మీన రాశి:
వీరికి గురుడు 17-05-2012 వరకు ద్వితీయ స్థానమైన మేష రాశి యందు, తదుపరి తృతీయ స్థానమైన వృషభ రాశి యందు సువర్నమూర్తిగా సంచారము చేయును. శని 16-05-2012 వరకు అష్టమ రాశి యైన తులా రాశి యందు తదుపరి వక్రగమనముతో సప్తమ తానమైన కన్యా రాశిలోను, మరల 04-08-2012 నుండి ఋజు వర్తనముతో అష్టమ స్థానమైన తులా యందు లోహ మూర్తిగా సంచారముచేయును.
రాహువు 23-12-2012 వరకు భాగ్య స్థానమైన వృశ్చిక రాశి యందు తదుపరి అష్టమ స్థానమైన తులా రాశి యందు రజిత మూర్తిగా సంచారము చేయును. కేతువు 23-12-2012 వరకు తృతీయ రాశియైన వృషభ రాశి యందు తదుపరి ద్వితీయ స్థానమైన మేష రాశి యందు రజిత మూర్తిగా సంచారము చేయును. కుజుడు 14-08-2012 నుండి 28-09-2012 వరకు అష్టమ రాశి యందు, 04-03-2013 నుండి సంవత్సరాంతము వరకు జన్మ రాశి యందు సంచారము చేయును.
ఈ రాశి వారికి ఈ సంవత్సరము గురు, రాహు, కేతువులకు మూర్తి వంతములు బాగున్నవి. అష్టమ శని ఆరోగ్యమునకు భంగము కలిగించును. ఆర్ధికంగా కూడా అంతంత మాత్రముగా వుంటుంది. సమయానికి సొమ్ము చేతికందక ఇబ్బందులు పాలగుదురు. గౌరవ ప్రతిష్టలు బాగుంటాయి. ప్రతి విషయములో కాల యాపన జరుగుతుంది. వ్యాపార, పారిశ్రామిక రంగాలవారికి సామాన్యమైన అభివృద్ధి ఉంటుది. నూతన వ్యవహారాల ఆరంభమునకు తగిన కాలము కాదు. ఉద్యోగులకు అంత కలిసి రాదు. ఆటంకములు అధిగమించే ప్రయత్నములు చేయవలెను. పట్టుదల చూప వలసిన కాలము. నిరుగ్యోగులకు ఈ సంవత్సరము నిరాశే వుంటుంది. రైతులకు ఇబ్బంది కరముగా వుంటుంది. ఆశించినంత పంటల దిగుబడి వుండదు. కాంట్రాక్టు దారులకు కూడా అంతంత మాత్రముగానే వుంటుంది. కళాకారులకు ప్రయత్నపూర్వకముగా అవకాశములు, తద్వారా సంపాదన వుంటుంది. స్త్రీలు దైవ సంభందమైన కార్యములలో శ్రద్ధను చూపుతారు. సంతానము వలన సమస్యలు, మానసిక అశాంతిని కలిగిస్తాయి. జీవితమూ స్థావ్యస్తముగా వుంటుంది. బంధువులతో కలహములు రావచ్చు.
ఈ రాశి వారు గురు, శని, రాహువు, కేతువు, కుజులకు జపములు చేయించుకొనుట మంచిది. నిత్యమూ గాయత్రి మంత్రము పారాయణము చేయవలెను. నవగ్రహ శాంతి జరిపించుకోవలెను.