Valuable Information
::సకలపూజలు.కామ్ అభిమానులకు శుభవార్త ! ప్రేక్షకులకు శ్రీ కాశీభట్ల బాలకృష్ణ శర్మ గారు అన్నిరకముల జాతక సమస్యలకు ఖచ్చితమైన జాతక పరిశీలన చేసి ఆయా సమస్యలకు సరైన పరిహారములను తెలియజేయుదురు. 1. విద్యా, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, సంతానము, ఆరోగ్యము, విదేశీయాన మొదలగు జాతక సమస్యలు 2. వివాహ, వ్యాపార, గృహారంభ, గృహప్రవేశ, ఉపనయ తదితర వాటికి శుభ ముహూర్తములను నిర్ణయము చేయుట 3. వివాహ సంబంద జాతక పొంతలనకు మరియు వాస్తు సంబంద విషయములు. ఆసక్తి ఉన్నవారు అన్ని విషయములకు క్రింద తెలిపిన మొబైల్ ఫోన్ ద్వారా గాని లేదా ఈమైల్ ద్వారాగాని సంప్రదించవచ్చును. హైదరాబాద్ లో వుండే వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చు. ఇతర దేశాల్లో వుండే వారు ముందుగా ఈమెయిలు లో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు అడిగే ప్రశ్నలకు ఫోన్ ద్వారా గాని, ఈ మెయిల్ ద్వారా గాని సంప్రదించవచ్చు. అందరికి ఇదే మా ఆహ్వానం. ఫోన్ చేయవలసిన మా మొబైల్ నంబర్ : 9247326197

ఉమామహేశ్వర వ్రతం

ఉమామహేశ్వర వ్రతం  

sakalapoojalu.com

IMAGE0003.JPG

 

ఉమా మహేశ్వర వ్రతం 

గణపతిపూజ 
ఓం శ్రిగురుభ్యోన్నమః, మహాగాణాదిపతయే నమః, మహా సరస్వతాయే నమః. హరిహిఓమ్, 
దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః పశవోవదంతి!  సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నుపసుష్టుతైతు|  అయంముహూర్త సుముహూర్తోఅస్తూ||  యశ్శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా ! తయోసంస్మరనాత్పుమ్సాం సర్వతో జయమంగళం||  
శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
తదేవలగ్నం సుదినంతదేవా తారాబలం చంద్రబాలన్తదేవ! విద్యాబలం దైవబలన్తదేవ లక్ష్మిపతే తేంఘ్రియుగంస్మరామి|| యత్రయోగీశావర కృష్ణో యత్రపార్దో ధనుద్దరః|  తత్ర శ్రీ విజయోర్భూతి ద్రువానీతిర్మతిర్మమ|| స్మృతే సకలకల్యాణి భాజనం యత్రజాయతే|  పురుషస్తమజంనిత్యం వ్రాజామిస్హరణం హరిం|| సర్వదా సర్వ కార్యేషు నాస్తితెశామ మంగళం| యేషాంహ్రుదిస్తో భగవాన్ మంగళాయతనం హరిం| లాభాస్తేశాం జయస్తేషాం కుతత్తేషాం పరాభవః|| యేశామింది వరష్యామో హృదయస్తో జనార్దనః|  ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం|  లోకాభిరామం శ్రీ రామం భూయోభూయోనమామ్యాహం||  సర్వమంగళ మాంగల్యే శివేసర్వార్ధసాదికే|  శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే|| 
శ్రీ లక్ష్మి నారాయనాభ్యాం నమః|  ఉమా మహేశ్వరాభ్యాం  నమః|  వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః| శాచీపురంధరాభ్యాం నమః|  అరుంధతి వశిష్టాభ్యాం నమః| శ్రీ సీతారామాభ్యాం నమః|  సర్వేభ్యోమహాజనేభ్యో నమః|  
ఆచ్యమ్య:
ఓం కేశవాయ స్వాహాః, నారాయణాయ స్వాహాః,  మాధవాయ స్వాహాః,  గోవిందాయ నమః,  విష్ణవే నమః,  మధుసూదనాయ నమః,  త్రివిక్రమాయ నమః,  వామనాయ నమః,  శ్రీధరాయ నమః,  హృషీకేశాయ  నమః,  పద్మనాభాయ నమః,  దామోదరాయ నమః,  సంకర్షణాయ నమః,  వాసుదేవాయ నమః,  ప్రద్యుమ్నాయ నమః,  అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,  అధోక్షజాయ నమః,  ,నారసింహాయ నమః,  అచ్యుతాయ నమః,  ఉపేంద్రాయ నమః,  హరయే నమః,  శ్రీ కృష్ణాయ నమః,  శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

ప్రాణాయామము: 


ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగుం సువః,   ఓం మహః ఓంజనః ఓంతపః ఓగుం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్.

 ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం.  మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దిస్య  శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు .......... సంవత్సరే, .......ఆయనే,  ....... మాసే, .......పక్షే  ,......తిది, ,,,,,,,,వాసరే  శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం,  శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం,  పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం,  సర్వాభీష్ట సిద్ధ్యర్థం,  మహా గణాధిపతి  ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే.

కలశారాధన: 


(కలశమునకు గంధము, కుంకుమబొట్లు పెట్టి,ఒక పుష్పం, కొద్దిగా అక్షతలువేసి, కుడిచేతితో కలశమును మూసి ఈ క్రింది మంత్రమును చెప్పవలెను). 

శ్లో: కలశస్యముఖేవిష్ణుః కంఠేరుద్ర సమాశిత్రాః మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతాః
కుక్షౌతు సాగరాసర్వే సప్తద్వీపోవసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః
అంగైశ్చ సహితాసర్వే కలశౌంబుసమాశ్రితాః ఆయాంతు శ్రీవరలక్ష్మీ పూజార్ధం దురితక్షయ కారకాః

మం: ఆ కలశే షుధావతే పవిత్రే పరిశిచ్యతే 
ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే, ఆపోవా ఇదగుం సర్వం 
విశ్వా భూతాన్యాపః ప్రాణావాఆపః పశవ ఆపోన్నమాపోమ్రుతమాపః
సమ్రాడాపోవిరాడాప స్వరాదాపః చందాగుశ్యాపో జ్యోతీగుష్యాపో యజోగుష్యాప 
సత్యమాపస్సర్వా దేవతాపో భూర్భువస్సువరాప ఓం.

శ్లో.. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి 
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఏవం కలశపూజాః
కలశోదకాని పూజాద్రవ్యాణి సంప్రోక్ష, దేవంసంప్రోక్ష, ఆత్మానం సంప్రోక్ష (అని పఠించి ఆ నీటిని దేవునిపై, పూజాద్రవ్యములపై, తమపై అంతటాచల్లవలెను.)

ప్రాణప్రతిష్ఠ:

మం: ఓం అసునీతేపునరస్మాసు  చక్షు పునః ప్రాణామిహనో దేహిభోగం| జోక్పస్యేమ  సూర్యముచ్చరంతా మృళయానా స్వస్తి|| అమ్రుతంవై ప్రాణా అమ్రుతమాపః ప్రానానేవయదా స్థాన ముపహ్వాయతే||  స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు | 

ధ్యానం: 
మం: ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే! కవింకవీనా ముపశ్రవస్తమం 
జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహంణస్పత ఆనశ్రుణ్వన్నూతి భిస్సీద సాదనం|| 
శ్రీ మహా గణాధిపతయే నమః | ధ్యానం సమర్పయామి.  ఆవాహయామి ఆసనం సమర్పయామి |  పాదయో పాద్యం సమర్పయామి | హస్తయో అర్గ్యం సమర్పయామి |  శుద్ధ ఆచమనీయం సమర్పయామి |  

శుద్దోదక స్నానం:
మం: ఆపోహిష్టామ యోభువహ తాన ఊర్జే దధాతన మహేరణాయ   చక్షశే|
యోవశ్శివతమొరసః తస్యభాజయ తేహనః  ఉషతీరివ మాతరః 
తస్మా అరణ్గామామవః యస్యక్షయాయ జిన్వద ఆపోజనయదాచానః||
శ్రీ మహాగణాదిపతయే నమః  శుద్దోదక స్నానం సమరపయామి.  స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి | 

వస్త్రం:
మం:  అభివస్త్రాసువసన న్యరుశాభిదేను సుదుగాః పూయమానః| 
అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వా స్రదినోదేవసోమ|| 
శ్రీ మహా గణాదిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి | 

యజ్ఞోపవీతం:
మం: యజ్ఞోపవీతం పరమంపవిత్రం ప్రజాపతైర్ యత్సహజం పురస్తాత్|  
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుబ్రం యజ్ఞోపవీతం బలమస్తుతెజః|| 
శ్రీ మహా గణాదిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి | 

గంధం: 
మం: గంధద్వారాం దురాధర్శాం నిత్యపుష్టాంకరీషిణీం| 
ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వాయే శ్రియం||
శ్రీ మహా గణాదిపతయే నమః గందాన్దారయామి | 

అక్షతాన్:
మం: ఆయనేతే పరాయణే  దూర్వారోహంతు పుష్పిణీ హద్రాశ్చ పున్దరీకాణి సముద్రస్య గృహాఇమే ||
శ్రీ మహా గణాదిపతయే నమః గంధస్యోపరి అలంకారణార్ధం అక్షతాం సమర్పయామి |

అధఃపుష్పైపూజయామి. 
ఓం సుముఖాయనమః 
ఓం ఏకదంతాయనమః 
ఓం కపిలాయనమః 
ఓం గజకర్నికాయనమః 
ఓం లంభోదరయానమః 
ఓం వికటాయనమః
ఓం విఘ్నరాజాయనమః 
ఓం గానాదిపాయనమః 
ఓం దూమ్రకేతవే నమః 
ఓం గణాధ్యక్షాయ నమః 
ఓం ఫాలచంద్రాయనమః 
ఓం గజాననాయనమః 
ఓం వక్రతుండాయ నమః 
ఓం శూర్పకర్ణాయ నమః 
ఓం హీరంభాయ నమః 
ఓం స్కందాగ్రజాయ నమః 
ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః 
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నానావిధ పరిమళపత్ర పూజాం సమర్పయామి.  

ధూపం:
వనస్పతిర్భవైదూపై నానాగంధైసుసంయుతం | 
ఆఘ్రేయస్సర్వ దేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం ||  
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దూపమాగ్రాపయామి.  

దీపం: 
సాజ్యంత్రివర్తి సంయుక్తం వన్హినాంయోజితం ప్రియం గ్రుహానమంగళం దీపం త్రిలోఖ్యతిమిరాపహం | 
భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే | త్రాహిమాం నరకాద్ఘోర దివ్యిజ్యోతిర్నమోస్తుతె  ||  
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దీపం దర్శయామి | దూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి || 

నైవేద్యం: 
మం:   ఓం భూర్భువస్సువః | ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి| ధియోయోనః ప్రచోదయాత్ || సత్యన్త్వర్తేన పరిశించామి| అమృతమస్తు|| అమృతోపస్త్హరణమసి ||
శ్లో:  నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం | భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యాతాం || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః మహా నైవేద్యం సమర్పయామి.  ఓం ప్రానాయస్వాహా, ఓం అపానాయస్వాహః, ఓం వ్యానాయస్వాహః , ఓం ఉదానాయస్వాహః, ఓం సమానాయస్వాహః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి || అమ్రుతాపితానమసి || వుత్తరాపోషణం సమర్పయామి || హస్తౌ ప్రక్షాళయామి || పాదౌ ప్రక్షాళయామి || శుద్దాచమనీయం సమర్పయామి || 

తాంబూలం:
ఫూగిఫలై సమాయుక్తం ర్నాగవల్లిదళైర్యుతం | 
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం || 
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః తాంబూలం సమర్పయామి | 

నీరాజనం: 
మం: హిరణ్యపాత్రం మధోపూర్ణం దదాతి 
మాధవ్యోసనీతి   ఏకదా బ్రహ్మణ ముపహరతి 
ఏకదైవ ఆయుష్తేజో దదాతి.
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నీరాజనం సమర్పయాం || 

మంత్రపుష్పం:
శ్లో: సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః | లంభోదరైశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || దూమ్రాకేతుర్గనాధ్యక్షో ఫాలచంద్రోగాజాననః | వక్రతుండశూర్పకర్ణౌ హేరంభస్కందపూర్వజః ||  షోడశైతాని  నామాని యఃపఠే చ్రునుయాదపి |  విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ఘమేతదా | సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్థస్యనజాయతే |  ఓం శ్రీ మహాగానాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి


ప్రదక్షణ నమస్కారం:
శ్లో:  యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తానితాని ప్రనక్ష్యంతి ప్రదక్షిణం పదేపదే || పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః | త్రాహిమాం క్రుపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణంనాస్తి త్వమేవా శరణంమమ | తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షో గణాధిపః || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః ఆత్మప్రదక్షణనమస్కారం సమర్పయామి || 
యస్యస్మ్రుత్యాచ నామోక్య తవః పూజ క్రియాదిషు  |  న్యూనంసంపూర్ణ తామ్యాటి సద్యోవందే గణాధిపం || మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే || అన్యా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగానాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు |  ఉత్తరే శుభకర్మణ్య  విఘ్నమస్థితి భావంతో బృవంతు || శ్రీ మహా గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్న్నామి ||
మం: యజ్ఞేన యగ్నమయదంతదేవా స్తానిధర్మాని ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్సచన్తే  యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః||
శ్రీ మహాగానాదిపతయే నమః యధాస్థానం ప్రవేశాయామి, శోభనార్దే పునరాగమనాయచ.ఉమామహేశ్వర పూజ:
ప్రాణ ప్రతిష్టాపన:
ఓం అస్యశ్రీ ఉమామహేశ్వర ప్రాణ ప్రతిష్టాపన మహా మంత్రస్య|
బ్రహ్మ విష్ణు మహేశ్వరా ఋషయః  ఋగ్యజుర్ సామాదర్వణ వేదాః చందాసి,
ప్రాణ శక్తి, పరాదేవతా హ్రాం హ్రీం శక్తి|
హ్రూం కీలకం, ఉమామహేశ్వర ప్రాణ ప్రతిష్టా సిధ్యర్దే జపెవినియోగః ||

కరన్యాసః:
హ్రాం అంగుష్టాభ్యాం నమః |
హ్రీం తర్జనీభ్యాం నమః|  
హ్రూం మధ్యమాభ్యాం నమః |  
హ్రైం అనామికాభ్యాం నమః |  
హ్రౌం కనిష్టికాభ్యాం నమః |  
హ్రః కరతలకర పృష్టాభ్యాం  నమః ||

అంగన్యాసః:
హ్రాం హృదయాయ నమః|  
హ్రీం శిరసే స్వాహా|  
హ్రూం శిఖాయై వషట్ |  
హ్రైం కవచాయహుం |  
హ్రౌం నేత్రత్రయాయ వౌషట్ |  
హ్రః అస్త్రాయఫట్  
భూర్భువస్సువరోమితి దిగ్భందః|| 

ధ్యానం:
శ్లో:  రక్తాంభోది స్థపోతోల్ల సదరుణ సరోజాది రూడా కరాబ్జ్యై 
పాశం కోదండ మిక్ష్శోద్భవమణి గణ పమ్యంజ్కుశం పంచాబాణాణ్
బిభ్రాణా సృక్కపాలం త్రివయనలసితా పీనవక్షోరుహాడ్యా
దేవీ బాలార్క వర్ణ భవతు సుఖ క్రీ ప్రాణ శక్తి పరానః ||

ఓం ఆం హ్రీం క్రోం యం రం ళం వం శం షం సం హం శం క్షం అనయో ఉమామహేశ్వర ప్రానప్రతిష్టంతు|  
ఓం ఆం హ్రీం క్రోం యం రం ళం వం శం షం సం హం ళం క్షం అనయో ప్రతి మాయో జీవస్తిష్టతు|
ఓం ఆం హ్రీం క్రోం యం రం ళం వం శం షం సం హం శం క్షం అనయో ప్రతి మయో సర్వెంద్రియాని శ్రోత్ర చక్షు జిహ్వ ఘ్రాణ వాక్పాని పాదపా యుపస్తాని ఇహైవా గత్యసుఖం చిరంతిష్టంతు స్వాహా|

మం:  అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణ మిహనో దేహి భోగం,
         జోక్పస్యేమ సూర్య ముచ్చరంతా మనుమతే మ్రుడయానస్వస్తి అమృతం
         వై ప్రాణా అమ్రుతపాపః ప్రాణానేవ యధాస్థాన ముపహ్వాయతే||
         ఆవాహితౌ భావతం|  స్తాపితౌ భావతం | సుప్రసంనౌ భావతం | స్తిరాసనం కురుతం | ప్రసీదతం ప్రసీదతం ప్రసీదతం ||

ధ్యానం:
శ్లో:  ముక్తామాలా పరీతాంగం| రుకూల పరివేష్టితం | 
పంచానస మమాకాంత| మనలేన్డురవిప్రభం|
చంద్రార్ధ శేఖరం నిత్యం \ జతామకుట మండితం | 
త్రిపుండ్రా రేఖావిలస | త్పాలనేత్రో పరిష్తితం|
భాస్మోదూలిత సర్వాంగం | రుద్రాక్ష భరణాన్వితం  | 
మందస్మిత మనాదార | మాదారం జగతాం ప్రభుం |
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః ధ్యానం సమర్పయామి.

ఆవాహనం:
శ్లో:  కైలాసశిఖరా ద్రమ్యాత్|  పార్వత్యా సహితప్రభో
ఆగశ్చ  దేవ దేవేశ - మద్భక్త్య చంద్రశేఖరః||
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమఃఆవాహయామి.

ఆసనం:  
శ్లో:  సురాసుర శిరో రత్న విరాజిత మదాంబుజ|
ఉమా మహేశ మద్దత్త మాన సంప్రతి గుహ్యతాం|
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః రత్న సింహాసనం సమర్పయామి.

పాద్యం:
శ్లో:  యద్భాక్తలేశ సంపర్క | పరమానంద సంభవో |
ఉమా మహేశ చరనే | పాద్యం వం కల్పయామిచ |
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః పాద్యం సమర్పయామి.

అర్ఘ్యం:
శ్లో:  నమస్తే పార్వతీకాంత | నమస్తే భక్త వత్సల |
త్రయంబక మహాదేవ | గృహాణార్ఘ్యం సదాశివ | 
నమస్తే దేవి శర్వాణి | ప్రసన్న భయ హారిణి | 
అంబికే వరదే దేవి | గృహాణార్ఘ్యం శివప్రియే | 
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః అర్ఘ్యం సమర్పయామి.

ఆచమనీయం:
శ్లో:  మునిభిర్నారద ప్రఖై |  ర్నిత్యమాఖ్యాత వైభవో |
ఉమా మహేశౌ మత్ప్రీత్యా గృహాణాచమనం శుభం|
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః ఆచమనీయం సమర్పయామి.

మధుపర్కం:
శ్లో:  సర్వ కల్మష నాశాన్యై | పరిపూర్ణ సుఖాత్మనే | 
మధుపర్క మమేశంభో | కల్పయామి ప్రసీదతం|
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః మధుపర్కం సమర్పయామి.

మంచామృత స్నానం:
మం:  ఆప్యాయస్వసమే తుతే విశ్వతస్సోమ  వృష్ణియం  | 
భావావాజస్య సంఘదే |  (క్షీరం )

మం: దదిక్రావర్ణో అకారిషం జిశ్నో రశ్వస్య వాజినః | 
సురభినో ముఖాకర త్ప్రణ ఆయూగింషీ తారిషత్ |  (దధి)

మం:  శుక్రమసి జ్యోతిరసి తెజోసి దేవోవ స్సవితోత్పునా త్వచ్చిద్రేణ 
పవిత్రేనా వసో సూర్యస్య రశ్మిభి: (ఆజ్యం)

మం:  మధువాతా ఋతాయతే | మధుక్షరంతి సిన్ధవః | మాద్వీర్ణ స్సన్త్వోషదీ మధు నక్తముతో శసి | 
మధుమత్పార్దివగుం రజః మధుద్యోవ్రస్తునః పితా | మధుమాన్నో వనస్పతి ర్మదుమాగు అస్తు సూర్యః |
మాద్వీర్ఘావో భవన్తునః |  (మధు:)

మం:  స్వాదు: పవస్వదివ్యాయ జన్మనే స్వాదు రింద్రాయ సుహావేటు నామ్నే 
స్వాదుర్మిత్రాయ వరునాయ వాయవే బృహస్పతయే మధుమాం అదాభ్యః  (శర్కరా)
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః మంచామృత స్నానం సమర్పయామి.  

స్నానం:
మం:  నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషావేనమః ............ ఇతి రుద్రా సూక్తేన స్నానం.
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమఃశుద్దోదక స్నానం సమర్పయామి.

