అన్ని దిక్కులకు ఉత్తమ తిథులు :
శుక్ల పక్షములో ( శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ) ........... విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి. ఈ తిథులు మంచివి.
బహుళ పక్షములో ( బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ) .. విదియ, తదియ, పంచమి, దశమి. ఈ తిథులు మంచివి.
నక్షత్రాలు : అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనురాధ, మూల, శ్రవణం, ధనిష్ఠ, రేవతి.
సామాన్య ఫలితాలనిచ్చే నక్షత్రాలు : రోహిణి, ఉత్తర, ఉత్తరాషాఢ,ఉత్తరాభాద్ర, శతభిషం.
ప్రయాణానికి పనికి రాని నక్షత్రాలు : భరణి, కృత్తిక , ఆర్ద్ర, ఆశ్లేష, మఖ, పుబ్బ, చిత్త, స్వాతి, విశాఖ, జ్యేష్ట, పూర్వాషాఢ, పూర్వాభాద్ర,
ప్రయాణ విషయమై తిథి, నక్షత్ర, వారశూలలు ---- పనికి రానివి
1 . తూర్పునకు :
తిథులు :పాడ్యమి, నవమి : వారములు: శనివారం, సోమవారములు,
నక్షత్రములు జ్యేష్ట, ధనిష్ఠ నక్షత్రములు, లగ్నాలు: తుల, కుంభ లగ్నాలు పనికి రావు
2 . ఆగ్నేయమునకు :
తిధులు : తదియ, ఏకాదశి, వారములు: గురు, శనివారములు, లగ్నాలు : మకర లగ్నాలు మంచివి కావు.
3. దక్షినమునకు :
తిథులు; పంచమి, త్రయోదశి, వారములు; గురువారం, నక్షత్రములు: శ్రవణం, అశ్విని నక్షత్రములు, లగ్నాలు: మీనా, వృశ్చిక లగ్నాలు మంచివి కావు.
4 . నైరుతి :
తిథులు: చవితి, ద్వాదశి, వారములు: సోమ, శుక్రవారములు, లగ్నము: కర్కాటక లగ్నాలు మంచివి కావు.
5 . పడమరకు ;
తిథులు: షష్టి, చతుర్దశి, వారాలు: శుక్రవారం, నక్షత్రములు: పుష్యమి, రోహిణి, నక్షత్రములు, ధనుస్సు, సింహలగ్నాలు మంచివి కావు.
6 . వాయువ్యమునకు;
తిధులు; సప్తమి, పొర్ణమి, అమావాస్య, వారాలు; ఆది, మంగళవారములు, లగ్నాలు : మేష లగ్నం పనికిరావు.
7 . ఉత్తరం:
తిథులు : విదియ, దశమి, వారములు: మంగళ, బుధవారములు, నక్షత్రములు: హస్త, పుబ్బ నక్షత్రాలు, లగ్నాలు: వృషభ, కన్య లగ్నాలు పనికి రావు.
8 . ఈశాన్యం:
తిథులు: అష్టమి, తదియ, వారాలు; బుధవారం, లగ్నాలు: మిధున లగ్నాలు పనికిరావు.