Valuable Information
::మేషరాశి: ...క్రయవిక్రయాల్లో ధనలాభము..... యత్న కార్యాసిద్ధి....... నూతన పరిచయాలేర్పడును.....శుభవార్తలు వింటారు...... శుభ కార్యాలుంటాయి...... అధికార ప్రాప్తి కలదు...... ఇతరుల సహాకారము లభించును......వాహనములు కొనుగోలు చేస్తారు....... విందు వినోదాలుంటాయి. .......వారము మధ్యనుండి ఖర్చులు అధిక మగును...... పనులందు ఆటంకాలు, కలహాలుంటాయి..... ప్రయాణములందు జాగ్రత్తగా వుండాలి....... ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదు......... పరిహారములు: లక్ష్మీదేవి, గురుగ్రహ ఆరాధనలు. శెనగలు, బొబ్బర్లు దానము.

ముహూర్తం చూడడం ఎలా?

ముహూర్తం చూడడం ఎలా?

 శ్లో// చక్షుషే జగతాం కర్మసాక్షిణే తేజసాంనిధేః

మూర్తి త్రయ స్వరూపాయ మార్తాండాయ నమోనమః//

       మనం ఒక అధికారి దగ్గరికి పనిమీద వెళ్లేటప్పుడు  అధికారి కోపంలో ఉన్నాడా!?, సంతోషంలో ఉన్నాడా!? మొదలైన   విషయాలు తెలుసుకుని అతను సంతోషంలోఉన్నప్పుడు వెళితే మన పని త్వరగా అవుతుందిఅలాగే తెలివైన వారు కాలం యొక్క స్వభావాన్ని తెలుసుకుని మంచి కాలములో తగిన పనులు చేయ తలపెడతారుఅన్నికాలాలూమనకు జయాన్ని ఇవ్వవుఒక సమయంలో ఒకరికి శుభం జరిగితే మరొకరికి కష్టం కలగవచ్చుమనం పుట్టిన సమయాన్ని బట్టి మనకు మాత్రమే ప్రత్యేకంగా సరిపడు కాలంతెలుసుకోవాలిమనం పుట్టిన సమయానికి ఉన్న నక్షత్ర,లగ్న ములను బట్టి మనకుమనం తలపెట్టిన పనికి సరిపడు నక్షత్రలగ్న సమయాలు తెలుసుకుని ముందడుగు వేయడంజయాన్ని కలిగిస్తుంది.  కాలం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఋషులు మనకు అందించిన అద్భుత వరం “జ్యోతిష్య శాస్త్రందీని ఆధారంగా మన జీవితంలో జరుగువివాహముఉపనయనముగృహప్రవేశము మొదలైన కర్మలను  రోజు సమయంలో జరుపుకోవచ్చో తెలుసుకొనవచ్చు.

ముహూర్తం చూసే ప్రక్రియలో ముఖ్యంగా  క్రింధి విషయాలు గమనించాల్సి ఉంటుంది.

1తారా బలం2చంద్ర బలం2లగ్న బలం3పంచక రహితం4ఏకవింశతీ మహా దోషాలు

 వీటి తో పాటు చివరిగా ఆయా క్రతువులకు పనికి వచ్చే తిథివారనక్షత్రాలనే వాడామా లేదా అనే విషయం కూడా తప్పకుండా నిర్థారించుకోవాలి.

 ఉదాహరణకు : మనం అడిగి మరీ పెట్టించుకునే “ఆదివారం  గృహప్రవేశంఉపనయనంవివాహం మొదలైనవాటికి తగిన వారంగా పేర్కొన బడలేదుబుధ,గురుశుక్రవారములు చాలావరకు శుభకార్యములకు మంచివిగా పెద్దలు తెలిపారు.  అయితే వారము కన్నా తిథితిథికన్నా నక్షత్రమునక్షత్రముకన్నా లగ్నమూ అత్యంత బలీయములుకనుక నక్షత్రలగ్నములుఅనుకూలముగా ఉన్నచో తిథివారములు మధ్యస్థముగా ఉన్ననూ స్వీకరిస్తుంటారు.

  ఒక పని ముఖ్యంగా వైదికసంబంధమైన వివాహ గృహప్రవేశాది క్రతువులు చేయతలపెట్టినప్పుడు  విషయాలు అన్నీ గమనించి శుద్ధపరచిన శుభముహూర్తములు  గ్రహించాలి.                           

చంద్ర బలం:  ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు పరిశీలించవలసిన ముఖ్యమైన విషయాలలో చంద్రబలం ఒకటిముహూర్త సమయానికి చంద్రుడు ఉన్న రాశిని బట్టి బలాన్నినిర్ణయించాలిఎవరికొరకు ముహూర్తం చూస్తున్నామో వారి జన్మ రాశినుండిముహూర్తం నిర్ణయించదలచిన రోజున చంద్రుడు ఉన్న రాశివరకు లెక్కించాలి.

 జన్మ రాశినుండి ముహూర్త సమయ చంద్రరాశి

శుక్ల పక్షంలో :  2-5-9

క్రిష్ణ  పక్షంలో :  4-8-12

శుక్లపక్షంక్రిష్ణ పక్షం రెండిటిలోనూ : 1,3,6,7,10,11 అయితే మంచిది.

అనగా శుక్లపక్షంలో చంద్రుడు  4-8-12 స్థానాలలో ఉంటే  ముహూర్తానికి చంద్ర బలం లేనట్లేమిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే.

కృష్ణ పక్షంలో చంద్రుడు 2-5-9 స్థానాలలో ఉంటే  ముహూర్తానికి చంద్ర బలం లేనట్లేమిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే.

👉   తారాబలం చూడటం ఎలా?

    ముహూర్త నిర్ణయంలో ప్రథానమైనది తారాబలం.    చిన్న ముహూర్తానికైనా మన జన్మ నక్షత్రానికి సరిపోయే నక్షత్రమును మాత్రమే తీసుకోవాలిజన్మ నక్షత్రం నుండి ముహూర్తసమయానికి ఉన్న నక్షత్రం వరకు లెక్కించగా వచ్చిన సంఖ్యను 9 చే భాగహరించాలివచ్చిన శేషాన్ని బట్టి ఫలితం క్రింది విదంగా నిర్ణయించాలి.

   వస్తే ‘జన్మతార’ అలా వరుసగా....

1) జన్మతార,  2) సంపత్తార,  3) విపత్తార, 4) క్షేమ తార, 5) ప్రత్యక్తార, 6) సాధన తార, 7) నైధన తార, 8) మిత్ర తార, 9) పరమమిత్ర తార.

ఇవేవో అశ్వనిభరణికృత్తికల వలే వేరే కొత్త తారలు అనుకోకండి.   27  నక్షత్రాలకే మన జన్మతారను బట్టి  తొమ్మిది పేర్లు అన్వయించాలి.  అంటే ‘విద్యార్థి’ అనే పేరు గల వ్యక్తిఉన్నాడుఅతను ఒకరికి కొడుకుఒకరికి తమ్ముడుఒకరికి భర్త అవుతాడుఅలాగే అశ్వనీ నక్షత్రం ఒకరికి జన్మతార అయితేమరొకరికి సంపత్తార ( సంపదలు కలిగించే తార ) అవుతుంది.  మరొకరికి విపత్తార ( విపత్తులు కలిగించే తార ) అవుతుందిఎవరికి ఏమవుతుంది అన్నది వారి జన్మనక్షత్రాన్ని బట్టి నిర్ణయించుకోవాలి

 పైవాటిలో  సంపత్తారక్షేమ తారసాధన తారమిత్ర తారపరమమిత్ర తారలు ( 2,4,6,8, 9 తారలు ) సకల శుభకార్యాలు చేసుకోవడానికి పనికి వస్తాయివృత్తి,వ్యాపార సంబంధమైనవిషయాలు ‘సంపత్తార’ లోను,  ప్రయాణాది కార్యాలు ‘క్షేమతార’ లోనుసాధించి తీరాలనుకునే కార్యాలు ‘సాధనతార’ లోను ప్రారంభించడం మరింత మంచిది.


జన్మతార కొన్ని శుభకార్యాలకు పనికొస్తుందికొన్నిటికి పనికి రాదు.

చెవులు కుట్టడంఅన్నప్రాశనఅక్షరాభ్యాసంఉపనయనంనిషేకంయాగంపట్టాభిషేకంవ్యవసాయంభూసంపాదన మొదలైన వాటికి జన్మతారను గ్రహించ వచ్చు.

ప్రయాణంపెండ్లిక్షౌరముఔషధ సేవనంగర్భాదానంశ్రార్థంసీమంతంపుంసవనము మొదలైనవి జన్మనక్షత్రంలో చేయరాదు.

 ఉదాహరణ :  రేవతి నక్షత్రం జన్మ నక్షత్రం అనుకుంటే,  ముహూర్త నిర్ణయంరోజు పూర్వాభాద్ర నక్షత్రం ఉంది అనుకుంటేరేవతికి పూర్వాభాద్ర సరిపోతుందో లేదో తెలుసుకోవాలి.   అంటేరేవతి నుండి పూర్వాభాద్ర ఎన్నో నక్షత్రమో లెక్క పెట్టాలి. 26  నక్షత్రం అవుతుందిదానిని తొమ్మితో భాగహరించగా శేషం 8 వస్తుందిఅంటే రేవతికి - పూర్వాభాద్ర ఎనిమిదో తార ( మిత్రతార ) అవుతుందిఅంటే శుభం కనుక ముహూర్తము పనికొస్తుంది.

శేషం సున్నా వస్తే అది తొమ్మిదిగా గుర్తించాలి.

 తప్పని సరి పరిస్థితులలో ముహూర్తనిర్ణయం చేయవలసి వస్తే .....

 ప్రథమే ప్రథమం త్యాజ్యం ద్వితీయేతు తృతీయకం   తృతీయే పంచమం త్యాజ్యం నైధనం త్రిషువర్జయేత్ !

 

ప్రథమ నవకం లో ( 1 నుండి 9 తారలలో ) మెట్ట మొదటి తారను

 నవకం లో ( 10 నుండి 18 తారలలో )మూడవ తారను

 నవకంలో( 19 నుండి 27 తారలలో ) పంచమ తారను

ప్రతీ నవకంలో 7 వతారను ఎల్లప్పుడు   వదిలి పెట్టవలెను.

అంటే జన్మనక్షత్రము లగాయతు  1, 7, 12, 16, 23 మరియు 25 నక్షత్రాలను ఎల్ల వేళలా శుభకార్యములలో వదిలిపెట్టాలి.

 అంటే సాధారణంగా జన్మ నక్షత్రం నుండి  1,3,5,7,10,12,14,16,19,21,23 మరియు 25 నక్షత్రాలను శుభకార్యములలో వదిలిపెట్ట వలసి ఉన్నదికానీ కావలసిన సమయము లోపలముహూర్తములు కుదరని పక్షమున 1, 7, 12, 16, 23 మరియు 25 తారలు మాత్రం వదిలి మిగతావి రెండవ ఎంపికగా గ్రహించ వచ్చును.

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

sharma

Watch

Rayaprolu
Mallikharjuna
Sharma Garu
  • ntv
  • bhakthi-tv
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb