Valuable Information
::సకలపూజలు.కామ్ అభిమానులకు శుభవార్త ! ప్రేక్షకులకు శ్రీ కాశీభట్ల బాలకృష్ణ శర్మ గారు అన్నిరకముల జాతక సమస్యలకు ఖచ్చితమైన జాతక పరిశీలన చేసి ఆయా సమస్యలకు సరైన పరిహారములను తెలియజేయుదురు. 1. విద్యా, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, సంతానము, ఆరోగ్యము, విదేశీయాన మొదలగు జాతక సమస్యలు 2. వివాహ, వ్యాపార, గృహారంభ, గృహప్రవేశ, ఉపనయ తదితర వాటికి శుభ ముహూర్తములను నిర్ణయము చేయుట 3. వివాహ సంబంద జాతక పొంతలనకు మరియు వాస్తు సంబంద విషయములు. ఆసక్తి ఉన్నవారు అన్ని విషయములకు క్రింద తెలిపిన మొబైల్ ఫోన్ ద్వారా గాని లేదా ఈమైల్ ద్వారాగాని సంప్రదించవచ్చును. హైదరాబాద్ లో వుండే వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చు. ఇతర దేశాల్లో వుండే వారు ముందుగా ఈమెయిలు లో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు అడిగే ప్రశ్నలకు ఫోన్ ద్వారా గాని, ఈ మెయిల్ ద్వారా గాని సంప్రదించవచ్చు. అందరికి ఇదే మా ఆహ్వానం. ఫోన్ చేయవలసిన మా మొబైల్ నంబర్ : 9247326197

అనఘాష్టమి వ్రతం.

అనఘాష్టమి వ్రతం.

శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే

(దీపము వెలిగించి దీపపు ప్రమిదలకు గంధము, కుంకుమతో బొట్లు పెట్టవలయును. )

శ్లో // అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,

(అని ఉద్ధరిణితో కుడిచేతిలో జలమును తీసుకుని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః,విష్ణవే నమః, మధుసూదనాయ నమః,త్రివిక్రమాయ నమః, వామనాయ నమః,శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ //
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవరశ్యామో హృదయస్థో జనార్థనః
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాఅం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ //
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే //

శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
అరుందశీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః
నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః అయం ముహూర్తస్సుముహోర్తస్తు

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే //

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ప్రాణాయామము

(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును చెప్పవలెను)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ . ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్

సంకల్పం

ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య  వాయువ్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిన) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈరోజు నక్షత్రము)(ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం,సర్వాపదా నివారణార్ధం,సకలకార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిద్యర్ధం,పుత్రపుత్రికా నాంసర్వతో ముఖాభివృద్యర్దం,ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీమత్ అనఘ దేవతా ముద్దిశ్య శ్రీ అనఘ దేవతా ప్రీత్యర్ధం యావత్శక్తి, ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే శుభనక్షత్రే

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే.

కలశారాధనం

శ్లో // కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(అంటూ మీరు వేరుగా ఉంచుకున్నమరొక కలశానికి గంధం, కుంకుమతో బొట్టుపెట్టి ఆతర్వాత కలశములో కొన్ని పుష్పాలు, అక్షితలు వేసి కలశాన్ని చేతితో మూసి ఈ క్రింది మంత్రం చెప్పుకోవాలి. )

శ్లో // గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపుతో చేసిన  వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం // ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్


శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి

(అక్షతలుస్వామివారి వద్ద వుంచి నమస్కరించవలెను. )

శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి

(జలమును  చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి

(జలమును చల్లవలెను)

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి

(జలము చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

(అక్షతలు వస్త్రంగా భావించి స్వామివారి వద్ద వుంచి నమస్కరించాలి )

శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి

(పుష్పానికి గంధం అద్ది స్వామివారి వద్ద ఉంచాలి. )

శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి

(అక్షతలు లేదా పుష్పాలతో గణపతిని అర్చించాలి .)

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి.
మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి

(అగరవత్తులు వెలిగించి ధుపం చూపించవలెను.)

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

(కొద్దిగా బెల్లం ముక్కను నివేదన చేయాలి)

ఓం ప్రాణాయస్వాహా, ఓమ్ అపానాయస్వాహా, ఓంవ్యానాయ స్వాహా
ఓమ్ ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

(నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి.

(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)

క్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా
శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యతి ప్రదక్షిణం పదే పదే
పాపోహం పాప కర్మానాం పాపాత్మాం పాపా సంభవః
త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

(అనుకొని నమస్కరించుకొనిదేవుని వద్దగల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలెను. )

తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.

శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.

(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)

శ్రీ అనఘాష్టమి వ్రత పూజా విధానము

" అదౌ కల్పోక్త ద్దేవతా ఆవాహనం, ప్రాణప్రతిష్టాపనం చ కరిష్యే " అని సంకల్పము చేసి.

అష్టదళ పద్మే ఈశాన్య దళే కలశే ఆణిమాఖ్య దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే ఆగ్నేయ దళే కలశే లఘిమాఖ్య దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే నైరృతి దళే కలశే ప్రాప్తి దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే వాయువ్య దళే కలశే ప్రాకామ్య దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే దక్షిణ భాగస్థ దళే కలశే ఈశిత్వ దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే దేవస్య వామ భాగస్థ దళే కలశే వశిత్వ దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే పశ్చాద్భాగస్థ దళే కలశే కామావసాయితాఖ్య దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే పురస్తాద్దళే దళే కలశే మహిమాఖ్య దేవతా మావాహయామి స్థపయామి పూజయామి.
అష్టదళ పద్మే మధ్యే కర్ణికాయాం ప్రధాన కలశే శ్రీమదనఘస్వామిన మావాహయామి స్థపయామి పూజయామి.
కర్ణికాయాం అనఘ స్వామినః పార్శ్వే శ్రీమతీం అనఘా దేవీం ఆవాహయామి స్థాపయామి పూజయామి.

ప్రాణప్రతిష్ఠా :

ఈశాన్య మణీమాభిఖ్యే చాగ్నేయ్యాం లఘిమాభిధే |
ప్రాప్తినామని నైరృత్యాం ప్రాకామాఖ్యే నిలస్థలే |
ఈశిత్వాఖ్యే వశిత్వాఖ్యే చోభయోః పార్శ్వయోరపి |
కామవసాయితా నామ్ని పశ్చాద్భాగేంగ రక్షవత్ |
మహమ్ని పాదమూలే చ దళేష్వష్టసు నిత్యశః |
భ్రాజమానేషు తన్మధ్యే కర్ణికాయాం కృతాలయౌ |
అనఘ శ్చానఘాదేవీ ప్రాణచేష్టా విరాజితౌ |
చరతాం మమ హృత్పద్మే గురుమార్గ ప్రవర్తకౌ ||

ఈశాన్యమున అణిముడును, ఆగ్నేయమున లఘివుడును, నైరుతి దిక్కున ప్రాప్తియు, వాయువ్యమున ప్రాకామ్యుడను, ఎడమ కుడి భాగములందు ఈశ్వితుడు వశ్వితుడును, వెనుక భాగమున అంగరక్షకుని వలె కామావసాయితయు, ముందు పాదముల దగ్గర మహిముడను, ఇట్లే ఎనిమిది దళముల ఎనిమిది మంది నిత్యము నిలచియుండగా ఆ దళముల మధ్యగల కర్ణిక యందు కొలువుదీర్చి యుండు గురు సంప్రదాయ ప్రవర్తకులగు శ్రీ అనఘ దంపతులు ప్రాణములతోనూ, చేష్టలతోనూ ఒప్పుచూ, నా హృదయమున చరించుచుందురు గాక, అణిమాది అంగదేవతా పరివృత శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘ స్వామినే నమః - - సర్వెంద్రియాణి వాఙ్మనశ్చక్షు శ్శ్రోత జిహ్వ ఘ్రాణరేతో బుధ్యాదీని ఇహైవాగత్య సుఖంచిరంతిష్టంతు స్వాహా, ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తోస్తు, స్థిరోభవ, వరదోభవ, స్థిరాసనం కురు.

స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజావసానకం |
తావత్త్వం ప్రీతిభావేన కుంభస్మిన్ సన్నిధిం కురు ||

ధ్యానమ్ :

పద్మాసనోత్తాన మనోజ్ఞ పాదం
పద్మం దధానం నభయంచ పాణ్యోః |
యోగ స్థిరం నిర్భర కాంతి పుంజం
దత్తం ప్రపద్యే నఘ నామధేయం ||

పద్మాసనస్థాం పదయుగ్మ నూపురాం

పద్మం దధానా మభయంచ పాణ్యోః |
యోగేర్థ సమ్మీలిత విశ్చలాక్షీం
దత్తాను రక్తా మనఘాం ప్రపద్యే || శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః ధ్యాయామి.

ఆవాహనమ్ :

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః ఆవాహయామి.

ఆసనమ్ :

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః ఆసనం సమర్పయామి.

పాద్యం :

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః పాద్యం సమర్పయామి.

అర్ఘ్యం :

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః హస్త్యోః అర్ఘ్యం సమర్పయామి.

ఆచమనమ్ :

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి.

మధుపర్కం :

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః మధుపర్కం సమర్పయామి.

పంచామృతస్నానం:

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః పంచామృతస్నానం సమర్పయామి.

స్నానం :

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః స్నానం సమర్పయామి.

వస్త్రం :

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః వస్త్రం సమర్పయామి.

ఉపవీతం :

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః ఉపవీతం సమర్పయామి.

గంధం :

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః గంధం ధారయామి ||
గంధోపరి అలంకరణార్థం కుంకుమం అక్షతాంశ్చ సమర్పయామి.
శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః మంగళ ద్రవ్యాని సమర్పయామి.

ఆభరణం :

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః ఆభరణాని సమర్పయామి.

పుష్పం :

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః పుష్పాణి సమర్పయామి.

కుంకుమపూజా :

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః కుంకుమపూజాం సమర్పయామి.

అంగ పూజ :

( అయ్యవారికి )

శ్రీ అనఘ దేవాయ నమః - పాదౌ పూజయామి.
త్రిగత్సంచరాయ నమః - జంఘే పూజయామి.
ఆజానుభాహవే నమః - జానునీ పూజయామి.
పద్మాసన స్థాయ నమః - ఊరూ పూజయామి.
త్రిగుణేశాయ నమః - వళిత్రయం పూజయామి.
శాతోదరాయ నమః - ఉదరం పూజయామి.
కరుణాకరాయ నమః - హృదయం పూజయామి.
భక్తాలంబనాయ నమః - భాహూ పూజయామి.
సంగీత రసికాయ నమః - కంఠం పూజయామి.
జగన్మోహనాయ నమః - మందస్మితం పూజయామి.
జగత్ప్రాణాయ నమః - నాసికాం పూజయామి.
శ్రుతి సంవేద్యాయ నమః - శ్రోత్రే పూజయామి.
ధ్యాన గోచరాయ నమః - నేత్రద్వయం పూజయామి.
తిలకాంచిత ఫాలాయ నమః - ఫాలం పూజయామి.
సహస్ర శీర్షాయ నమః - శిరః పూజయామి.
సచ్చిదానందాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి.

( అమ్మవారికి )

శ్రీ అనఘ దేవాయ నమః - పాదౌ పూజయామి.
త్రిగత్సంచరాయ నమః - జంఘే పూజయామి.
ఆజానుభాహవే నమః - జానునీ పూజయామి.
పద్మాసన స్థాయ నమః - ఊరూ పూజయామి.
త్రిగుణేశాయ నమః - వళిత్రయం పూజయామి.
శాతోదరాయ నమః - ఉదరం పూజయామి.
కరుణాకరాయ నమః - హృదయం పూజయామి.
భక్తాలంబనాయ నమః - భాహూ పూజయామి.
సంగీత రసికాయ నమః - కంఠం పూజయామి.
జగన్మోహనాయ నమః - మందస్మితం పూజయామి.
జగత్ప్రాణాయ నమః - నాసికాం పూజయామి.
శ్రుతి సంవేద్యాయ నమః - శ్రోత్రే పూజయామి.
ధ్యాన గోచరాయ నమః - నేత్రద్వయం పూజయామి.
తిలకాంచిత ఫాలాయ నమః - ఫాలం పూజయామి.
సహస్ర శీర్షాయ నమః - శిరః పూజయామి.
సచ్చిదానందాయ నమః - సర్వాణ్యంగాని పూజయామి.

ఇచట అష్టోత్తర శతనామావళి చదువవలెను.

ధూపం :

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః ధూప మాఘ్రాపయామి.

దీపం :

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః దీపం దర్శయామి - దూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

నైవేద్యం :

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః నైవేద్యం సమర్పయామి.

తాంబూలం :

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనం :

ప్రభో సమస్తా త్పరివర్తితై శ్శ్రీ కర్పూర నీరాజన దీప మాల్యైః |
యుష్మ న్మహార్చిః పరివేష పంక్తిః
కిమ్మీరితాభా స్త్వనఘే నషు ప్రభో ||
శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః నీరాజనం సమర్పయామి.

మంత్రపుష్పం :

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి.

ప్రదక్షిణం :

శ్రీ అనఘా దేవీ సమేత శ్రీ అనఘస్వామినే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

ప్రార్థనమ్ :

మనోవాక్కాయోత్థం క్షపితు మఘ మాత్మీయ వితతే
ర్థృతం నూనం యాభ్యాం విమల మిహ దాంపత్యలసనమ్ |
తయోః పాద ద్వంద్వం మహిమ ముఖ పుత్రాష్టక లస
త్పరీవారం వందే సతత మనఘాఖ్యా కలితయోః |

సమర్పణమ్ :

కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుధ్యాత్మనావా ప్రకృతే స్స్వభావాత్ |
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ||

ఓం దత్తాత్రేయ నమః

ఓం శ్రీ అనఘాయై నమః
ఓం అనఘాయ నమః

ఓం మహాదేవ్యై నమః
ఓం త్రివిదాఘ నమః

ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం లక్ష్మీ రూపాన ఘేశాయ నమః
ఓం అనఘస్వామి పత్న్యై నమః
ఓం యోగాధీశాయ నమః
ఓం యోగేశాయై నమః
ఓం ద్రాంబీజ ధ్యాన గమ్యాయ నమః
ఓం త్రివిదాఘ విదారిణ్యై నమః
ఓం విజ్ఞేయాయ నమః

ఓం త్రిగుణాయై నమః
ఓం గర్భాది తారణాయ నమః
ఓం అష్టపుత్ర కుటుంబిన్యై నమః
ఓం దత్తాత్రేయాయ నమః
ఓం సిద్ధ సేవ్య పదే నమః
ఓం బీజస్థ వట తుల్యాయ నమః
ఓం ఆత్రేయ గృహదీపాయై నమః
ఓం ఏకార్ణ మను గామినే నమః
ఓం వినీతాయై నమః
ఓం షడర్ణ మను పాలయ నమః
ఓం అనసూయా ప్రీతిదాయై నమః
ఓం యోగ సంత్కరాయ నమః
ఓం మనోజ్ఞాయై నమః
ఓం అష్టార్ణమను గమ్యాయ నమః
ఓం యోగశక్తి స్వరూపిణ్యై నమః
ఓం పూర్ణానంద వపుష్మతే నమః
ఓం యోగాతీత హృదే నమః
ఓం ద్వాదశాక్షర మంత్రస్థాయ నమః
ఓం చిత్రాసనోప విష్టాయై నమః
ఓం ఆత్మసాయుజ్య దాయినే నమః
ఓం పద్మాసన యుజే నమః
ఓం షోడశార్ణ మను స్థాయ నమః
ఓం రత్నాంగుళీయక లసత్పాదాం గుళ్యై నమః
ఓం సచ్చిదానంద శాలినే నమః
ఓం పద్మ గర్భోపమానాంఘ్రి తలాయై నమః
ఓం దత్తాత్రేయాయ నమః
ఓం భర్తృ శుశ్రూషణోత్కాయై నమః
ఓం హరయే నమః

ఓం మతిమత్యై నమః
ఓం కృష్ణాయ నమః

ఓం తాపసీవేష ధారిణ్యై నమః
ఓం ఉన్మత్తాయ నమః

ఓం తాపత్రయ నుదే నమః
ఓం ఆనందదాయకాయ నమః
ఓం హరిద్రాంచ త్ప్రపాదాయై నమః
ఓం దిగంబరాయ నమః

ఓం మంజీర కలజత్రవే నమః
ఓం మునయే నమః

ఓం శుచివల్కల ధారిణ్యై నమః
ఓం బాలాయ నమః

ఓం కాంచీదామ యుజే నమః
ఓం పిశాచాయ నమః

ఓం గలే మాంగల్య సూత్రాయై నమః
ఓం జ్ఞానసాగరాయ నమః
ఓం గ్రైవేయాళీ ధృతే నమః
ఓం ఆబ్రహ్మ జన్మదోషాఘ ప్రణశాయ నమః ఓం క్వణ ట్కంకణ యుక్తాయై నమః
ఓం సర్వోపకారిణే నమః

ఓం పుష్పాలంకృతాయే నమః
ఓం మోక్షదాయినే నమః
ఓం అభీతిముద్రా హస్తాయై నమః
ఓం రూపిణే నమః

ఓం లీలాంభోజ ధీతే నమః
ఓం భగవతే నమః

ఓం తాటంకయుగ దీప్తాయై నమః
ఓం దత్తాత్రేయాయస్మృతిమాత్ర సుతుష్టాయ నమః ఓం నానారత్న సుదీప్తాయే నమః
ఓం మహాభయ నివారిణే నమః
ఓం ధ్యాన స్థిరాక్ష్యై నమః
ఓం మహాజ్ఞాన ప్రదాయ నమః
ఓం ఫాలామ్చత్తిలకాయై నమః
ఓం చిదానందాత్మనే నమః
ఓం మూర్ధాబద్ధ జటా రాజ త్సుమ దామాఅళయే నమః
ఓం బాలోన్మత్త పిశాచాది వేషాయ నమః ఓం భర్తాజ్ఞా పాలనాయై నమః
ఓం మహాయోగినే నమః
ఓం నానావేష ధృతే నమః
ఓం అవధూతాయ నమః
ఓం పంచపర్వాన్వితా విద్యా రూపికాయై నమః
ఓం అనసూయా నందనాయ నమః
ఓం సర్వావరణ శీలాయై నమః
ఓం అత్రిపుత్రాయ నమః

ఓం స్వబలావృత వేధసే నమః
ఓం సర్వకామ ఫలానీక ప్రదాత్రే నమః ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రణవాక్షర వేదయాయ నమః
ఓం వేద మాత్రే నమః
ఓం భవబంధ విమోచినే నమః
ఓం స్వచ్ఛ శంఖ ధృతే నమః
ఓం హ్రీం బీజాక్షర పారాయ నమః
ఓం మందహాస మనోజ్ఞాయై నమః
ఓం సర్వైశ్వర్య ప్రదాయినే నమః
ఓం మంత్రతత్వ విదే నమః
ఓం క్రోబీజ జప తుష్టాయ నమః
ఓం దత్తపార్శ్వ నివాసాయై నమః
ఓం సాధ్యాకర్షణ దాయినే నమః
ఓం రేణుకేష్ట కృతే నమః
ఓం సౌర్బీజ ప్రీత మనసే నమః
ఓం ముఖనిస్పృత శంపాభ త్రయీదీప్త్యై నమః
ఓం మనస్సంక్షోభ కారిణే నమః
ఓం విధాతృవేద సంధాత్ర్యై నమః
ఓం ఐంబీజ పరితుష్టాయ నమః
ఓం సృష్టి శక్త్యై నమః
ఓం వాక్ప్రదాయ నమః

ఓం శాంతి లక్ష్మ్యై నమః
ఓం క్లీంబీజ సముపాస్యాయ నమః
ఓం గాయకాయై నమః
ఓం త్రిజగద్వశ్యకారిణే నమః
ఓం బ్రాహ్మణ్యై నమః
ఓం శ్రీ ముపాసన తుష్టాయ నమః
ఓం యోగచర్యా రతాయై ఓం నర్తికాయై నమః
ఓం మహా సంవత్ప్రదాయ నమః
ఓం దత్తనామాంక సంస్థాయై నమః
ఓం గ్లౌమక్షర సువేద్యాయ నమః
ఓం జగదిష్ట కృతే నమః
ఓం భూసామ్రాజ్య ప్రదాయినే నమః
ఓం శుభాయై నమః
ఓం ద్రాంబీజాక్షర వాసాయ నమః
ఓం చారు సర్వాంగ్యై నమః
ఓం మహతే నమః

ఓం చంద్రాస్యాయై నమః
ఓం చిరజీవినే నమః

ఓం దుర్మానస క్షోభకర్యై నమః
ఓం నానాబీజాక్షరోపాస్య నానాశక్తియుజే నమః ఓం సాధు హృచ్ఛాంతయే నమః
ఓం సమస్త గుణసంపన్నాయ నమః
ఓం సర్వాంత గతయే నమః
ఓం అంతశ్శత్రు విదాహినే నమః
ఓం పాద స్థితాయై నమః
ఓం భూతగ్రహోచ్చాటనాయ నమః
ఓం పద్మాయై నమః
ఓం సర్వవ్యాధి హరాయ నమః
ఓం గృహదాయై నమః
ఓం పరాభిచార శమనాయ నమః
ఓం సక్తిస్థితాయై నమః
ఓం ఆధి వ్యాధి నివారిణే నమః
ఓం సద్రత్న వస్త్రదాయై నమః
ఓం దుఃఖ త్రయ హరాయ నమః
ఓం గుహ్య స్థాన స్థితాయై నమః
ఓం దారిద్ర్య ద్రావిణే నమః
ఓం పత్నీ దాయై నమః
ఓం దేహ దార్ధ్యాభి పోషాయ నమః
ఓం క్రోడ స్థాయై నమః
ఓం చిత్త సంతోషకారిణే నమః
ఓం పుత్రదాయై నమః
ఓం సర్వమంత్ర స్వరూపాయ నమః
ఓం వంశ వృద్ధికృతే నమః
ఓం సర్వయంత్ర స్వరూపిణే నమః
ఓం హృద్గతాయై నమః
ఓం సర్వ తంత్రాత్మకాయ నమః
ఓం సర్వకామ పూరణాయై నమః
ఓం సర్వపల్లవ రూపిణే నమః
ఓం కంఠ స్థితాయై నమః
ఓం శివాయ నమః

ఓం హారాది భూషా దాత్ర్యై నమః
ఓం ఉపనిషద్వేద్యాయ నమః
ఓం ప్రవా సిబంధు సంయోగ దాయికాయై నమః
ఓం దత్తాయ నమః

ఓం మిష్టాన్నదాయై నమః
ఓం భగవతే నమః

ఓం వాక్చక్తిదాయై నమః
ఓం దత్తాత్రేయాయ నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం మహాగంభీర రూపాయ నమః
ఓం అజ్ఞాబల ప్రదాత్యై నమః
ఓం వైకుంఠ వాసినే నమః
ఓం సదైశ్వర్య కృతే నమః
ఓం శంఖ గదా శూల దారిణే నమః
ఓం ముఖ స్థితాయై నమః
ఓం వేణు నాదినే నమః

ఓం కవితాశక్తిదాయై నమః
ఓం దుష్ట సంహారకాయ నమః
ఓం శిరోగతాయై నమః
ఓం శిష్ట సంపాలకాయ నమః
ఓం నిర్దాహ కర్యై నమః
ఓం నారాయణాయ అస్త్రధరాయ నమః ఓం రౌద్ర్యై నమః
ఓం చిద్రూపిణే నమః

ఓం బంభాసుర విదాహిన్యై నమః
ఓం ప్రజ్ఞారూపాయ నమః
ఓం జంభ వంశ హృతే నమః
ఓం ఆనంద రూపిణే నమః
ఓం దత్తాంక సంస్థితాయై నమః
ఓం బ్రహ్మ రూపిణే నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం మహావాక్య ప్రబోధాయ నమః
ఓం ఇంద్రరాజ్య ప్రదాయిన్యై నమః
ఓం తత్వాయ నమః

ఓం దేవప్రీతి కృతే నమః
ఓం సకల కర్మౌషు నిర్మితాయ నమః ఓం నహుషాత్మజ దాత్ర్యై నమః
ఓం సచ్చిదానంద రూపాయ నమః
ఓం లోక మాత్రే నమః
ఓం సకల లోకౌఘ సమ్చరాయ నమః ఓం ధర్మకీర్తి సుభోదిన్యై నమః
ఓం సకల దేవౌఘ వశీకృతి కరాయ నమః ఓం శాస్త్ర మాత్రే నమః
ఓం కుటుంబ వృద్ధిదాయ నమః
ఓం భార్గవ క్షిప్రతుష్టాయై నమః
ఓం గుడపానక తోషిణే నమః
ఓం కాలత్రయ విదే నమః
ఓం పంచకర్జాయ సుప్రీతాయ నమః
ఓం కార్తవీర్య ప్రసన్నాయై నమః
ఓం కంద ఫలాదినే నమః
ఓం సర్వసిద్ధికృతే నమః

ఓం సద్గురవే నమః
ఓం శ్రీ మద్దత్తాత్రేయాయ నమః
శ్రీ అనఘాష్టమి వ్రతకథ

మొదటి  అధ్యాయము 

దీపకుడు ఈ విధంగా పలికెను: ఓ గురుదేవా ! పూర్వము జంభాసరుని చేతిలో దేవతలు ఓడిపోగా దత్తాత్రేయ స్వామి ఆ రాక్షసులను ఓడించి ఆ ఇంద్రాది దేవతలను రక్షించాడని నేను విన్నాను. మరి ఆయన యుద్ధము చేశాడా? లేక తనకున్నయోగ బలము చేత గెలిచాడ? తెలుసుకోవలయునని నాకు చాలా ఆసక్తిగా ఉన్నది. కావున నాయందు దయవుంచి  ఆవిషయమును వివరించండి.

శ్రీ గురువు ఈ విధంగా చెప్పసాగెను :నాయనా! పూర్వము ధర్మరాజు యీ విషయమనే శ్రీ కృష్ణుని అడిగెను. ఆ విషయములను నీకు  చెప్పెదను శ్రద్ధగా,  ఏకాగ్రతతో వినుము.

శ్రీ కృష్ణుడు పలికెను :

బ్రహ్మ పుత్రుడగు అత్రియను మహా తేజశాలియైనఒక ఋషి కలడు. ఆయన భార్య అనసూయ. ఆమె గొప్ప పతివ్రత. వారికి చాలా కాలమునకు మహా తపస్వియు, మహా యోగియు అగు దత్తుడు అను కుమారుడు విష్ణ్వంశతో జన్మించెను. ఆ దత్తునకు యీ లోకమున సాటి లేదని ప్రసిద్ధి. ఆయనకు అనఘ అను సహధర్మచారిణియైన భార్య కలదు. ఆమెకు సంతానం ఎనిమిదిమంది కుమారులు. దయ గలది. ఉత్తమ బ్రహ్మర్షి గుణములు కలది. ఆ అనఘుడు విష్ణువు అంశ, అనఘ లక్ష్మీ దేవి అంశ. ఇట్లు భార్యతో కూడి యోగాభ్యాసము  చేయుచున్న దత్తుని దగ్గరకు జంభాసరునిచే బాధిమ్పబడిన దేవతలు వచ్చి శరణు కోరినారు. బ్రహ్మ యిచ్చిన వరముచే ఆ జంభాసరుడు అమరావతికి పోయి వేయి దివ్య సంవత్సరముల పాటు యుద్ధము చేసెను. ఆ దేవ దానవ యుద్దమున పాతాళము నుండి ద్వైత్య దానవ రాక్షస జాతుల వారు వచ్చి యుద్ధము. చివరకు ఇంద్రుడు మొదలగు దేవతలు అందరూ ఓడిపోయి ఇళ్ళు వదలి దిక్కులకు పరుగులు పెట్టిరి. దేవతలిట్లు గతిలేక పరుగులు పెట్టుచుండగా జంభుడు మున్నగు రాక్షసులు వెంటబడి తరుముచుండిరి. రాక్షసులు బాణములతోనూ, గదలతోనూ, రోకళ్ళతోనూ, యుద్ధము చేయసాగిరి. వారిలో కొందరు ఎద్దులను, కొందరు దున్నపోతులను, కొందరు శరభములను, గండకములను పులులను , కోతులను, గాడిదలను ఎక్కి, రాళ్ళు విసురుచూ, ఫిరంగులు పేల్చుతూ, తోమరములు బాణములు మొదలైనవి వేయుచూ వెంటపడిరి. వారు అట్లు అనఘ దంపతులు నివసించుచుండు ఆశ్రమము గల వింధ్య పర్వతము వరకు వచ్చిరి. ఆ దేవతలు శరణార్థులై అనఘ దంపతుల దగ్గరకు చేరిరి.

దేవతలు పలికిరి :

దేవదేవ ! జగన్నాధ! శంకచక్ర గదాధర ! జంభ దైత్యునిచే ఓడిపోయి నిన్ను శరణు జొచ్చిన మమ్ము కాపాడుము. ఓ బ్రహ్మర్షీ ! నీ భక్తులగు దేవతలకు నీ పాద పద్మముల కన్న వేరు గతిలేదు. కాన నిన్నాశ్రయించిన మమ్ము రక్షించుము.. ఆ అనఘ భగవానుడు వారల యేడ్పును విని అనఘాదేవికి విలాసముగా సంజ్ఞ చేసెను. పిమ్మట ఆ దేవత లందరని ఆశ్రమము లోనికి పంపి, మీరు యిచ్చట నిర్భయముగా ఉండునని పలికెను. వారునూ అంగీకరించి తృప్తిగా ఉండిరి. అంతలో రాక్షసులనూ ఆయుదములు విసురు కొనుచూ అచ్చటికి వచ్చి ( విలాసవతి ఆకారములో నున్న అనఘాదేవిని చూసి ) " యీ విచ్చలవిడి మునిపత్నిని పట్టుకొనుడు, పూలు, పండ్లు మొదలగు కానుకలు యిండు " అని పల్కిరి. అంతలో వారి ఐశ్వర్యలక్ష్మి వారి నెత్తికెక్కును. దత్తుడునూ, వారిని తన ధ్యానాగ్ని నేత్రముచే చూడగా క్షణములో వారు కాలి పోయిరి. ఇంతలో రాక్శసులు అనఘాదేవిని నెత్తిన పెట్టుకొని వెళ్ళసాగిరి.( దత్త ప్రభావముచే ), తేజోహీనులునూ, (అనఘాదేవి ప్రభావముచే ) లక్ష్మీ హీనులునూ అగు ఆ మద పీడితులగు ఆ రాక్షసులను దేవతలు పట్టి నరుకాగిరి. 25,26. రిష్టులు, కరణములు, శ్లములు, పిరిఘలు, త్రిశూలములు మున్నగు ఆయుధములతో దేవతలిట్లు తమ్ము నరకు చుండగా రాక్షసులు  నిశ్చేష్టులై ఏడ్పులూ, పెడబొబ్బలూ సాగించిరి. ఇట్లు ఆ దత్తప్రభావము వల్ల రాక్షసులు దేవతల శస్త్రములచే నశించిరి. జంభాసురుడునూ ఇంద్రుని చేత మరణించెను.దేవతలు మునుపటి వలె తమ రాజ్యములను పొందిరి. ఇట్లు దేవతలంతటి వారే దేవర్షియగు ఆ దత్తుని మహిమను అనుభవించిరి.

రెండవ అధ్యాయము :

పిమ్మట ఆ దత్తుడు సర్వ లోకములకు క్షేమము కలుగుటకై నిత్యమూ మనోవాక్కాయ కర్మలతో శుభప్రదమైన తపస్సు చేసెను. చేతులు పై కెత్తి కనులు తెరిచియుంచి, కట్టెవలె నిశ్చలముగా నిలచి మూడు వేల దివ్య సంవత్సరములు 'బ్రహ్మోత్తరము' అను తపస్సు చేసెను.. అట్లు ఊర్థ్వ రేతస్కుడై, రెప్పపాటు లేకుండా యోగ సమాధిలో నుండగా మాహిష్మతీ ప్రభువగుకార్తవీర్యార్జునుడు వంటరిగా వచ్చి, రాత్రింబవళ్ళుఏమరుపాటు లేకుండా వినయముతో శుశ్రూష చేసెను. ఒళ్ళ ఒత్తుచూ, మనసులో తలచి సపర్యలన్ని చెయుచూ ఆ రాజు అన్ని నియమములను ధృఢమైన సంతుష్టితో ఆచరించెను. అపుడు దత్తుడు తేజశ్శాలి అగు ఆ రాజుకు నాలుగు వరములనిచ్చెను. అతడు వేయి చేతులను మొదటి వరముగా కోరెను. అధర్మమున కాలు పెట్టినచో సత్పురుషులు తన్ను నివారించవలెను. ఇది రెండవ వరము. మూడవది ధర్మయుద్దము నందు భూమినంతటిని గెలిచి ధర్మ యుక్తముగా పాలన చేయవలెను. నాల్గవది అనేక యుద్దములలో వేలకు వేల వీరులను గెలిచిన తనకు, అందరి కన్నా మినయగు వీరునితో యుద్దము చెయుచుండగా మరణము సంభవిమ్చవలెను. అపుడు ప్రసన్నుడైన ఆ దత్తుడు ఆ రాజునకు రాజ్యమును విపులమగు యోగ విద్యను అనుగ్రహించెను. అష్టసిద్ది సమన్వితమైన సప్తద్వీపాధిత్యమును గొప్పదైన చక్రవర్తిత్వమును దత్తుడు అనుగ్రహించెను. సహస్రభాహువులతో చతుస్సముద్ర పర్యంతము గల భూమండలము ధర్మముగా జయించి పరిపాలించెను. యోగశక్తిచే రథ గజ తురగ పతకాది యుతుడై ప్రాదుర్భవించెను. ఓ ధర్మరాజా ! సప్తద్వీపములయందు యల్లెడల పదివేల యజ్ఞములు చేసి ప్రసన్న భావముచే విశేషముగా భూరిదక్షిణలు ఇచ్చి రుత్విక్కులను బ్రాహ్మణులను సంతోషపరచెను.ఆ యాగశాలలో బంగారువేదికలు మణీమయఖచిత శోభితములైన స్థంభములు విశేషాలంకారములు యుండ దేవతలు గంధర్వ యక్ష కిన్నరులు కింపురుషులు వారి వారి విమానముల యందు వుండి మిక్కిలి వేడుకతో చూచుచుండిరి. అట్టి ఆ రాజసింహుని చరిత్రనూ, మహిమనూ చూసే నారదడును ఒకానొక గంధర్వుడు ఒక యజ్జమున ఇట్లు గానము చేసెను. "లోకములో యితర రాజులు యజ్జములలో కానీ, పరాక్రమములో కానీ, విద్యలో కానీ కార్తవీర్యుని సాటికి రారు. అతడు కత్తి పట్టి, చేతికి చర్మము తగల్చుకొని, ధనస్సు తాల్చి, యోగ విద్యచే ఆకాశమున గ్రద్ద వలె సంచరించుచూ సప్తద్వీపములందునూ, అందరకూ అల్లంత దూరమున కనిపించుచుండెను. అతని రాజ్యమున వస్తువులు పోవుట లేదు. దుఃఖము లేదు. శ్రమ లేదు.. అట్లా రాజు మహిమాన్వితుడై ప్రజలను ధర్మ మార్గమున నలభై వేల సంవత్సరములు పరిపాలించెను. సముద్రము వరకూ గల భూమి కంతకూ అతడే చక్రవర్తి అయ్యెను. అతడే పశుపాలుడు, క్షేత్రపాలుడు అయ్యెను. స్వయముగా వానలు కురిపించుటచే అతడే మేఘుడయ్యెను. యోగ విద్యచే వచ్చిన వేయి బాహువులతో అతడు సముద్రమున ప్రవేశించి క్రీడించుచుండగా వేయి కిరణముల సూర్యునివలె ప్రకాశించు చుండెను. అతడు తన మనుష్యులతో (నాగరాజగు) కర్కోటకుని పట్టి తెప్పించి, తన పట్టణమున నిల్పెను. ఒకప్పుడు వర్షాకాలమున సముద్ర పత్నియగు నర్మదలో క్రీడించుచూ మదోన్మతుడై (చేతులతో అడ్డగించి ) ఆ నది వెనుకకు ప్రవహించునట్లు చేసెను. అపుడు నీటి ఒరిపిడిచే విలాసముగా నడుచుచున్న ఆ నదిని అతడు లాలించుచూ, క్రీడించుచున్నట్లుండెను. నర్మదయు అలల మధ్యలోని సుడి గుండములే కనుబొమ్మల మధ్య ముడిపడిన భృకుటి వలె కనిపించగా భయపడుచూ వెళ్ళినట్లుండెను.. అతడు వేయి చేతులతో సముద్రమును అల్లకల్లోలము చేయగా పాతాళ మందలి రాక్షసులు చేష్టలుడిగి అణిగ్పడి యుండిరి. చేతులతో సముద్రమును కల్లోల పెట్టగా ఆ మహా తరంగములకు తిమింగలములు మున్నగు పెద్ద పెద్ద జలజంతువులు నశించుచుండెడివి. అతడు రావణుని లొంగదీసి మాహీష్మతీ నగరమున బంధించెను. అపుడు పులస్త్యముని వచ్చి అంతఃపురమున కార్తవీర్యని బ్రతిమాలి వానిని విడిపించెను. కాని ఆ రావణుడు ఆయన చెప్పిన బుద్దులు వినక ఆయననే అవమానించెను. ఒకప్పుడు ఆకలిగొన్న అగ్నిదేవుడు వచ్చి యాచించగా కార్తవీర్యుడు యీ భూమి నంతనూ అగ్నికి భిక్షగా వేసెను. ఓ ధర్మరాజా! యోగాచార్యుడగు అనఘాస్వామి అనుగ్రహము వల్లనే కార్తవీర్యార్జునుడు ఇంతటి వాడయ్యెను.

మూడవ అధ్యాయము 

అట్లు వరములు పొందిన ఆ కార్తవీర్య యోగిచే యీ అనఘాష్టమీ వ్రతము లోకమున ప్రచారము చేయబడి ప్రసిద్ధి కెక్కినది. అఘము అనగా పాపము. అది మూడు విధములు. మూడు విధముల పాపమును నశింపచేయును కనుక అతడు (దత్తుడు) అనఘుడు అనబడును. ఆ అనఘుని అష్టైశ్వర్యములను ఈ వ్రత విధానమున పూజించవలెను. అణిమా, లఘివా, ప్రాప్తి, ప్రాకామ్యము, మహిమా, ఈశ్వితము, వశిత్వము, కామావసాయితా అను ఈ ఎనిమిది యోగ సిద్ధుని అష్టైశ్వర్యములు జనుల విశ్వాసము కొరకై దత్తునకు పుత్రులై జన్మించిరి.ఎవనిని భక్తితో సేవించినచో పాపములు పోవునో, ఎవడీ జగత్తునంతా పాపరహితము చేయగలడో అతనే అనఘుడు. అనఘత్వమే ప్రాణముగా నా (అనాగా విష్ణువు యొక్క ) అంశతో అవతరించిన బ్రహ్మర్షియే దత్తుడు. శ్రీకృష్ణా! కార్తవీర్యార్జునుడు యీ వ్రతమును ఏ విధానముతో, ఏ నియమములతో ప్రవర్తింప చేసెను? ఏ కాలమున, ఏ రోజున యీ వ్రతమును చేయవలెను? నాకు చెప్పుము.

శ్రీ కృష్ణుడు పలికెను :

మార్గశిరమాసమున, కృష్ణపక్షమున, అష్టమి నాడు అనఘ దంపతులను అష్ట పుత్రులను దర్భలతో బొమ్మలుగా చేసి ప్రశాంతములగు ఆ మూర్తులను పీఠమున స్థాపించవలెను. లేదా ఎనిమిది దళములు గల పద్మమున కలశములతో మంత్రములతో ధ్యానించి గంధ పుష్పాదులతో పూజించవలెను.అనఘుని విష్ణువుగానూ, అనఘాదేవిని లక్ష్మీ గానూ, పుత్రవర్గమునూ హరి వంశోక్త విధానమున అర్చించవలెను. శూద్రులు, బ్రాహ్మణులు అందరూ ఆయా కాలములలో వచ్చు ఫలములు, కందమాలాదులు, రేగుపళ్ళు, పైకగుడ్డలు మున్నగు వివిధ నైవేద్యములు పెట్టవలెను. పిమ్మట బంధువులకు, బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను.వ్రతము చివర ఎవనికైనా ఒకనికి యీ వ్రతమును ఇవ్వవలెను. అట్లు వ్రతము తీసుకున్న వారిలో ధృడదీక్ష గలవారు ఈ వ్రత దినమున ఉపవాసము చేసి మరునాడు పారణ చేయుదురు. అట్లు జీవించి యున్నంత కాలమూ చేయవలెనని ముమ్మాటికీ నా అభిప్రాయము. కనీసము ఒక సంవత్సరమైననూ చేయవలెను.ఇట్లు రాత్రి నాట్య, సంగీతాదులతో జాగరణము చెసి తెల్లవారి నవమినాడు ఆ ప్రతిమలను నీళ్ళలో వాలాడించవలెను. ఇట్లు ప్రతి సంవత్సరము శ్రద్ధతో వ్రతము నాచరించు వాని పాపములన్నియు తొలగును.. వారి కుటుంబము వృద్ధి చెందును. వారికి విష్ణువు ప్రసన్నుడగును. ఏడు జన్మలలో మంచి ఆరోగ్యము కల్గును. తరువాత మోక్షము వచ్చును.

ధర్మరాజా ! ఇప్పుడు నీకు చెప్పిన యీ పాపహరమగు అనఘాష్టమీ వ్రతము ఏకాగ్రబద్ధులై చేయ్వారు కీర్తివంతులై ఆ కార్తవీర్యార్జ్నుని వంటి వారగుదురు.

శ్రీ గురువు పలికెను :

వత్సా దీపికా ! నీకీ దత్త కథను వివరించితిని. జంభాసురునిచే ఓడింపబడిన దేవతలు ఎట్లు రక్షింపబడుదురో, ఆయనకు అనఘుడను పేరు ఎట్లు వచ్చెనో, ఆయన యోగ చర్య ఎట్టిదో, ఆయన ఇచ్చు వరము లెట్టివో, అనఘస్వామిని సంతోష పెట్టు ఈ వ్రత విధానమెట్టిదో యీ విషయములన్నీ నీకు చెప్పితిని.వత్సా ! ఇంకేమి కావలెనో చెప్పుము చెప్పెదను. ఇట్లు వ్యాస రచితమగు శ్రీ దత్త పురాణమున చతుర్థాంశమున శ్రీ అనఘాష్టమీ వ్రత నిరూపణము అను భవిష్యోత్తర పురాణాంతర్గతమగు షష్టాధ్యాయము సంపూర్ణము.

 


 

 

 

 

   
   
 
   
 
   
 
 
 
   
 
   
 
 
 
 
 
 
 
   
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
   
 
 
 
 
 
 
 
   
   
 
 
 
 
   
 
 
   
   
   
   
 
 
   
   
 
   
 
 
 
 
   
   
   
 
 
   
   
   
 
   
 
 
 
 
 
   
   
 
 
 
 
   
   
   
 
 
 
   
 
   
 
   
 
   
 
 
 
   
   
   

అనఘాష్టమి వ్రత విధానము

మార్గశిరమాసము బహుళ పక్షం లో వచ్చే అష్టమి నాడు  అనఘ దంపతులను,  అష్ట పుత్రులను  దర్భలతో బొమ్మలుగా చేసిన తరువాత ఆ మూర్తులను పీఠమున స్థాపన చేయవలెను. లేదా ఎనిమిది దళములు గల పద్మమున కలశములతో మంత్రములతో ధ్యానించి గంధ పుష్పాదులతో పూజించవలెను. అనఘుని విష్ణువు స్వరూపముగాను, అనఘాదేవిని లక్ష్మీ స్వరూపముగానూ, పుత్రవర్గమునూ హరి వంశోక్త విధాన పూర్వకముగా అర్చించవలెను. అందరూ ఆయా  ఋతువు సమయ కాలములలో వచ్చు వివిధ ఫలములు, కందమాలాదులు, రేగుపళ్ళు మొదలైనవి మరియు వివిధ నైవేద్యములు  నివిదించాలి.అ తరువాత బంధువులకు, బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. వ్రతము చివర ఎవరికైన ఒకరికిరి ఈ దీక్షగా వ్రతమును ఇవ్వవలెను. అట్లు వ్రతము తీసుకున్న వారిలో ధృడదీక్ష గలవారు ఈ వ్రత చేసే రోజున ఉపవాసము ఉండి. మరునాడు పారణ  చేస్టారు. ఆవిధంగా జీవించి ఉన్నంత కాలమూ చేయవలెనని పురానములగా ద్వారా తెలియుచున్నది. అలా చేయలేకపోతే కనీసము ఒక సంవత్సరమైననూ చేయవలెను. ఇట్లు రాత్రి నాట్య, సంగీతాదులతో జాగరణము చెసి తెల్లవారి నవమినాడు ఆ ప్రతిమలను నీళ్ళలో వాలాడించవలెను.

 ఈ వ్రతం చేయగా వచ్చే ఫలము

ప్రతి సంవత్సరము శ్రద్ధతో వ్రతము చేస్తూ ఉన్నట్లయితే వారి వారి పాపములన్ని తొలగును. వారి యొక్క  కుటుంబము దిన దిన ప్రవర్ధమానంగా శుక్లపక్ష చెంద్రునివలె వృద్ధి  చెందును. వారికి విష్ణువు ప్రసన్నుడగును. వచ్చే జన్మలలో మంచి ఆరోగ్యము కల్గును. తరువాత మోక్షము లభిస్తుంది.

 

 

 

 

 

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

sharma

Watch

Rayaprolu
Mallikharjuna
Sharma Garu
  • ntv
  • bhakthi-tv
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb