Valuable Information
::సకలపూజలు.కామ్ అభిమానులకు శుభవార్త ! ప్రేక్షకులకు శ్రీ కాశీభట్ల బాలకృష్ణ శర్మ గారు అన్నిరకముల జాతక సమస్యలకు ఖచ్చితమైన జాతక పరిశీలన చేసి ఆయా సమస్యలకు సరైన పరిహారములను తెలియజేయుదురు. 1. విద్యా, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, సంతానము, ఆరోగ్యము, విదేశీయాన మొదలగు జాతక సమస్యలు 2. వివాహ, వ్యాపార, గృహారంభ, గృహప్రవేశ, ఉపనయ తదితర వాటికి శుభ ముహూర్తములను నిర్ణయము చేయుట 3. వివాహ సంబంద జాతక పొంతలనకు మరియు వాస్తు సంబంద విషయములు. ఆసక్తి ఉన్నవారు అన్ని విషయములకు క్రింద తెలిపిన మొబైల్ ఫోన్ ద్వారా గాని లేదా ఈమైల్ ద్వారాగాని సంప్రదించవచ్చును. హైదరాబాద్ లో వుండే వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చు. ఇతర దేశాల్లో వుండే వారు ముందుగా ఈమెయిలు లో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు అడిగే ప్రశ్నలకు ఫోన్ ద్వారా గాని, ఈ మెయిల్ ద్వారా గాని సంప్రదించవచ్చు. అందరికి ఇదే మా ఆహ్వానం. ఫోన్ చేయవలసిన మా మొబైల్ నంబర్ : 9247326197

నారాయణ శతకము

 

ఆలోక్య సర్వ శాస్త్రాణివిచార్యచ పున: పున: 

ఇమ మేకం సునిష్పన్నంధ్యాయే నారాయణం సదా

 

శ్రీ రామా హృదయేశ్వరా. భక్త జన చిత్త జలరుహ భాస్కరా

కారుణ్య రత్నాకరా.నీవె గతి కావలె నారాయణా|

 

పాప కర్మములఁ జేసి నరక కూపములఁ బడజాల నిఁకను

నీపాదభక్తి యొసఁగి యొక్క దరిజూపవే నారాయణా|

 

దానధర్మములఁజేయ నేర నీ దాసులను బొగడ నేర

నా నేరములఁ దలఁపక దయచేసి నన్నేలు నారాయణా|

 

ఆన యించుక లేకను దుర్భాష లాడు నా జిహ్వ యందు

నీ నామ చతురక్షరిని దృఢముగా నిలుప వలె నారాయణా|

 

ఒకటపరి శుద్ది లేక నాజన్మ మకట వ్యర్దం బాయెను

అకలంకమగు మార్గముం జూపవే సకలేశ నారాయణా |

 

వేగి లేచినది మొదలు సంసార సాగరంబున నీదుచు

మీగుణము నొకవేళను దలపగదె మేలనుచు నారాయణా

 

లోక వార్తలకు,మరఁగి,కర్ణముల మీకథల విననేరను

ఏకరణి భవ జలధిఁ దుదముట్ట నీదెదను నారాయణా

 

ఇల మనుజ జన్మమెత్తి, సుజ్ఞాన మించు కంతయు లేక 

కలఁతఁ జెందెడు చిత్తమున్, స్వచ్ఛంబుగాఁ జేయు నారాయణా

 

ఎంత పాపాత్ముడైన మిముఁదలంచి కృతకృత్యుఁడౌను

బుడమి, నింతపరుస వేది సోఁకిన,లోహంబు హేమమౌ నారాయణా

 

కామాంధకారమునను,బెక్కు దుష్కర్మలఁ జేసి నేను

నీ మఱుఁగు జొచ్చినాను,నామీఁదఁ నెనరుంచు నారాయణా

 

సమయమైనపుఢు మిమ్ముఁదలచుటకు శక్తి కలుగునో కల

గదో సమయమని తలఁతునివుఢు,నా హృదయ కమలమున నారాయణా

 

ఆటలన్నియు ఱంకులు నేనాడు మాటలన్నియు బొంకులు

పాటింప నింతకైన,చేయుచు నున్నదే పాపంబు నారాయణా

 

వావిదప్పినవాఁడను దుష్క్రియా వర్తనుఁడ నగుదు నేను

భావనునిగాఁ జేయవె ననుఁ బతిత పావనుఁడ నారాయణా

 

దేహమే స్దిరమనుచు దెలిసి నే మోహబద్డుఁడ నగుచును

సాహసంబునఁ జేసితిఁ నేగురు ద్రోహంబునారాయణా

 

ఎన్ని జన్మములా లాయెనో,నేటి కెందెందు జన్మించినానో

నన్ను దరిఁజేర్పఁగదవె ,యికనైన నా తంఢ్రి నారాయణా

 

యమ కింకరులఁ దలచిన,నాగుంఢె యావులింపుచున్నది

యముని బాధలు మాన్పను,గురుతైన వైద్యుఁడవు నారాయణా

 

అరయగామ క్రోధముల్,లోభంబు మోహమద మత్సర ములు

తఱుఁగ వెప్పుఢు మనసున నన్నుమన్నించి కృపజూడు నారాయణా

 

ఆశాపిశాచి పట్టి,వైరాగ్య వాసనలఁ జేరనీయడు

గాసి పెట్టుచు నున్నది,నేనేమి చేయుదును నారాయణా

 

తాపత్రయంబుఁ జెంది,చాల పరితాపమొందెడు చిత్తము

నీ పాదములఁ జెందిన జల్లనై నిలుచునింక నారాయణా

 

చింతాపరం పరలచే,చిత్తంబు చీఁకాకు పడుచున్నది

సంతోషమునఁ గూర్పవె దివ్య ప్రసాదమునునారాయణా!

 

శరణుఁ జొచ్చినవాఁడను,నేఁజేయుదురితముల పహరించి

పరమపద మొఁసగగదవె,యికనైనఁ బరమాత్మ నారాయణా

 

సంకల్పములు పుట్టిన,కర్మ వాసనల దృఢముగ జేయవు

సంకలము నొందించకే నను సత్య సంకల్ప నారాయణా

 

ఒకవేళ నన్ను బుధ్ది యొకవేళ నుండదిఁక నేమి సేతు

విశదంబుగాఁ జేయవే,నీవు నా చిత్తము నారాయణా

 

నెట్టుకొని సకలజీవ,కోటులను గొట్టి భక్షించినాను

పొట్టకొరకై నీచుల,సేవించి రట్టయితి నారాయణా

 

నేను పుట్టినది మొదలు ఆహార నిద్రలను జనె కాలము

పూజ యెప్పుఢు సేయుదు నీపదధ్యానంబు నారాయణా

 

ప్రొద్దు వోవక యున్నను,వేసరక పొరుగింఢ్లు తిరుఁగుగాని

బుద్దిమాలిన చిత్తము, నీయందుఁ బొందదే నారాయణా

 

ఎన్ని విధములఁ జూచిన,నిత్యమును హృదయమున మిము

మఱవక యున్నంతకన్న సుఖము, వేరొక్కటున్నదే నారాయణా

 

లాభలోభముల విడిచి,యిహఫరంబులను ఫల మాశింపక

నీ భక్తులైన వారు,ధన్యులై నెగడెదరు నారాయణా

 

ముందు నీ వొకడవు సృష్టిలేక,సచ్చిదానంద స్వరూపంబును

బొంది భేదమునొందక,బ్రహ్మమై యుందువంట నారాయణా

 

కాలత్రయాబాద్యమై,మఱి నిరాకారమై యుంఢు కతనఁ

జాలగాఁ తత్వజ్ఞులు తెలియుదురు సత్తగుట నారాయణా

 

జ్ఞాన స్వరూపమునను,సకలమౌజఢ పదార్దము లనెల్లను

గానగాఁ జేయు కతన,జిత్తంఢ్రు ఘనులు నిను నారాయణా

 

సుఖధు:ఖముల రెంటికి వరగుచు సుఖ రూపమైన కతన

నఖిల వేదాంత విదులు,ఆనందమంఢ్రు నిను నారాయణా

 

గుణ మొకటియై లేని,నీయందు గుణమయంబైన మాయ

గణుతింపఁ గను పట్టును దర్పణము కై వడిని నారాయణా

 

అందుఁ బ్రతిబింబించిన,చిత్సదానంద ముదాయ మెల్ల

జెండు నీశ్వర భావము,త్రిగుణ సం శ్లిష్ఠమై నారాయణా

 

సత్వంబు రజముతమము నను మూడు సంజ్ఞ గ్రమము తోడ

దత్త్వజ్ఞులేర్పరింప సద్గుణ త్రయమగును నారాయణా

 

ప్రకృతి నీయందు లీ(న)మైయుండి స్మృతిని జెందిన వేళను

సకల ప్రపంచ మటుల గనుపట్టె నకలంక నారాయణా

 

మీరు సంకల్పించిన,యిష్టప్రకారమును జెందు మాయ

యారూఢి వివరెంచెద,నవ్విధం బొప్పంగ నారాయణా

 

పంచభూతములు మనసు,బుద్దియును బ్రకటహంకారములును, 

నెంచంగ నిట్టిమాయ,యిదిగా ప్రపంచంబు నారాయణా

 

భూతపంచకతత్వసం ఘాతమున ఁబుట్టె నంత:కరణము

ఖ్యాతిగానందుఁదోఁచు చిత్తుజీవాత్మయే నారాయణా

 

వెస మనో బుద్ది చిత్తా హంకార వృత్తు లంత:కరణము

ప్రసరింప నని నాలుగు తత్త్వ రూపములాయె నారాయణా

 

భౌతిక రజోగుణమును నేకమై ప్రాణంబు పుట్టించెతరు

వాతభేదములచేత బంచ ప్రాణములాయె నారాయణా

 

అలరు ప్రాణ మపానము,వ్యానంబుదానము సమానంబును

తలఁప నీ సంజ్ఞలయందు వాయుతత్త్వము లొప్పు నారాయణా

 

ప్రత్యేక భూత సత్త్వగుణములును,బరఁగ బుద్దీంద్రియములు

సత్త్వమున జనియించెను డత్త్వ ప్రపంచమగు నారాయణా

 

చెవులు చర్మముం గన్నులు జిహ్వ నాసికయుఁ బేరుల చేతను

దవిలి బుద్దీంద్రియముల విషయ సంతతిఁ దెలియు నారాయణా

 

భౌతిక తమోగుణమున విషయములు తరుచుగాఁ జనియించె త

న్మాత్రలు శబ్దస్పర్శరూప రస గంధ నామములు నారాయణా

 

తాదృశ రజోగుణమున జనియించె నల కర్మేంద్రియములు

ఐదు తత్త్వము లగుచును గర్మ సాధనలకు నారాయణా

 

వాక్పాణిపాదపాయూపస్దలను వాని పేళ్ళమరుచుండు

బక్వహృదయులకు దెలియు నీవిధము పరమాత్మ నారాయణా

 

పలుకు పనులను నడుపును -మలమూత్రములు విడుచునీ యైదును

వెలయఁ గర్మేంద్రియముల -విషయములు నవి నారాయణా

 

పరఁగఁ జంద్రుండు బ్రహ్మక్షేత్రజ్ఞుఁ డచటివొందు రుద్రు

వరమానసాధులకును, నధిపతులు పరికింప నారాయణా

 

అరయ దిక్కులు వాయువు,సూర్యుఁడను, వరుణుండునశ్విను

లును బరగశ్రో త్రాదులకును ,నధిపతులు పరికింప నారాయణా

 

అనలుఁడింద్రుడు విష్ణువు,మృత్యువును నల ప్రజాపతియుఁ గూడి

యొరఁగా వాగాదులకును నధిపతులు పరికింప నారాయణా

 

పంచీక్రుతంబాయెను భూతపంచకము ప్రభవించె సృష్టి

పంచీకృతముచేతను స్దూలరూపములాయె నారాయణా

 

పదియింద్రియములు మనసు,బుద్దియును బ్రాణంబుల గూడి 

పదియేడు తత్త్వములను,సూక్ష్మరూపములాయె నారాయణా

 

స్దూలసూక్ష్మరూపములు రెండు,కలుగుటకు, మూలమగునజ్ఞానము 

లీల కారణ మాయెను జీవులకు నాలోన నారాయణా

 

ఈరెండు దేహములతో విశ్వంబు లెల్లఁ బ్రకటంబాయెను 

వేరేనామ రూపముల చేత లోకైక నాయకుఁడ నారాయణా

 

కొన్ని మావినిఁ బుట్టును గ్రుడ్లతోఁ గొన్ని తనువులు బుట్టును

గొన్ని ధరణిని బుట్టును జెమటలను గొన్ని హరి నారాయణా

 

ఈ చతుర్విధ భూతములందుఁ గడు హెచ్చు మానవ జన్మము

నీచమని చూడరాదు,తద్యమే నిర్ణయము నారాయణా

 

ఈ జన్మమందెకాని ముక్తి మఱి యేజన్మమందు లేదు

చేనేతఁ దనుతెలియక మానవుడు చెడిపోవు నారాయణా

 

చేతనాచేతనములు,బులుచును రోఁతలకు లోనగుచును

నాటంక పడుచుండును,గర్మములఁ జేయుచునును నారాయణా

 

సకలయోనుల బుట్టుచు బలుమాఱు స్వర్గ నరకముల బడుచు

నొకట నూరట గానక పరితాప మొందుచునుండు నారాయణా

 

వెలయు నెనుబదినాలుగు లక్షల యోనులయందుఁ బుట్టిగిట్టి

యలసి మూర్ఛలఁ జెందుచు,బహుదు:ఖముల చేత నారాయణా

 

క్రమముతో మనుజగర్భ మునఁ బడుచుఁ గర్మవశగతుఁడగుచును

నమితముగ నచ్చోటను,గర్భనరకమునఁ బడు నారాయణా

 

ఈశ్వరాజ్ఞను బుట్టిన తెలివిచే హృదయమునఁ దలపోయుచు

విశ్వమునఁ దను బొందిన,పాటెల్ల వేర్వేఱు నారాయణా

 

చాలు చీ యిక జన్మము,నిఁక బుట్టు జాల శ్రీహరి భజించి

మేలు చెందెద ననుచును, జింతించు నాలోన నారాయణా

 

ప్రసవకాలమునఁ తల్లి గర్భమున బాదుకొని నిలువలేక

వసుధపయి నూడిపడినఁ తెలివిలేమిని వాపోవు నారాయణా

 

చనుబాలు గుడిచి ప్రాణ ధారణను నిఁక మలమూత్రములలోను

మునిగితేలుచుండును దుర్గంధమున నారాయణా

 

బాలత్వమున బిత్తరై బాఱాడు సిగ్గులేక

పాలుపడి యౌవనంబున విషయానుభవమొందు నారాయణా

 

ముదిమి వచ్చిన వెనుకను సంసారమోహంబు మానకుండ

దుదనేఁగుఁ గర్మగతులఁ బొందుటకు ముదమేది నారాయణా

 

అజ్ఞానలక్షణమ్ము లిటువంటివని విచారించి నరుఁడు

సుజ్ఞానమునకు దగిన మార్గము చూడవలె నారాయణా

 

వేదాంత వేదియైన సద్గురుని పాదపద్మములు జెంది

యాదయానిధి కరుణచే నద్బోధ మందవలె నారాయణా

 

ఏ విద్యకైన గురువు,లేకున్న నావిద్య పట్టుపడదు

కావునను నభ్యాసము,గురుశిక్ష కావలెను నారాయణా

 

గురుముఖంబున విద్యలు నెన్నిగై కొనిన భావజ్ఞానమునగాని

చిరతరాధ్యాత్మ విద్య నభ్యసింపఁగఁనారాయణా

 

వరశిక్షకుఁడు సదయుఁడు వేదాంతనిపుణుడయ్యాచార్యుడు

దొరకుటపురూపమపుడు గుఱుతైన గుఱి యొప్పు నారాయణా

 

అట్టిసద్గురుని వెదకి దర్శించి యా మహాత్ముని పదములు

పట్టి కృత్యుఁడౌను సాధకుండు గట్టిగా నారాయణా

 

మొగి సాధనములు నాల్గు,గలనరుఁడు ముఖ్యాధికారి యగును

దగిన యుపదేశమునకు యోగసాధకులలో నారాయణా

 

యిది నిత్య మిదియనిత్యం బనుచు ధన మది వివేకించుటొవేటి

యెదన నిహపర సుఖములు కోరనిధి అదియొకటి నారాయణా

 

ముదముతో శమదమాది షట్క సంపద గలిగియుండుటొకటి

విదితముగ ముక్తిఁ బొందఁ గాంక్షించుటదియొకటి నారాయణా

 

ఈనాల్గు సాధనములు పొంద నధికారియైన ఆచార్యుజేరి

నానా ప్రకారములను శుశ్రూష నడుపవలె నారాయణా

 

ఉల్లమునఁ గాపట్యము లవ మైన నుండ నియ్యక సతతము

తల్లి దంఢ్రియుఁ దైవము గురువనుచు దలంపవలె నారాయణా

 

తనువు ధనమును సంపద గురుని సొమ్మని సమర్పణము చేసి

నెనసి తత్పరతంత్రుఢై నిత్యమును

 

ఏవిష గురునిష్థకు దీటుగా దీ ప్రపంచంబునందు

మానసము దృఢము చేసి యలరవలె మౌనివలె నారాయణా

 

ఇట్టి శిష్యుని పాత్రత వీక్షించి హృదయమునఁ గారుణ్యము

నెట్టుకొని బ్రహ్మవిద్య గురుఁడొసగు నెయ్యముగ నారాయణా

 

బ్రహ్మంబు గలుగగానె యేతత్ప్రపంచంబు గలిగి యుండు

బ్రహ్మంబు లేకున్నను లేదీ ప్రపంచంబు నారాయణా

 

ఈ విధంబున సూక్తుల బ్రహ్మ సద్భావంబు గలుగఁ జేసి

భావ గోచరము చేయుఁ జిట్స్వరూపములెల్ల నారాయణా

 

ఆ బ్రహ్మమందె పుట్టు విశ్వంబు నాబ్రహ్మమందె యుండు

నా బ్రహ్మమందె యణంగు నదె చూడు మని తెపు నారాయణా

 

అది సచ్చిదానందము అది శుద్ద మది శుద్ద మదియుక్తము

ఆది సత్య మది నిత్యము అడి విమలమని తెలుపు నారాయణా

 

అదె బ్రహ్మ యది విష్ణువు అదె రుద్రు డదియె సర్వేశ్వరుండు

అది పరంజ్యోతి యనుచు బోధించు విదితముగ నారాయణా

 

భావింప వశముగాదు ఇట్టిదని పలుక శక్యంబుగాదు

భావంబు నిలుపుచోట నని తాను బరమౌను నారాయణా

 

అది మాయతోఁ గూడఁగ శివుఁడాయె నదియ విద్యను గూడగ

విదితముగా జీవుఁడాయె నవి తెలుపు వేర్వేఱు నారాయణా

 

అవలకారణశరీరి కార్యంబు జీవుడా లక్షణములు

ద్వివిధముగ కలియు ననుచు బోధించు బ్రకటముగ నారాయణా

 

అరయ నిరువది నాలుగు తత్త్వంబులై యుండు నందణగుచు 

గరతలామలకముగను బోధించు బ్రకటముగ నారాయణా

 

కారణము కార్యమగుచు, వ్యవహార కారణాఖ్యాతి నుండును

నారూఢి బ్రహ్మాండము పిండాండ మని తెలుపు నారాయణా

 

ఐదు భూతములు నింద్రియములు పడి యంతరంగములు

నాల్గు ఐదు విషయములు తత్త్వ సంఘాతమని తెలుపు నారాయణా

 

స్దూల సూక్ష్మాకృతులును,గారణముతోఁ మూడు తెరగులకును

నీలమగు నందు నమరు నని తెలుపు లాలించి నారాయణా

 

వెలసి పంచీకృతములు నగు భూతములకు బుట్టినది తనువు

మూలంబు నది యనుచును బోధించు దయతోడ నారాయణా

 

ఐదు నయిదింద్రియములు ప్రాణంబులయిదు మనసును బుద్దియును

బాదుకొని సూక్ష్మ మందు బోధించుఁ బ్రకటముగ నారాయణా

 

గాఢమగు నజ్ఞానము, ఈరీతిఁ గారణ శరీర మగును

మూఢులకు వశముగాదు తెలియ నిను మోదమున నారాయణా

 

ఈమూఁడు తనువులందు తా నుండి యీతనువు తాననుచును

వ్యామోహ పడుచుండు జీవుండు వరుసతో నారాయణా

 

కలలేక నిద్రించుచు కలఁగాంచి కడు మేలు కొనుచుండును

గలకాల మీ జీవుఁడు త్రివిధములఁ గలసియును నారాయణా

 

ప్రాజ్ఞతై జస విశ్వులు తానె ఈపర్యాయముగ జీవుఁడు

జూడుమని సన్మార్గము తేటగాఁ జూపుచును నారాయణా

 

నీవు దేహంబుగాదు జలమునమునిగి తడిజెందబోదు 

నీవుగాదని తెలుపును వేదాంతనియమమున నారాయణా

 

అనిల తప్తంబుగాదు జలముననుమునిగి తడిజెందబోదు

అనిలశుష్కంబుగాదు నిరుపమంబని తెలుపు నారాయణా

 

నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పాపక:, 

న చైనం క్లే దయం త్యాపో న శోషయతి మారుత:నారాయణా

 

కావహంకార మిపుడు,చిత్తంబుగా నీవు బుడ్ది నీవు

కావు మనసులు సత్యము సాక్షివగు గట్టిగా నారాయణా

 

దేహదర్మములు నీకుఁడోఁచు టంతేగాని నిత్యముగను

మోహంబు మానుమనుచు బోధించు ముఖ్యముగ నారాయణా

 

ఎన్ని దేహములు చెడిన నీవు నేకస్వరూపు డవగుచు

జెన్నలరియుందువెపుడు దత్త్వప్రసిద్దముగ నారాయణా

 

అన్ని వేదాంతవాక్య,ములలో మహావాఖ్యములు నాలుగు

నిన్ను నీశ్వరునిగాను వర్ణించు నిక్కముగ నారాయణా

 

ఉభయదృశ్యోపాధులు కడద్రోసిపోక యయ్యాత్మ మిగుల 

నభయముగ నిటులెప్పుడు,చింతింపు మని తెలుపు నారాయణా

 

జీవ శివ తారతమ్య,మున నైక్య సిద్ది కానేర దనుచు

భావ సంశయము దీర్పు కార్య పటిమచే నారాయణా

 

నిర్వికారుఁడవు నీవు, నీ యందె నిజమైన చందమునను

సర్వముబరకృత వికారములని తెలుపు ప్రౌఢివే నారాయణా

 

సద్గురుఁ డీరీతిగా బోధించు సరళితో వాక్యార్దము

హృద్గతముఁ జేసియుంఢి జగటి జీవింతును నారాయణా

 

అను చింతనము జేయుచు,చిత్తంబున తనివిజెందుచు నెప్పుడు

కనుదమ్ములను ముడుచును ధ్యానంబుజేయగా నారాయణా

 

అపగతాకృత కృత్యుఁడై యీరీతి నభ్యాస మొనరించుచు

నపరోక్ష సిద్ది నొందు బ్రహ్మంబు తానగుచు నారాయణా

 

కందళిత హృదయుడగుచు, సచ్చిదానంద స్వరూపుడగుచు

సందర్శితాత్ముడగుచు నుండు నవికారతను నారాయణా

 

అవ్యయానంద పూజ్య రాజ సింహాసనాసీనుఁడగుచు

భవ్యాత్ముఁఢై వెలయును బూజ్య సంభావ్యుడై నారాయణా

 

నీవు సకలంబుగాని యున్నదే నీకన్న వేరొక్కటి

జీవుండని వర్ణించుట వ్యవహార సిద్దికిని నారాయణా

 

చిలుక పలుకులు పలికితి నాకేమి తెలియు దత్త్వ రహస్యము? 

వలదు నను నేరమెంచ సాధులకు నలినాక్ష నారాయణా

 

శరణు భక్తార్తిహారి,గురురూప శరణు సజ్జన రక్షక

శరణు ధురితౌఘనాశ,శరణిపుఢు కరుణించు నారాయణా

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

sharma

Watch

Rayaprolu
Mallikharjuna
Sharma Garu
  • ntv
  • bhakthi-tv
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb