| * వ్యాపారస్తులు ఎప్పుడు కూడా మేనమామతో గొడవ పెట్టుకోకూడదు. |
|
* వ్యాపారస్తులు ఎప్పుడు కూడా మేనమామతో గొడవ పెట్టుకోకూడదు. అలా చేసినట్లయితే బుధ గ్రహ శాపానికి గురి అయ్యి వ్యాపారం లో నష్టపోతారు.
|
|
|
|
| * మీకు రావలసిన డబ్బు సమయానికి రావటం లేదా? |
|
అన్ని అడ్డంకులకూ కారణం శని గ్రహమే. ఈ ఇబ్బంది తొలగుటకు 8 మంది ముసలివారికి కొమ్ము శనగలు నూనెలో వేసి చేసిన ప్రసాదం విస్తరిలో వడ్డించండి. గురు, శనివారాల్లో ఈ కార్యం చేయుటకు మంచిది. ఇలా మూడు సార్లు మూడు వారాలు చేయాలి.
|
|
|
|
| * మానసికంగా బాధ పడుతున్నారా? |
|
1. పార్వతీ దేవినీ పార్ధించండి.
2. సోమవారం నాడు శివున్ని అభిషేకించండి.
3. బియ్యంతో పరమాన్నం, చేసి 7 మంది ముత్తైదువలకు పెట్టాలి. ఈ తంతు శివాలయం లో చేయండి.
|
|
|
|
| * కుజ గ్రహ సంబంధ దోషాలు మెమ్మల్ని బాదిస్తున్నాయా? |
|
1. పెద్ద పెనం పొయ్యిమీద పెట్టి బెల్లం రొట్టెలు ( గోధుమ రొట్టెలు మరియు బెల్లం తో కలిపి చేసినవి.) 6 మందికి తినిపించాలి.
2. లేడి చర్మం మీద కూర్చొని రోజూ సుబ్రమణ్య స్వామిని పూజించాలి.
|
|
|
|
| * సంతానం లేక బాధ పడుతున్నారా? |
|
కుక్కలకు రొట్టెలు ఆహారంగా పెట్టండి. మంచి ఫలితం కనిపిస్తుంది.
|
|
|
|
| * ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? |
|
41రోజులు కాకులకు గోధుమ రొట్టెలను ఆహారంగా వేయండి.
* సంతానం లేక బాధ పడుతున్నారా?
|
|
|
|
| * మీ దంతాల బాధ ఎక్కువగా వున్నదా? ( పంటి నొప్పి ) |
|
పిరమిడ్లో ఒక రోజు నిల్వ ఉంచిన నీరు పుక్కిలించండి. అలా క్రమం తప్పకుండా 15 రోజులు చేయండి. బాధ అనేది వుండదు.
|
|
|
|
| * మీ పిల్లలు ఎంత తిన్న శారీరకముగా ఎదగటం లేదా? |
|
గురవారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్లి 2 రూపాయలు దక్షిణ వేసి రండి. 9 వారాలు క్రమం తప్పకుండా చేయండి.
|
|
|
|
| * ఆఫీసులో మీ పై అధికారి మిమ్మల్ని బాదిస్తున్నాడా? |
|
మర్రి చెట్టు వేరును తెచ్చి కడిగి సాంబ్రాణి ధూపం వేసి దానిని కుడిచేతి దండంకు కట్టుకోండి. మీ సమస్య తీరుతుంది. లి.
|
|
|
|
| * ఆస్తులకు సంబంధించిన బాధలు ఎక్కువగా ఉన్నాయా? |
|
శ్రీ సుబ్రమణ్య స్వామికి ప్రముఖంగా ఆరు క్షేత్రాలు వున్నాయి. ఆయా క్షేత్రాల స్వామి వారల ఫోటోలను సంపాదించి ఆరింటికి ఒకే సారి పూజ జరిపించండి. ఆరింటికీ ఒకే గిన్నెలో పాలు నైవేద్యం పెట్టండి. ఆరుగు మాత్రు సమానులైన స్త్రీల నుండి ఆ పూజ వద్దకు పిలిపించి వారి ఆశీర్వాదం తీసుకోండి. అయితే ఈ పూజ కేవలం కృత్తికా నక్షత్రం రోజున మాత్రమే చెయ్యాలి.
|
|
|
|
|