వస్త్రం: 
మం:  అబివస్తాసు వసనాన్యరుశాభి దేనూసుదుఘః పూయమానః 
అభిచంద్రా భర్త వేనో హిరణ్యా భ్యశ్వా రాధినో దేవసోమ |
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః వస్త్ర యుగ్మం సమర్పయామి.

యజ్ఞోపవీతం:
మం:  యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్ |
ఆయుష్య మగ్రియం ప్రతి మున్చశుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః |
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః యజ్ఞోపవీతం సమర్పయామి.

భస్మలేపనం  :
మం:  అగ్నిరితి భస్మ |  వాయురితి భస్మ |  జలమితి భస్మ |  స్థాలమిటి భస్మ | 
వ్యోమేతి భస్మ |  సర్వగుం హవైదగుం భస్మ వాజ్మన ఇత్యేతాని చక్షూగుంషి కారణాని భాస్మాని|
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః భస్మ పరికల్పయామి.  

గంధం:
మం:  గంధద్వారాం దురాధర్శాం నిత్యపుష్టాం కరీషిణీం
ఈశ్వరీగుం సర్వ భూతానాం తామి హోపహ్వాయే శ్రియం|
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః గంధం పరికల్పయామి.

అక్షతాన్:
మం:  ఆయనేతే పరాయనే దూర్వారోహే హస్తు పుష్పిణీం  |
హ్రద్రాశ్చ  పున్దరీకాని తామి హోపహ్వాయే శ్రియం|
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః అక్షతాన్ సమర్పయామి.

హరిద్రా కుంకుమా చూర్ణం:
శ్లో:  హరిద్రా కుంకుమ చైవ |సింధూరం కజ్జలాధికం|
నీలలోహిత తాటంకీ| మంగళ ద్రవ్య మీశ్వర |
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః సుగంధ సుపరిమళ ద్రవ్యాణి సమర్పయామి.

ఆభరణం:
శ్లో:  కిరీతహార కేయూర | కంకణాది విభూషణై  |
అలంకరోమి దేవేశో | భక్తా భీష్ట ఫలప్రదౌ ||
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః నానావిధ సువర్ణ భూషణాని సమర్పయామి.

అధాంగ పూజ:
శివాయై నమః                       -         శిరః పూజయామి
పృధువేణ్య   నమః                 -         వేణీం పూజయామి 
సీమంత రాజితాయై నమః       -         సీమంతం పూజయామి
కుంకుమ ఫాలాయై నమః       -         ఫాలం పూజయామి
చక్షుష్మత్యై  నమః                  -         నేత్రే పూజయామి
శ్రుతిశ్రోత్రాయై నమః                -         శ్రోత్రే పూజయామి
గంధ ప్రియాయై నమః             -         ఘ్రాణం పూజయామి
సుభాగకపోలాయై  నమః        -         కపోలౌ పూజయామి
కుట్మల దంతాయై నమః         -         దంతాన్ పూజయామి
విద్యా జిహ్వాయై నమః            -         జిహ్వం పూజయామి
బిమ్బోష్టై నమః                     -         ఓష్ఠం పూజయామి
వృత్త  కంఠ్యై నమ                  -         కంఠం పూజయామి
పృదులకుచాయై  నమః         -         కుచౌ పూజయామి
విశ్వా గర్భాయై నమః            -         ఉదరం పూజయామి
శుభ కట్యై నమః                   -         కటిం పూజయామి
దివ్యోరుదేశాయై నమః           -         ఊరూం పూజయామి 
వృత్తి జంఘాయై  నమః          -         జంఘే నమః 
లక్ష్మిసెవితపాదుకాయై నమః  -         పాదౌ పూజయామి
మహేశ్వర ప్రియాయై నమః    -          నఖాన్ పూజయామి
శోభన విగ్రహాయై నమః          -          సర్వాంగం పూజయామి

ఓం శివాయ నమః
ఓం మహేశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం పినాకినే నమః
ఓం శశిశేఖరాయ నమః
ఓం వామదేవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం నీలలోహితాయ నమః
ఓం శంకరాయ నమః                                                                
ఓం శూలపానిణే  నమః
ఓం ఖట్వాంగినే నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం అంభికానాథాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం భాక్తవత్సలాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః                                                            
ఓం శితికంఠాయ నమః
ఓం శివాప్రియాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కపాలినే నమః
ఓం కామారినే నమః
ఓం అంధకాసుర సూదనాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం లలాటాక్షాయ నమః
ఓం కాలకాలాయ నమః   
ఓం కృపానిధయే నమః
ఓం భీమాయ నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం మ్రుగపానిణే నమః
ఓం జటాధరాయ నమః
ఓం కైలాసవాసినే నమః
ఓం కవచినే నమః
ఓం కఠోరాయ నమః    
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం వృషాంకాయ నమః
ఓం వృషభారూడాయ నమః                                                       
ఓం భస్మొద్ధూళిత విగ్రహాయ నమః
ఓం సామప్రియాయ నమః
ఓం సర్వమయాయ నమః
ఓం త్రయీమూర్తయే నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం పరమాత్మాయ నమః
ఓం సోమ సుర్యాగ్నిలోచనాయ నమః
ఓం హావిషే నమః
ఓం యజ్ఞామయాయ నమః                                                     
ఓం సోమాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం విశ్వేశ్వరాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం గణనాథాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం హిరణ్య రేతాయ నమః
ఓం దుర్దర్షాయ నమః    
ఓం గిరిశాయ నమః
ఓం గిరీశాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భుజంగ భూషనాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిద్వనినే నమః
ఓం గిరిప్రియాయ నమః
ఓం కృత్తి వాసాయ నమః
ఓం పురారాతయే నమః
ఓం భగవతే నమః
ఓం ప్రమధాదిపాయ నమః                                                       
ఓం మృత్యుంజయాయ నమః
ఓం సుక్ష్మతనవే నమః
ఓం జగద్వ్యాపినే నమః
ఓం జగద్గురవే నమః
ఓం వ్యోమవేశాయ నమః
ఓం మహాసేన జనకాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం భూతపతయే నమః
ఓం స్థాణవే నమః                                                                   
ఓం అహిర్భుద్నాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అష్టమూర్తయే నమః
ఓం అనేకాత్మాయ నమః
ఓం సాత్త్వికాయ నమః
ఓం శుద్ధవిగ్రహాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ఖండపరశవే నమః
ఓం అజాయ నమః
ఓం పాశ విమోచకాయ నమః  
ఓం మృడాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం దేవాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం హరియే నమః
ఓం పూషదంతభేత్రే  నమః
ఓం అవ్య గ్రాయ నమః
ఓం దక్షాధ్వర హరాయ నమః
ఓం హరాయ నమః                                                                    
ఓం భగనేత్రభిదే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదవే నమః
ఓం అపవర్గ ప్రదాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం తారకాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః    
     సూత్రగ్రంది పూజ 
శివాయనమః                          ప్రధమ గ్రంధిం పూజయామి 
శాంతాయ నమః                     ద్వితీయ గ్రంధిం పూజయామి 
మహాదేవాయ నమః                తృతీయ గ్రంధిం పూజయామి 
వ్రుశభద్వాజాయ  నమః           చతుర్ధ గ్రంధిం పూజయామి 
రుద్రాయ నమః                       పంచమ గ్రంధిం పూజయామి 
త్రయంబకాయ నమః               శ్రష్టమ గ్రంధిం పూజయామి 
ఉమా పతయే  నమః               సప్తమ గ్రంధిం పూజయామి 
నీల కంఠయ నమః                 అష్టమ గ్రంధిం పూజయామి
శశిశేఖరాయ నమః                నవమ గ్రంధిం పూజయామి
ఈశ్వరాయ నమః                  దశమ గ్రంధిం పూజయామి
భీమాయ నమః                     ఏకాదశ గ్రంధిం పూజయామి
త్రిపురాంతకాయ నమః           ద్వాశ గ్రంధిం పూజయామి
భీమాయ నమః                     త్రయోదశ గ్రంధిం పూజయామి
కాలాత్మనే నమః                    చతుర్దశ గ్రంధిం పూజయామి
సర్వేశ్వరాయ నమః                పంచదశ గ్రంధిం పూజయామి

ధూపం:
శ్లో:  దశాంగం గగ్గులోపెతం | సుగంధంచ సుమనోహరం|
గృహ్నీతం సర్వ దేవేశో | శివో వంచ నమోస్తుతే||
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః ధూపం సమర్పయామి.

దీపం:
శ్లో;  సవజ్ఞౌ సర్వ లోకేష | త్రిలోక్యతిమిరాపహౌ |
గృహ్ణీతం   మంగళం దీప | ఉమా మహేశ్వరౌ ముదా||
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః దీపం దర్శయామి.

నైవేద్యం:
శ్లో;  అన్న చతుర్విధ స్వాదు | రసైషడ్భి సమన్వితం|
భక్ష భోజ్య సమాయుక్తం | నైవేద్యం ప్రతి గృహ్యాతాం ||
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః నైవేద్యం సమర్పయామి.

తాంబూలం:
శ్లో:  కర్పూరేలా లవంగాడి | తాంబూలీదళ సంయుతం |
క్రముకాది ఫలం దైవ | తాంబూలం ప్రతిగృహ్యాతాం|
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః తాంబూలం సమర్పయామి.

కర్పూర నీరాజనం:
శ్లో:  కర్పూర చంద్ర సంకాశం | జ్యోతిస్సూర్య సమప్రభం |
భక్త్యాదాస్యామి కర్పూర నీరాజన మిదం శివో ||
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః కర్పూర నీరాజనం సమర్పయామి.

మంత్ర పుష్పం:
మం:  తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి|
తన్నో రుద్రః ప్రచోదయాత్ ||

ప్రదక్షిణం:
శ్లో:  యానికానిచ పాపాని | జన్మాంతర కృతానిచ |
తాని తాని ప్రనశ్యంతి | ప్రదక్షణ పదే పదే |
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం  నమః ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి.

 

ఉమా మహేశ్వర వ్రత కథ 


       పూర్వము నైమిశారణ్యముణ  సూతమహాముని చే చెప్పబడుతున్న సకల పురాణ ఇతిహాసములను శౌనకాది మహామునులు శ్రద్దగా వింటున్నారు.  ఒకనాడు సూతమర్షి ఉమా మహేశ్వర వ్రతము గూర్చి ఈ విధంగా వివరించసాగాడు.  
sakalapoojalu.com
          శివసాయిజ్యము పొందుటకు అతి సులభమైన మార్గము రుద్రాక్షలను ధరించుట.....మరియు వాటిని ధరించి "శివనామ మహత్యమును" పఠించిన  వారికిని, వినిన వారికిని భూలోకమునండు సర్వ సౌఖ్యములను పొందుటయే కాక మోక్షము ప్రాప్తిస్తుంది.  శివానం మహత్యమును పఠించిన వారికే ఈ విధమైన మోక్షము కలిగి శివుని యొక్క వ్రాత్ములను శ్రద్దాభక్తులతో ఆచరిన్చేదివారి పుణ్యములు ఇంతని చెప్పుటకు వీలులేదు.  అటువంటి ఒక శైవ వ్రతంబు గురించి చెప్పెదను వినుడు.  అని సూతమహర్షి చెప్పసాగాడు.  
sakalapoojalu.com
           పూర్వము కైలాసములో పరమేశ్వరుడు, పార్వతి కొలువుదీరి మాట్లాడుకొనుచున్నారు.  ఆ మాటల యందు జగదంబ ఈ సృష్టి అంతయు తన యొక్క స్వరూపమేననియు, సృష్టి, స్థితి, లయలు తనచే జరుపబడుచున్నవని పలికినది.  జగత్తులోని సర్వం శక్తిమయంబని జగదంబ పలుకగా శివుడు ఆ మాటలను ఆలకించి  కోపముతో తన పురుష శక్తిని ఉపసంహరించుకున్నాడు.  ఇది జరిగిన వెంటనే జగదంబ కు లోకమంతయు చీకటిగా తోచి దిగ్బ్రాంతి చెందినది.  అంతట ఈ వైపరీత్యము స్వామీ తన  నుండి దూరమగుట వలననే కలిగినదని తెలుసుకొని దు:ఖ పడి, దానికి పరిష్కార మార్గము కొరకు గౌతమ మహర్షి వద్దకు వెడలి తను ఈశ్వరుని అర్ధ భాగమును ఆక్రమించుట ఏ విధముగా జరుగునో దానికి తగు ఉపాయమును తెలుపమనియు, అటువంటి వ్రతంబు ఏదైనా వున్న యెడల తనకి సవివరముగా వుపదేశింప వలెనని  కోరినది.  అంతట గౌతముడు అట్టి వ్రతము వున్నదని తెలిపి ఆ యొక్క వ్రతంబును గురించి సవివరముగా తెలిపినాడు.  అంట ఆ మహాదేవి ఆ వ్రతంబును శ్రద్దాభక్తులతో ఆచరించి పరమేశ్వరుని కృపను పొంది అర్ధ శరీరము పొందినది.  పార్వతీదేవికి గౌతముడు ఉపదేశించిన వ్రత విధానము ఏమనగా! 
sakalapoojalu.com
        భాద్రపద పూర్ణిమ నందు ఈ వ్రతము ఆచరిన్చావలేయును.  ముందుగా చతుర్దశి నాడు ప్రాతః కాలముననే లేచి కాళ్ళ కృత్యములను  తీర్చుకొని స్నానమాచరించి పరమేశ్వరుని భక్తితో పూజించి నమస్కరించి "ఓ మహాదేవా! నేను నీయొక్క వ్రతమును చేయుచున్నాను.  ఆ యొక్క వ్రతమును ఆచరించుటకు నాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఈ వ్రతమును చేసుకొనే శక్తిని ప్రసాదించు తండ్రీ! అని ప్రార్ధించుకోవాలి.  ఆ రోజు సాయంత్రము అంతయు స్వామివారినే ప్రార్ధించి పూజ నిర్వహించుకొని నిదురించి మరుసటి దినము ప్రాతః కాలముననే లేచి కాలక్రుత్యములను తీర్చుకొని శుభ్రమైన వస్త్రములను ధరించి దేహమునకు విభూది రాసుకొని, త్రిపున్ద్రమును నుదిటిపై పెట్టుకోవలేయును.  తరువాత రుద్రాక్షలను ధరించి యధావిధిగా భక్తి శ్రద్దలతో శివుని పూజించి, పరమేశ్వరుని ప్రీతికి హోమమును చేయవలేయును.  
sakalapoojalu.com
          ఈ వ్రతమును చేయువారు ముందుగా తమ శక్తి కొలది బంగారముతోగాని, వెండితోగాని, మట్టితో గాని ఉమా మహేశ్వరుల ప్రతిమలు చేసి వుంచుకోవలెను.  తరువాత పదిహేను వరుసలు, పదిహేను ముడులతో తోరమును తయారు చేసుకొని ఆ తోరనమును పసుపు కుంకుం లతో, పువ్వులతో పూజింపవలెను.  అటు పిమ్మట ఉమా మహేశ్వరుల ప్రతిమను కలశము నందు వుంచి వస్త్రమును కలశామునకు చుట్టి , ఆ ప్రతిమలకు స్నానము చేయించి గంధ పుష్పాడులతో పూజించవలెను.  పూజానంతరము శివాలయమునకు వెడలి శివునికి అభిషేకము చేయించి సమీపమున కలశము ప్రతిష్టించి ఆ కలశము ముందు తోరమును పళ్ళెములో వుంచావలేయును. ఉమా మహేశ్వరులను భక్తి శ్రద్దలతో పూజించి, తోరమును చేతికి కట్టుకోవలెను.  గోధుమపిండి తో చేసిన పదిహేను రకముల పిండి వంటలను నైవేద్యముగా పెట్టవలేయును.  తరువాత భక్తితో నమస్కరించి వస్త్రముతోపాటు వున్న కలశమును ఉమా శంకరుల  ప్రతిమలను బ్రాహ్మణులకు దానమివ్వవలెను.  

          ఈవిధముగా 15 సంవత్సరములలో అష్టమీ, చట్రుదషీ, పౌర్ణమి యందు 15 సార్లు ఈ వ్రతంబును చేసుకోవలేయును.  పదహారవ సంవత్సరమున ఉద్యాపన చేసుకోవలేయును.  వీలు కాని యెడల తదుపరి సంవత్సరము వ్రతము చేసుకోను ఉద్యాపన చేసుకోవలేయును.  

             ఉద్యాపన వ్రతమును పదిహేను సంవత్సరములు ఆచరించిన తరువాత చేసుకోవలెను.  ఆరున్నర తులములతోగాని, అందున సగము లేదా దానిలో సగముతో గాని బంగారము తో ఉమా శంకరుల ప్రతిమలను చేయించవలెను.  బంగారముతో చేయించలేని పక్షమున వెండితో చేయించవలెను.  సహ్క్తి అనుసారముగా వెండి, రాగి కలశాములను పదిహేను చేయించవలెను.  భాద్రపద శుద్ధ చతుర్దశ దినమున పదిహేను మంది "వీర శివులను" తీసుకవచ్చి వారని "రుత్విక్కులుగా" పిలువవలెను.  ఆ రోజు రాత్రి వ్రతము ఆరంభించవలెను  ముందుగానే దక్షిణ తామ్బూలములను ఇవ్వవలెను. తరువాత శుబ్రముగా కడిగి ముగ్గులు పెట్టిన గృహమునందు శివస్థానమును కల్పించి ఆ స్థానమున పువ్వులతో మంగళ కరముగా  అలంకరించి ఉమా మహేశ్వరులను ప్రతిష్టించి, ఋత్వికుల సమక్షమున ఈ పూజ చేసుకోను వారితో సహా ఉపవాసము రాత్రియంతా ఉంది నాలుగు ఝాముల యందును పూజ నిర్వహింప వలెను  .

         ఎవరైతే ఈ విధముగా శ్రద్దా భక్తులతో ఉమా మహేశ్వర వ్రతమును ఆచరించెదరో వారు అష్టిశ్వర్యములతో తులతూగి చివరకు శివసాన్నిధ్యము  చేరుదురు.         

          ఈ వ్రత కథను తెలుసుకోనిన మహర్షులు ఇంతటి మహోన్నతమైన వ్రతము ఎవరు ఆచరిన్చిరనియు, వారు ఎవరో సవివరుగా తెలుపుమని గౌతమ మహర్షిని కోరగా ఆయన ఈవిధముగా వివరించెను.  
sakalapoojalu.com
          ఒకానొకప్పుడు దూర్వాసముని అన్ని లోకములను సంచరించుతూ వైకుంథము చేరెను.  ఆయన రాకకు విష్ణుమూర్తి సంతోషించి ఆ మహర్షికి అతిధి మర్యాదలు చేసి పూజించి ఆసీనులవ్వమని పలికినారు.  అంతటికిని సంతోషించి ఆ ముని మిక్కిలి ఆనందముతో శివునిచే తనకు ఇవ్వబడిన  "బిల్వమాలికను" విష్ణుమూర్తికి ఇచ్చినాడు.  అంతట విష్ణుమూర్తి ఆ మాలికను స్వీకరించి తాను ధరింపక గరుత్మంతుని కంఠమున అలంకరించెను.  ఇది వీక్షించినంతనే  దూర్వాస మహామునికి కూపమువచ్చి ఓయీ! పరమశివునిచే ఇవ్వబడిన ఈ మాలికను ప్రేమతో నీకు ఇచ్చిన ఆ మాలను గరుడునకు వేసితివి.  నీవు చేసిన ఈ చర్య వలన నీ సర్వస్వమునకు మూలమైన లక్ష్మి నశించుగాక! గరుత్మంతుడు నశించి పోవుగాక, వైకుంఠాధిపత్యము పోయి కారడవి యందు వ్రుక్షముగా పుట్టి గొడ్డలితో దెబ్బలు తిన్డువుగాక అని శపించి వెల్లిపోయిను.  

          శాప ఫలితముగా లక్ష్మిదెవి పుట్టింటికి వెడలెను.  విష్ణువు వృక్షముగా పుట్టెను.  కొంత కాలంనకు నేను అచటకు వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి విషయమును తెలిపి శాప విమోచనమును వుపదేశించామనేను.  అంతట తను ఈ ఉమా మహేశ్వర వ్రతమును గురించి తెలుపగా విష్ణుమూర్తి యధావిధిగా శ్రద్దలతో ఈ వ్రతము ఆచరించినాడు.  అంతట శంకరుడు ప్రసన్నుడై లక్ష్మిదెవిని విష్ణుమూర్తి వద్దకు చేర్చి గరుత్మంతుని ఇచ్చి విష్ణువునకు శాప విమోచనము గావించెను.  

sakalapoojalu.com

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

sharma

Watch

Rayaprolu
Mallikharjuna
Sharma Garu
  • ntv
  • bhakthi-tv
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb