Valuable Information
::సకలపూజలు.కామ్ అభిమానులకు శుభవార్త ! ప్రేక్షకులకు శ్రీ కాశీభట్ల బాలకృష్ణ శర్మ గారు అన్నిరకముల జాతక సమస్యలకు ఖచ్చితమైన జాతక పరిశీలన చేసి ఆయా సమస్యలకు సరైన పరిహారములను తెలియజేయుదురు. 1. విద్యా, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, సంతానము, ఆరోగ్యము, విదేశీయాన మొదలగు జాతక సమస్యలు 2. వివాహ, వ్యాపార, గృహారంభ, గృహప్రవేశ, ఉపనయ తదితర వాటికి శుభ ముహూర్తములను నిర్ణయము చేయుట 3. వివాహ సంబంద జాతక పొంతలనకు మరియు వాస్తు సంబంద విషయములు. ఆసక్తి ఉన్నవారు అన్ని విషయములకు క్రింద తెలిపిన మొబైల్ ఫోన్ ద్వారా గాని లేదా ఈమైల్ ద్వారాగాని సంప్రదించవచ్చును. హైదరాబాద్ లో వుండే వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చు. ఇతర దేశాల్లో వుండే వారు ముందుగా ఈమెయిలు లో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు అడిగే ప్రశ్నలకు ఫోన్ ద్వారా గాని, ఈ మెయిల్ ద్వారా గాని సంప్రదించవచ్చు. అందరికి ఇదే మా ఆహ్వానం. ఫోన్ చేయవలసిన మా మొబైల్ నంబర్ : 9247326197

నురాగ దాంపత్యానికి అనంగ వ్రతం

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలెంతో విశిష్టమైనవి. ప్రపంచ దేశాలకే ఆదర్శమైనవి. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రముఖ స్థానం ఉంది.

భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి హాయిగా జీవించేందుకు ఎన్నోవ్రతాలు, నోములు, పూజలున్నాయి. ఇవి అనాదిగా ఆచరింపబడుతూ దాంపత్య జీవనాన్ని పటిష్ఠంగానూ, సుఖ మయంగా గడపేందుకు ఎంతో దోహదపడుతున్నాయి.

అలాంటి వాటిలో చైత్రమాసంలో వచ్చే అనంగత్రయోదశి ఒకటి. ఈ రోజు శివుణ్ని పూజిస్తే సంవత్సరంలో ప్రతి రోజూ శివుడిని పూజించిన ఫలం లబిస్తుందని శాస్త్ర వచనం. అదేవిధంగా ఈ రోజు మన్మధుని పూజిస్తే భార్యభర్తల మధ్య అన్యోన్యత వృద్ధి చెందు తుంది.

భార్యభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందింపజేసి, దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చేసే వ్రతమే- 'అనంగత్రయోదశీ వ్రతం'. ఈ వ్రతాన్ని చైత్రమాసంలో శుక్ల పక్ష త్రయోదశీ నాడు ఆచరించాలి.

అనంగుడు అంటే 'మన్మధుడు' అని అర్థం. మన్మధుడు బ్రహ్మచేత, శివుని చేత అనంగు నిగా (అదృశ్యునిగా) చేయబడినట్లు పురాణ కథలు మనకు చెబుతున్నాయి.

మన్మథుని వాహనం చిలుక. అరవిందాది పుష్పాలు అతని బాణాలు. అతడు ప్రేమాధి దేవత. మంచిరూపం కలవాడు.

తారకాసురుడనే రాక్షసుడు వరగర్వంతో సకలలోకాల్ని కష్టాలపాలు చేయసాగాడు. దీనితో వాణ్నలా చంపాలని దేవతలంతా రకరకాల ఆలోచనలుచేసి, చివరకు బ్రహ్మదేవుడి సలహా తీసుకుంటారు.

అందుకు శివుడి కుమారుడే తారకాసురుణ్ని అంతమొంది స్తాడని సమాధానమిస్తాడు బ్రహ్మ. అప్పటికి శివుడు తపస్సులో ఉండటంతో, శివుడు తపస్సు మాని పార్వతీ దేవిని వివాహం చేసుకునేలా బాధ్యతను ఇంద్రుడు మన్మధుడికి అప్పగించాడు.

దీంతో మన్మథుడు తన బాణాన్ని శివుడిపై ప్రయోగించాడు. శివుడి మనస్సు చలించింది. తన మనస్సుకు చలింప చేసింది ఎవరు? అని శివుడు మూడవ కన్ను తెరవడంతో మన్మథుడు భస్మమై 'అనంగుడయ్యాడు'. ఈ విషయం తెలిసి రతీదేవి విలపించి, శివుడిని ప్రార్థించింది. దీంతో శివుడు మన్మథుడిని బ్రతికించి కేవలం రతీదేవికి మాత్రమే కనిపించేటట్లు వరం ప్రసాదించాడు.

ఆ విధంగా వరం ప్రసాదించిన దినమే 'అనంగ'త్రయోదశి. గంగాసరయూ నదీ సంగమ ప్రాంతం ఒకప్పుడు అంగదేశంగా మన్మథుడి పేర ప్రసిద్ధిగాంచింది. ఈరోజూ పరమేశ్వరునితో పాటు రతీమన్మథులను పూజిస్తే అన్యోన్యమైన దాంపత్యసిద్ధి కలుగుతుందని ధర్మసింధు కూడా స్పష్టీకరిస్తోంది. కామదేవాయ విద్మహే| పుష్పబాణాయ ధీమహి| తన్నో అనంగ ప్రచోదయాత్‌|| అనే అనంగ గాయత్రీని స్మరించుకుంటూ రతీమన్మథులను పూజిం చాలి. కామదేవుడన్నా, అనంగుడన్నా, పుష్పబాణుడన్నా ఇవన్నీ మన్మథునికి పేర్లే. అయితే, కామ మరింత ప్రకోపించకుండా కామారి అయిన మహాదేవుణ్ని కూడా పూజించాలి. సకల ఐశ్వర్య, ఆనంద ప్రధాన సర్వేశ్వరుడే కదా!

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

sharma

Watch

Rayaprolu
Mallikharjuna
Sharma Garu
  • ntv
  • bhakthi-tv
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb