Valuable Information
::సకలపూజలు.కామ్ అభిమానులకు శుభవార్త ! ప్రేక్షకులకు శ్రీ కాశీభట్ల బాలకృష్ణ శర్మ గారు అన్నిరకముల జాతక సమస్యలకు ఖచ్చితమైన జాతక పరిశీలన చేసి ఆయా సమస్యలకు సరైన పరిహారములను తెలియజేయుదురు. 1. విద్యా, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, సంతానము, ఆరోగ్యము, విదేశీయాన మొదలగు జాతక సమస్యలు 2. వివాహ, వ్యాపార, గృహారంభ, గృహప్రవేశ, ఉపనయ తదితర వాటికి శుభ ముహూర్తములను నిర్ణయము చేయుట 3. వివాహ సంబంద జాతక పొంతలనకు మరియు వాస్తు సంబంద విషయములు. ఆసక్తి ఉన్నవారు అన్ని విషయములకు క్రింద తెలిపిన మొబైల్ ఫోన్ ద్వారా గాని లేదా ఈమైల్ ద్వారాగాని సంప్రదించవచ్చును. హైదరాబాద్ లో వుండే వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చు. ఇతర దేశాల్లో వుండే వారు ముందుగా ఈమెయిలు లో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు అడిగే ప్రశ్నలకు ఫోన్ ద్వారా గాని, ఈ మెయిల్ ద్వారా గాని సంప్రదించవచ్చు. అందరికి ఇదే మా ఆహ్వానం. ఫోన్ చేయవలసిన మా మొబైల్ నంబర్ : 9247326197

లక్ష్మీప్రదమైన మాసం శ్రావణ మాసం

లక్ష్మీప్రదమైన మాసం శ్రావణ మాసం

లక్ష్మీ సర్వ సంపదలకీ అధిష్ఠాతృ దేవత. ఇంద్రియ నిగ్రహంశాంతంసుశీలత్వం వంటి సుగుణాలకు ఆధారమైన సర్వ మంగళ రూపం లక్ష్మీదేవిది. లోభంమోహంరోషంమదంఅహంకారం వంటి గుణాలేమి లేని చల్ల చల్లని తల్లి ఆమె. సర్వ సస్యాలు ఆమె రూపాలే.

వైకుంఠంలో మహాలక్ష్మిస్వర్గంలో స్వర్గలక్ష్మిరాజ్యంలో రాజ్యలక్ష్మిగృహాలలో గృహలక్ష్మి అంటూ సర్వ ప్రాణులలోద్రవ్యాలలో మనోహరమైన శోభ లక్ష్మీ రూపమే. లక్ష్మీదేవి అన్నిచోట్ల ఉండే దయారూపిణి. అలాంటి లక్ష్మీదేవిని పూజించే లక్ష్మీప్రద మాసమైన మాసం శ్రావణమాసం. ఈ మాసం లక్ష్మీదేవిని ఆరాధించేవారి సకల సంపదలు చేకూరుతాయి. ఇంకా వరలక్ష్మీవ్రతం ఆచరించే వారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు శుభ ఫలితాలను ఆ లక్ష్మీమాత అనుగ్రహిస్తుంది.
సోమశుక్రవారం.. లక్ష్మేదేవికి ఇష్టమైన రోజులు. ఆ రోజుల్లో పొద్దునసాయంత్రం దీపారాధన చేయడం దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అలాగే జ్యోతిష్య శాస్త్రరీత్యా శ్రావణమాసం ఆధ్యాత్మికంగా లక్ష్మీప్రదమైన మాసం. ఈమాసం దక్షిణాయణం లో ప్రారంభం అయ్యే మొదటి మాస శ్రావణం సూర్యోదయం కర్కాటక రాశి తో ప్రారంభమవుతుంది.రాశ్యాధిపతి చంద్రుడు ఆయన చాలా చల్లని పండు వెన్నల మనస్సు కలిగిన వాడు దీనివలన ఈ మాసంలో మానసిక ఉల్లాసం,ప్రశాంతత ఉండును.అందుకు ఈ పవిత్ర మాసం కొసం సిద్ది పొందుటకు సిద్ద పురుషులు ఏదురు చూస్తు ఉంటారు.శ్రావణ అష్టమినవమిఏకాదశిత్రయోదశిచతుర్దశిఅమావాస్యపూర్ణిమ వంటి తిథులు లక్ష్మీపూజకు శ్రేష్టమైనవి.

 

శ్రవణా నక్షత్రం సాక్షాత్తు శ్రీ మహావిష్ణుమూర్తి జన్మనక్షత్రంగా చెప్తారు. శ్రావణ మాసంలోనే వేదాధ్యయనం కోసం బ్రహ్మచారులకు ఉపాకర్మ అనే సంస్కారాన్ని చేస్తారు. ఆనాటి నుండి వారు గురువు దగ్గర వేదాలు నేర్చుకోవడం ప్రారంభిస్తారు. శ్రవణం అనగా వినడం అనే మరొక అర్ధం కూడా ఉంది. వేదాలు విని వల్లెవేస్తారు కాబట్టి ఈ నెలకు శ్రావణ మాసమనే పేరు వచ్చింది అని కూడా చెప్పవచ్చు.

శ్రావణమాసం అనగా ప్రత్యేకించి మహిళలందరికీ పండగ నెలగానే చెప్పుకోవచ్చు. ఈ నెలలో మహిళలందరూ మంగళగౌరీ మరియు శ్రావణ లక్ష్మి(వరలక్ష్మీ) పూజలలోపేరంటాలువ్రతాలలో ఎంతో సందడిగా గడుపుతారు. ఈ శ్రావణమాసంలో చేసే అమ్మవారి పూజలునోములువ్రతాలు స్త్రీలకు సకల సౌభాగ్యాలను అందజేస్తాయు . ఈ నెలలో స్త్రీలందరూ పట్టుచీరలుపసుపుకుంకుమలుతలలో పువ్వులుచేతులనిండా గాజులతో పేరంటాలకు వెళ్లి వస్తూ ఎంతో శోభాయమానంగా దర్శనం ఇస్తారు.

శ్రావణ సోమవారాలు:

 • మొదటి సోమవారం పాడ్యమితో ప్రారంభమవుతుంది ఈ తిథికి అగ్ని అధిదేవతా దీనివలన సత్పల ప్రాప్తి కలుగును.
 • రెండవ సోమవారం శు॥అష్టమి అధిదేవత - అష్టమాత్రుకలు ఫలం దుర్గతి నాశనము.
 • మూడవ సోమవారం పౌర్ణిమ అధిదేవత చంద్రుడు. ఫలం ధనధాన్యఆయురారోగ్యభోగభాగ్య ప్రాప్తి.
 • నాల్గవ సోమవారం బ॥సప్తమి అధిదేవత సూర్య భగవానుడు. ఫలం - ఆయురారోగ్య వృద్ది.
 • ఐదవ సోమవారం అమావాస్య (దీనిని అమా సోమవారం అంటారు) -   అధిదేవతలు పితృదేవతలు. ఫలం సంతాన సౌఖ్యం. 

ఈరోజులలో శివాభిషేకం,అర్చన చేయడం వలన పైన చెప్పిన ఫలితాలు కలుగుతాయు.విశేషంగా అమావాస్య సోమవారం శివుడిని పూజించి నట్లయుతే అనంతమైన పాపాలు నశించి శివ సాయుజ్యానికి వెళతారు.

ఉత్తర భారతదేశంలో శ్రావణమాసంసోమవారం శివాభిషేకాలకు ఎంతో ప్రసిద్ధి. మన దక్షిణాదిలో కార్తీకమాసం శివారాధనకు ఎంతటి ప్రాధాన్యత ఉందోఅదే విధంగా ఉత్తరాదిన శ్రావణమాసం అంతే ప్రాధాన్యతను కలిగి ఉంది. ఈ మాసంలో అన్ని శివాలయాలు భక్తులతోఅభిషేకాలతో కిటకిటలాడుతూ తమ పవిత్రతను చాటుతూ ఉంటాయి

మంగళగౌరీ వ్రతం:వారాలు

 • మొదటి మంగళ వారం శు॥ విదియ అధిదేవత అశ్విని దేవతలు. -   ఫలం ఆరోగ్య వృద్ది.
 • రెండవ మంగళవారం శు॥నవమి అధిదేవత దుర్గాదేవి. ---- ఫలం సంపద ప్రాప్తిస్తుంది.
 • మూడవ మంగళ వారం బ॥ పాడ్యమి అధిదేవత అగ్ని. ఫలం  - సర్వకార్య సిద్ది.
 • నాల్గవ మంగళ వారం బ॥అష్టమి  ------   అధిదేవత అష్టమాత్రుకలు. ఫలం క్లేశ నాశనము కలుగును.

శ్రావణ మంగళవారం – 

మన తెలుగు రాష్ట్రాలలో మహిళలు అందరూ మంగళగౌరీ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించడం మనం చూస్తాం. పార్వతీదేవి తన కృష్ణ వర్ణం ఎరుపుగా మారాలని తపస్సు చేసినందు వలన ఆమె గౌరీ దేవిగా పిలువబడుతోంది. అందువలనశ్రావణమాసంలో అన్ని మంగళవారాలు గౌరీదేవిని కొలుస్తూ ఈ మంగళగౌరీ వ్రతం చేసుకోవడం వలన సకల సౌభాగ్యాలు మరియు సుఖశాంతులు కలుగుతాయని పరమశివుడు చెప్పాడు.

శ్రావణ శుక్ర వారాలు 4

 • మొదటి శుక్ర వారం శు॥ పంచమి అధిదేవత నాగ దేవత. ----   ఫలం -     వివాహమువంశ వృద్ది.
 • రెండవ శుక్ర వారం వర లక్ష్శీ వ్రతం శు॥ ద్వాదశి అధిదేవత విష్ణువు. ఫలం - పుణ్య ఫల,లక్ష్శీ ప్రాప్తించును.
 • మూడవ శుక్ర వారం బ॥చవితి సంకష్ట హర చతుర్థి అధిదేవత పుష్పదంతుడు. ------- ఫలం కష్టములు తొలగిపోవుట,విఘ్నములు కలుగవు.
 • నాల్గవ శుక్ర వారం బ॥ఏకాదశి అధిదేవత కుబేరుడు.   --  ఫలం - ఐశ్వర్యము ప్రాప్తించును.

ముఖ్యంగా స్రీలు నాలుగు వారాలు త్రిశక్తి  స్వరూపిణిని ఆరాధించినట్లయుతే సుఖసౌఖ్యాలతో వారి కుటుంబం వర్దిల్లుతుంది.

(శ్రావణ శు॥ద్వాదశి తేది 04-08-2017) - వరలక్ష్మీదేవి

వరలక్ష్మీదేవి వ్రతం శ్రావణ శుక్రవారం శ్రీమహాలక్ష్మినివరలక్ష్మీదేవి రూపంలో కొలిచి వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటారు. 

(శ్రావణ శు॥ద్వాదశి తేది 04-08-2017) ఈ వరమహాలక్ష్మీదేవి వ్రతం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకోవడం ఆనవాయితీ. ఈనాడు స్త్రీలందరూ శుచులైఇల్లంతా శుభ్రపరిచిమంగళ తోరణాలుపసుపు కుంకుమలతో అలంకరించిమహాలక్ష్మి దేవిని కలశ స్థాపన చేసి వివిధ రకాలుగా అలంకరిస్తారు. ఈ విధంగా అలంకరించిన అమ్మవారికి రకరకాల పువ్వులు మరియు పసుపు కుంకుమలతో పూజ చేసి వ్రతకథ చదువుకుని నవవిధ పక్వాలను నైవేద్యాలుగా సమర్పించి తోరాన్ని కట్టుకుంటారు. ఇంటికి ముత్తయిదువలను పేరంటానికి పిలిచి శనగలు మరియు తాంబూలంతో వాయినం ఇస్తారు. ఈనాడు ఇంటికి వచ్చే స్త్రీమూర్తులందరిలోను శ్రీ మహాలక్ష్మి కొలువు ఉంటుందని నమ్మకం. ఈ వరలక్ష్మీవ్రతం స్త్రీలు సౌభాగ్యం మరియు సిరి సంపదలు కలుగడానికి చేసుకుంటారు.

 నాగుల చవితి: 26-07-2017 బుధవారం

శ్రావణ శుద్ధ చవితిని నాగుల చవితి గా జరుపుకుంటారు. నాగుల చవితి నాడు స్త్రీలు సర్వాలంకృతశోభితులై దగ్గరలో ఉన్న నాగుపాముల పుట్టవద్దకు వెళ్లి పుట్టలలో పాలు పోసిచలిమిడిచిమ్మిలిపువ్వులుపళ్ళుపసుపుకుంకుమ సమర్పించి నాగదేవతను ఆరాధిస్తారు. ఈ విధంగా నాగారాధన చేయడం వలన సంతాన సౌఖ్యం కలుగుతుందని మరియుతమ సంతానానికి ఎటువంటి హాని జరగకుండా నాగదేవత కాపాడుతుంది అని నమ్ముతారు. ఈ రోజు భూమిని నాగలితో దున్నడంకూరలు తరగడం వంటి పనులు నిషేధంగా భావిస్తారు.

 గరుడపంచమి: 27-07-2017 గురువారం

గరుడపంచమి రోజున జరుపుకుంటారు. పురాణాలను అనుసరించిగరుడుడు తన తల్లిని దాస్యవిముక్తురాలిని గావించడం కొరకు శ్రమించితన ఔన్నత్యం చేత శ్రీమహావిష్ణువుకు వాహనంగా శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు. అందువల్లనే ఆయన పేరుమీద గరుడపురాణం కూడా వ్రాయబడ్డది. ఈరోజున శక్తిధైర్యం మరియు విజయం కొరకు గరుత్మంతుడిని ఆరాధిస్తారు.

 జంధ్యాలపౌర్ణమిరాఖీ పౌర్ణమి 07-08-2017 సోమవారం

ఇదే రోజు చంద్రగ్రహణంసంభవించును ఉపాకర్మలు,ప్రతి సంవత్సరం లాగా నూతన యఙ్ఞోపవీత ధారణ వర్జితం.మధ్యాహ్నం 02-30 గంటకు భోజనాధులు ముగించు కొవాలి.గ్రహణ స్పర్శ రా॥ 10-54 ని. మధ్య కాలం రా॥ 11-52 ని. మోక్ష కాలం రా॥ 12--51ని.లకు గ్రహణ అనంతరం స్నానాదులు ముగించి భోజనాదులు చేసుకోవాలి. ఈ గ్రహణాన్ని శ్రవణా నక్షత్రం మకర రాశి వారు చూడరాదు.

 శ్రావణ పౌర్ణమి ఎంతో పవిత్రమైన పర్వదినంగా జరుపుకుంటారు. ఈనాడు స్త్రీలు తమ సోదరుల చేతికి రాఖీ బంధనాన్ని కట్టివారికి తమ రక్షణ బాధ్యతను అప్పగిస్తారు. ఒకరకంగా అక్కచెల్లెళ్ళు మరియు అన్నదమ్ముల మధ్య ఆత్మీయతను పెంచే పండుగగా జరుపుకుంటారు.

 • శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి గాయత్రీ మంత్రం జపం చేస్తారు. అందువల్లనే ఈరోజును జంధ్యాల పౌర్ణమిగా కూడా పిలుస్తారు.

సంకష్టహర చతుర్థి: 11-08-2017 శుక్రవారం

సంకష్టహర చతుర్థి ఈ నెలలో చేయడం ఎంతో ఫలప్రదంసంవత్సరం పొడవూతా వచ్చే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించనివారు కూడాఈ నెలలో వచ్చే సంకష్టహర చతుర్థిని ఆచరించడం వలన శ్రీ మహాగణేషుని కృపకు పాత్రులవుతారు. ఈ ఒక్క నెలలో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మొత్తం సంవత్సరంలో వచ్చే అన్ని సంకష్టహర చతుర్థి దినాలలో వ్రతం చేసిన ఫలితాన్ని పొందుతారు.

హయగ్రీవ జయంతి: 07-08-2017 సోమవారం

జ్ఞానానికి ప్రతిరూపమైన హయగ్రీవుడు ఈనాడు జన్మించిన కారణంగా ఈనాడు హయగ్రీవ జయంతిగా కూడా జరుపుకుంటారు. శ్రీ మహాలక్ష్మీదేవికి ధనాధిపత్యం మరియు సరస్వతీ మాతకు జ్ఞానాదిపత్యం ఈరోజుననే హయగ్రీవునిచే ఇవ్వబడినది అని పురాణోక్తి. ఇదే రోజున అగస్త్య మహాముని హయగ్రీవునికి లలితాసహస్రనామాన్ని బోధించారు అని కూడా చెప్పబడింది.

శ్రీకృష్ణ జన్మాష్టమి: 14-08-2017 సోమ వారం

శ్రావణ బహుళ అష్టమిని గోకులాష్టమి లేదా కృష్ణాష్టమి గా జరుపుకుంటాము. దేవదేవుడైన విష్ణుమూర్తి ఈ శ్రావణ బహుళ అష్టమినాడు శ్రీకృష్ణావతారంలో జన్మించాడు. ఈనాడు శ్రీకృష్ణునికి పూజలు చేసివెన్నపాలు వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈనాడు సాయంత్రం ఊరంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉట్టికొట్టి ఈ కృష్ణాష్టమి పండగను ఎంతో కోలాహలంగా జరుపుకోవడం ఈనాటి విశేషం.

పోలాల అమావాస్య: 21-08-2017 సోమవారం

శ్రావణ అమావాస్యను పోలాల అమావాస్యగా జరుపుకుంటారు. ఈనాడు అన్ని రకాల పశువులను ప్రార్ధించడం పూర్వకాలం నుంచీ వస్తున్న ఆచారం. ఈనాడు పోలాలమ్మ అనే గ్రామ దేవతను విశేషంగా ఆరాధిస్తారు. ఈనాడు కందమొక్క పూజను ప్రత్యేకించి చేస్తారు. సంతాన ప్రాప్తి మరియు సంతాన అభివృద్ధి కొరకు ఈ కందమొక్క పూజను చేసుకునికథ చదివిఅక్షంతలు నెత్తిన చల్లుకుని ముత్తయిదువులకు వాయన తాంబూలాలు ఇవ్వడం ఆచారం.

ఈ హేమలంబ నామ సంవత్సరంలో ఇవే కాక మరికొని పర్వదినాలు ఉన్నవి.

ఆగష్టు గురువారం పుత్రద ఏకాదశి/ శ్రావణ శుద్ధ ఏకాదశి.

ఆగష్టు శనివారం శనిత్రయోదశి

ఆగష్టు 19 శనివారం శనిత్రయోదశి 
ఆగష్టు 20 – ఆదివారం మాసశివరాత్రి

ఇంతటి విశిష్టముపవిత్రము మరియు ఫలప్రదమూ అయిన శ్రావణ మాసాన్ని మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుని సత్ఫలితాలనూసకల శాంతి సౌభాగ్యాలనూ పొందండి.

సర్వేజనాః సుఖీనోభవంతు… లోకాసమస్తా సుఖీనో భవంతు……

మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం !

మీ ........ రాయప్రోలు 

 


 

 

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

sharma

Watch

Rayaprolu
Mallikharjuna
Sharma Garu
 • ntv
 • bhakthi-tv
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
 • Follow us on
Design & Developed by Arjunweb