Valuable Information
::సకలపూజలు.కామ్ అభిమానులకు శుభవార్త ! ప్రేక్షకులకు శ్రీ కాశీభట్ల బాలకృష్ణ శర్మ గారు అన్నిరకముల జాతక సమస్యలకు ఖచ్చితమైన జాతక పరిశీలన చేసి ఆయా సమస్యలకు సరైన పరిహారములను తెలియజేయుదురు. 1. విద్యా, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, సంతానము, ఆరోగ్యము, విదేశీయాన మొదలగు జాతక సమస్యలు 2. వివాహ, వ్యాపార, గృహారంభ, గృహప్రవేశ, ఉపనయ తదితర వాటికి శుభ ముహూర్తములను నిర్ణయము చేయుట 3. వివాహ సంబంద జాతక పొంతలనకు మరియు వాస్తు సంబంద విషయములు. ఆసక్తి ఉన్నవారు అన్ని విషయములకు క్రింద తెలిపిన మొబైల్ ఫోన్ ద్వారా గాని లేదా ఈమైల్ ద్వారాగాని సంప్రదించవచ్చును. హైదరాబాద్ లో వుండే వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చు. ఇతర దేశాల్లో వుండే వారు ముందుగా ఈమెయిలు లో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు అడిగే ప్రశ్నలకు ఫోన్ ద్వారా గాని, ఈ మెయిల్ ద్వారా గాని సంప్రదించవచ్చు. అందరికి ఇదే మా ఆహ్వానం. ఫోన్ చేయవలసిన మా మొబైల్ నంబర్ : 9247326197

పుంసవనము

 

పుంసవనము 

    ఈ సంస్కారము గర్భ రాక్షనార్ధము ఏర్పడినది.  మూడవ నెల మొదలు నాలుగవ నెల వరకు, ఆరవ నేలనుండి ఎనిమిదవ నేలవర్ద్కు ఉండు కాలము గర్భమందు ఉండు శిశువునకు విశేషమగు నష్టము నివారించుటకు ఈ సంస్కారము చేయబడుతున్నది.  ఇది మూడవ నెలలో మొదటి పడి దినములలో చేయవలెను.  పుంసవన పదమునకు "పుత్ర సంతతి కనుట"  అని అర్ధము.  నాలుగు నెలలకు పూర్వము శిశువునకు స్త్రీ చిహ్నములు గాని, పురుష చిహ్నముల కాని సాధారణముగా ఏర్పడవు.  ఇట్టి చిహ్నములు తెలియబడక ముందే పుంసన సంస్కారము విదిమ్పబడినది.  

         ఈ సంస్కారము వలన గర్భవతికి భయము, చింత, బడలిక, దు:ఖము నశించి గర్భ పోషణకు తగిన బలము కూడా చేకూరుతుంది.  యోని యందుండు మాలిన్యాది దోషము తొలగిపోవును.  పుంసవనము ఒక వైద్య సంస్కారము క్రింద పరిగనించ వచ్చును.  భార్య గర్భాన్ని ధరించిన పిదప గర్భాములోని పిండము లేదా గర్భస్థ శిశువు ఆరోగ్యముతో పెరుగుటకు, దానికి సంభందిత అన్ని అంగములు అత్యంత ఆరోగ్యవంతముగా ఉండుటకు కొన్ని మాలికలను మంత్రోచ్చారణ ద్వారా భార్య యొక్క కుడి నాసిక ద్వారా వాదులు చర్యయే పుంసవనము.  సోర్య భగవానుడు సంతానాన్నిచ్చు వాడిగా అరుణ ప్రశ్న పేర్కొంటున్నది.  ముఖ్యముగా పుత్ర సంతానాన్ని ప్రసాదించువాడు సూర్యనారాయనుడే మనమే గ్రహించాలి.  సుర్యనారాయనుడు ఒశాడులకు అధిపతి కూడా.  ఓజా శక్తి ప్రసాదించువాడు.  సంభోగానికి కావలసిన శక్తిని ప్రసాదించువాడు.  పుత్ర సంతానము కల్గించు వీర్యాన్ని ప్రసాదించువాడు కూడా, కావున పుత్ర సంతానము కొరకై అరుణ హోమాన్ని చేస్తారు.  

పుంసవన విధానము:

ప్రాతః కాలముననే లేచి, నిత్య కాల క్రుత్యములను తీర్చుకోనిన పిదప అభ్యంగన స్నానము చేసి, నిత్య ఔపాసనము ముగించుకోనిన పిదప పుంసవన సంస్కారమునకు సంసిద్ధులు కావాలి.  శుభ దినమున మరియు శుభ ముహూర్తమున ఇట్టి పుంసవనమును ప్రారంభించాలి. ఈ సంస్కారము చేసిన గర్భస్థ శిశువు పవిత్రమగును, ఓషధులను తీసుకొనుట వలన అట్టి శిశువు శుద్ధి నొంది ఆరోగ్యవంతుడై ఉండును.  ఇట్టి సంస్కారము నందు ఉచ్చరించు మంత్ర ప్రబావము వలన "గర్భస్థ శిశువునకు గత జన్మల గూర్చి స్మరించుకొను అవకాశము కలుగును.  

         సంస్కార ప్రారంభమున గణపతి పూజ, పున్యావాచానము జరిపి, సంకల్ప సహితముగా పుంసవనము ప్రారంభించాలి.  భార్యకు ఉత్తర భాగమున ఆసీనుదగుట, రక్షాబంధనమును గావించుట, దాటా దదాతు మొదలగు మంత్రములతో ఎనిమిది హోమములను జరపాలి.  ఇట్టి హోమమునకు బ్రహ్మ ధనాన్ని ఇచ్చువాడు వారియు యజమానికి సంతానాన్ని ఇచ్చువాడు.  బ్రహ్మ సృష్టికర్త కావున బ్రహ్మ దేవునికి హవిస్సును సమర్పించు విధానము పుంసవనమున వున్నది.  ఇది అత్యంత విశేషమైనది.  సమస్త దేవతలు, అదితి మరియు అశ్విని దేవతలు తమయందు దయవుంచమని కోరునది.  ఇట్టి మంతాలను భర్త  పఠించాలి లేదా బ్రాహ్మణుని ద్వారా చెప్పించ వలెను.  పిదప జయాది హోమాలను చేయునది, పిదప రజస్వల కాని కన్యా చేత కల్వామందు పాత్రముతో రెండు పండ్లు గల అనగా జంట పండ్లు గల మర్రి జిగురును చక్కగా నూరించి నూతన వస్త్రముతో వదపోయించి అగ్నికి పడమర దిశా యందు, గర్భవతి అయిన భార్యను తూర్పు దిశ యందు శిరస్సు నుంచి ముఖముపైకి ఉండు విధముగా పరున్దపెట్టాలి.  "పుగుమ్సువమసి" మొదలుగాగల మంత్రములను చెప్పుతూ భర్త తన బొటన వ్రేలితో భార్య కుడి నాసికమునందు పిండాలి.  ఈ విధముగా పిండిన రసాన్ని భార్య ఉమ్మి వేయరాదు.  ఈ విధంగా సంత్రోచ్చారణతో కుడి నాసికనండు పిండిన రసము గర్భమునందు ప్రవేశించి పుత్ర సంతానాన్ని ఇచ్చుట మాత్రమె గాక గర్భస్థ శిశువును ఆరోగ్యముగా ఉంచుటకు మరియు శిశువు యొక్క శరీరములోని అంగములు చక్కగా అభివృద్ధి చెందు విధముగా తోడ్పాటుకు సూచనలు వున్నాయి. 
పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

sharma

Watch

Rayaprolu
Mallikharjuna
Sharma Garu
  • ntv
  • bhakthi-tv
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb