Valuable Information
::సకలపూజలు.కామ్ అభిమానులకు శుభవార్త ! ప్రేక్షకులకు శ్రీ కాశీభట్ల బాలకృష్ణ శర్మ గారు అన్నిరకముల జాతక సమస్యలకు ఖచ్చితమైన జాతక పరిశీలన చేసి ఆయా సమస్యలకు సరైన పరిహారములను తెలియజేయుదురు. 1. విద్యా, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, సంతానము, ఆరోగ్యము, విదేశీయాన మొదలగు జాతక సమస్యలు 2. వివాహ, వ్యాపార, గృహారంభ, గృహప్రవేశ, ఉపనయ తదితర వాటికి శుభ ముహూర్తములను నిర్ణయము చేయుట 3. వివాహ సంబంద జాతక పొంతలనకు మరియు వాస్తు సంబంద విషయములు. ఆసక్తి ఉన్నవారు అన్ని విషయములకు క్రింద తెలిపిన మొబైల్ ఫోన్ ద్వారా గాని లేదా ఈమైల్ ద్వారాగాని సంప్రదించవచ్చును. హైదరాబాద్ లో వుండే వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చు. ఇతర దేశాల్లో వుండే వారు ముందుగా ఈమెయిలు లో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు అడిగే ప్రశ్నలకు ఫోన్ ద్వారా గాని, ఈ మెయిల్ ద్వారా గాని సంప్రదించవచ్చు. అందరికి ఇదే మా ఆహ్వానం. ఫోన్ చేయవలసిన మా మొబైల్ నంబర్ : 9247326197

మాసానాం మార్గశీర్షోహం

మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. అంటే ఈ మాసం అంత విశిష్ఠతను సంతరించుకుందని అర్థం.ఇది సంవత్సరంలో తొమ్మిదవ మాసం. మీరు గమనించండి ఈ మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉంటుంది.  మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసమే  ఈమార్గశీర్షం.
 ఇక ఈ మాసంలో ఒక్కొక్క రోజుకు ఉన్న విశేషాలను తెలుసుకుందాం!

మార్గశిర శుద్ధ పాడ్యమి :

పాడ్యమి రోజున  గంగాస్నానం చేస్తే కోటి సూర్య గ్రహణ స్నానాలు చేసిన ఫలం కలుగుతుంది 
మార్గశిర శుద్ధ తదియ :
ఉమామహేశ్వర, అనంత తృతీయ, యోగతృతీయ, నామతృతీయ, ఫలత్యాగ వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది.
మార్గశిర శుద్ధ చవితి :
ఈరోజున వరదచతుర్థీ, నక్త చతుర్థీ వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి ద్వారా తెలుస్తుంది.
మార్గశిర శుద్ధ పంచమి :
ఇది నాగపంచమిగా దక్షిణాదిన ప్రసిద్ధికెక్కింది. ఈనాడు నాగపూజ చేయాలని స్మృతి కౌస్తుభం చెబుతోంది. శ్రీ పంచమి వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది.

మార్గశిర శుద్ధ షష్ఠి :
మన పంచాగకర్తలు ఈరోజును స్కంద షష్టి అని,  సుబ్బరాయ షష్ఠి అని అంటారు.తెలుగు వారు సుబ్బరాయ షష్టి అని  అరవవారు దీన్ని స్కందషష్ఠి అంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఈనాడు పూజిస్తారు. ఇది గోదావరి ప్రాంతంలో రైతులకు పెద్ద పండుగ. ఈ రోజున చంపాషష్ఠి, ప్రవార షష్ఠి వ్రతాలను కూడా చేస్తారు.
మార్గశిర శుద్ధ సప్తమి :
నీలమత పురాణంలో ఈనాడు సూర్యపూజ చేయాలని ఉంది. స్మృతి కౌస్తుభం దీనిని మిత్రసప్తమి అంటోంది. నయనప్రద సప్తమి, సితసప్తమి, ఉభయసప్తమి, పుత్రీయ సప్తమి, ద్వాదశసప్తమి మున్నగు వ్రతాలు ఈనాడు చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతుంది.
మార్గశిర శుద్ధ అష్టమి :
మహేశ్వరాష్టమి, సౌమ్యాష్టమి, ప్రథమాష్ఠమి, భద్రాష్టమి, భీష్మాష్టమి, దుర్గాష్టమి, అన్నపూర్ణాష్టమి అనే పేర్లు ఉన్నాయి.తెలుగునాట కాలభైరవాష్టమిగా ప్రసిద్ధి చెందింది. ఈనాడు కాలభైరవ పూజచేయాలని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి.

మార్గశిర శుద్ధ నవమి :
చతుర్వర్గ చింతామణిలో ఈరోజున త్రివిక్రమ త్రిరాత్ర వత్రం ఆచరిస్తారని ఉంది. దేవీపూజ చేస్తారని పురుషార్థ చింతామణి తెలుపుతుంది.
మార్గశిర శుద్ధ ఏకాదశి :
దీనికే మోక్షదైకాదశి అని పేరు ఉంది. వైఖానసుడు అని ఒకరాజు. అతనికి ఒకనాడు తన తండ్రి నకరంలో ఉండిపోయి యమయాతనలు పడుతూ ఉన్నట్లు కల వచ్చింది. అందుకు అతను మార్గశిర శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం ఉండి నియమాలతో వ్రతం చేశాడు. ఆ వ్రత ఫలితంగా అతని తండ్రి స్వర్గలోకానికి చేరాడు. తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి కావడం చేత దీనికి మోక్షదైకాదశి అని పేరు వచ్చింది. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి జనన మరణ రహితమైన మోక్షప్రాప్తి కులుగుతుందని చెబుతారు.

మార్గశిర శుద్ధ ద్వాదశి :
మత్స్య ద్వాదశి, రాజ్య ద్వాదశి, సునామ ద్వాదశి, తారక ద్వాదశి, అపరా ద్వాదశి, శుభ ద్వాదశి, అఖండ ద్వాదశి వ్రతాలు, దశావతార వత్రం, సాధ్య వ్రతం మొదలగు వ్రతాలు ఈనాడు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి ద్వారా తెలుస్తుంది. భూలోకంలో మూడుకోట్ల తీర్థాలు ఉన్నాయి. ఆ తీర్థాలన్నీ మార్గశిర శుద్ధ ద్వాదశి అరుణోదయ సమయంలో తిరుపతి కొండమీద స్వామి పుష్కరిణిలో ప్రవేశిస్తాయని పురాణాల్లో ఉంది. అందుకే ఏడుకొండల వెంకటేశ్వరస్వామి పుష్కరిణికి ఈనాడు తీర్థదినంగా పూజిస్తారు.
మార్గశిర శుద్ధ త్రయోదశి :
అనంగ త్రయోదశీ వ్రతం ఆచరిస్తారు. ఈనాడు గోదావరి ప్రాంతంలో హనుమజ్జయంతి జరుపుతారు.

మార్గశిర శుద్ధ చతుర్దశి :
ఈనాటి నుంచి చాంద్రాయణ వ్రతం చేస్తారు. ఈనాడు రాత్రి వరకు భోజనం చేయకుండా ఉండి గౌరీదేవిని ఆరాధించాలి.
మార్గశిర శుద్ధ పూర్ణిమ :
ఈనాడు చంద్రుని పూజ చేయాలని నీలమత పురాణం, చంద్ర వ్రతం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. తెలుగులో దీన్ని కోరల పున్నమ అంటారు.
మహారాష్ట్రులు ఈనాడు దత్తజయంతిని జరుపుకుంటారు. త్రిమూర్తి స్వరూపుడైన దత్తుడు జన్మించిన రోజు కనుక ఈనాడు అన్నిచోట్ల దత్త సంప్రదాయ రీతిలో దత్తాత్రేయునికి పూజలు నిర్వహిస్తారు.

మార్గశిర శుద్ధ పాడ్యమి :
చంద్రార్ఘ్య వ్రతం చేయాలని గదాధరపద్ధతి, శీలావాప్తి వ్రతం చేయాలని తరుర్వర్గ చింతామణి పేర్కొన్నాయి.
మార్గశిర కృష్ణ సప్తమి :
ఈనాడు ఫల సప్తవిూ వ్రతం, తమశ్చరణ వ్రతం ఆచరిస్తారు.
మార్గశిర కృష్ణ అష్టమి :
భైరవ జయంతీ వ్రతం ఆచరిస్తారని స్మృతికౌస్తుభంలో ఉంది.

మార్గశిర కృష్ణ ఏకాదశి :
దీనికి సఫలైకాదశి అని పేరు.
మార్గశిర కృష్ణ ద్వాదశి :
మల్లద్వాదశి, కృష్ణద్వాదశి వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతుంది.
మార్గశిర కృష్ణ త్రయోదశి :
దీనికి యమదర్శన త్రయోదశి అని పేరు.
మార్గశిర కృష్ణ అమావాస్య :
ఈరోజు పాలతో పాయసం వండి దేవునికి నైవేద్యం పెట్టాలి.

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

sharma

Watch

Rayaprolu
Mallikharjuna
Sharma Garu
  • ntv
  • bhakthi-tv
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb