షిణావర్త శంకం ఫోటో రావాలి శంఖు చక్ర గదా పద్మధారిగా హరిని అభివర్ణిస్తారు. పోతన భాగవతంలో గజేంద్ర మోక్ష ఘట్టంలో సిరికింజెప్పెడు, శంఖచక్రయుగమున్ చేదోయి సందింపడు అంటూ అభివర్ణిస్తాడు. హిందువుల పూజా విధి విధానాల్లో శంఖానికి చాలా ప్రాముఖ్యత వుంది. అందుకే " శంఖంలో పోస్తే కాని తీర్థం కాదు " అంటారు. శంఖాన్ని ఉదడం ద్వారా ఆ యింటిలో ఉన్నటువంటి భయాలు పోతాయి. మరియు ఆధునికంగా వైరస్ క్రిములు చనిపోతున్నాయి అని సైంటిస్టులు కనుగొన్నారు. దక్షిణావర్త శంఖం : ఊదే భాగాన్ని మనకి ఎదురుగా ఉంచాలి. అలా ఉంచినప్పుడు మనకి కుడివైపు కడుపు లేదా నోరు తెరుచుకున్న భాగం ఉంటె అది దక్షిణావర్త శంఖం అంటారు. పూజా విధానంలో ఒక మంచిరోజు దక్షిణావర్త శంఖాన్ని తీసుకొని రాతి ఉప్పు నీళ్ళలో మొదట శుభ్రం చేసి తరువాత పసుపునేతిలో శుభ్రం చేసిన తరువాత చివరగా పాలతో శుద్ధి చేసి పూజా మందిరం లో ఒక పీత మీద ఎర్రటి గుడ్డను వుంచి, పుష్పాలు ఉంచి దానిమీద దక్షిణావర్త శంఖాన్ని ఉంచి పసుపు, కుంకుమ, ధూప, దీప నైవేద్యాలు సమర్పిస్తూ ఈ మంత్రాన్ని చదువ వలెను. ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిన్యై ధనధాన్య సమృద్ధి దేహి దేహి స్వాహా వివాహం ఆలస్యం అవుతున్నా, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నా, వ్యాపార అభివృద్ధి కొరకు దక్షిణావార్త శంఖాన్ని ఎవరైతే పూజిస్తారో ఆ ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. దీనిలో గంగాజలం నింపి భూత , ప్రేత, పిశాచ దుష్ట గ్రహాదులు దోషాలు పోతాయి. శంఖాన్ని శుక్ర గ్రహ ప్రతీకగా చెబుతారు. జాతకం లో శుక్ర గ్రహం అనుకూలంగా మరల్చుకొనుటకు దక్షిణావర్త శంఖం పూజ మంచి రెమెడి. * నెగెటివిటి పోవాలన్నా, దృష్టి దోషాలు పోవాలన్నా, సుఖ శాంతులతో ఆనందంగా జీవితం గడచిపోవాలంటే దక్షిణావర్త శంఖాన్ని పూజించాలి. * అంటే దక్షిణావర్త శంఖాన్ని పూజిస్తే ఆ గ్రహాలలో సమస్త బాధలు నివారణ అవుతున్నాయి అన్నమాట. * వ్యాపార అభివృద్ధి కొరకు దక్షిణావర్త శంఖాన్ని వాయువ్యం లో ఉంచాలి. శంఖు తీర్థాన్ని ప్రతిరోజూ తీసుకున్నట్లయితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సంతానం తొందరగా కలుగుతుంది. ఈ తీర్ధాన్ని ఇంట్లో నాలుగు మూలల చల్లినట్లయితే వాస్తు దోషాలు నివారణ అవుతాయి. భరణీ, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు, వృషభ, తుల, మకర కుంభ రాశుల వాళ్ళు ఈ దక్షిణావర్త శంఖాన్ని పూజించడం మంచిది. |