Valuable Information
::సకలపూజలు.కామ్ అభిమానులకు శుభవార్త ! ప్రేక్షకులకు శ్రీ కాశీభట్ల బాలకృష్ణ శర్మ గారు అన్నిరకముల జాతక సమస్యలకు ఖచ్చితమైన జాతక పరిశీలన చేసి ఆయా సమస్యలకు సరైన పరిహారములను తెలియజేయుదురు. 1. విద్యా, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, సంతానము, ఆరోగ్యము, విదేశీయాన మొదలగు జాతక సమస్యలు 2. వివాహ, వ్యాపార, గృహారంభ, గృహప్రవేశ, ఉపనయ తదితర వాటికి శుభ ముహూర్తములను నిర్ణయము చేయుట 3. వివాహ సంబంద జాతక పొంతలనకు మరియు వాస్తు సంబంద విషయములు. ఆసక్తి ఉన్నవారు అన్ని విషయములకు క్రింద తెలిపిన మొబైల్ ఫోన్ ద్వారా గాని లేదా ఈమైల్ ద్వారాగాని సంప్రదించవచ్చును. హైదరాబాద్ లో వుండే వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చు. ఇతర దేశాల్లో వుండే వారు ముందుగా ఈమెయిలు లో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు అడిగే ప్రశ్నలకు ఫోన్ ద్వారా గాని, ఈ మెయిల్ ద్వారా గాని సంప్రదించవచ్చు. అందరికి ఇదే మా ఆహ్వానం. ఫోన్ చేయవలసిన మా మొబైల్ నంబర్ : 9247326197

జలము /నదుల గురించి మరియు నదీ పుష్కరాల గురించి…

జలము /నదుల గురించి మరియు నదీ పుష్కరాల గురించి

జలము(నీరు) అనేది పంచ భూతాలలో అతి ముఖ్యమైన భూతం. జలము లేనిదే జీవము లేదు. జీవులచే త్రాగబడిన నీరు 1. మూత్రం 2. స్వేదం 3.నెత్తురు 4. వీర్యం 5. ప్రాణం గా మారతాయి. అందుకే ప్రాణం జలమయంఅన్నారు. జీవులకు అధికంగా ఎక్కువ మొత్తంలో ఉపయోగపడే జలము నదీ జలము. పంటలు పండాలన్నా, వంటలు వండాలన్నా, దాహం తీరాలన్నా నదీ జలమే దిక్కు. అంటే ఉపయోగపడే జలమునకు ఆధారం నదీజలము. దానికి ఆధారం నది”. ఇటువంటి జలము యొక్క స్థానం అంతరిక్షం (అంటే ఆకాశం). ఆకాశంలో ఉండే జలము (ఆవిరి రూపంలో) క్రిందకి (భూమి మీదకు) వస్తున్నప్పుడుఅహిఅనే మేఘాలకు తగిలి వర్షధారలుగా పడుతుంది. ఈవిధంగా కురిసే వర్షధారాలే నదులుగా మారతాయనిఅధర్వణ వేదంచెబుతోంది. అసలు సృష్టికి ముందు జలము మాత్రమే ఉండేదని (సముద్ర జలము) బృహజాబాల ఉపనిషద్ చెబుతోంది. ఒకసారి శ్రీమహా విష్ణువు నేను జలము నుండి ఉద్భవించానుఅందుకే నన్ను నారాయణుడుఅంటారు, ‘నారముఅంటే నీరుఅని చెప్పడం జరిగింది. “నదిఅనే పదమునదఅనే శబ్దం నుండి ఉద్భవించింది. నది అంటేనదించునది,te” అని అర్ధం. అంటే ధ్వనిచేస్తూ నడిచేది అని అర్ధం. నదులు ప్రపంచానికి మాతృ స్వరూపంఅని మార్కండేయ పురాణంచెబుతోంది. నదీ జలములలో అమృతంఉంటుందని అధర్వణ వేదంచెబుతోంది. మునిభావభోధిని అనే గ్రంధంలో ఏ నది యొక్క స్నానం పుష్కర సమయంలో జీవులపై ఎలా పని చేస్తుందో గొప్పగా వివరించడం జరిగింది

 

ఇందులో అన్నిటిలోకెల్లా గొప్పదైన నదీ స్నానఫలము (పుష్కరకాలంలో పుష్కరుడు ఉన్నప్పుడు) కృష్ణనది కి కలదు. అదే గురువుతో మానసిక సంభందాన్ని పెంపొందిస్తుంది, గురు భక్తిని కలిగిస్తుంది, దోషములనూ, వ్యాధులను పోగొడుతుంది”. మిగతా అన్ని నదుల స్నానం పాపాలనూ, దోషాలనూ, వ్యాధులను పోగొడితే, ఒక్క కృష్ణనది స్నానం మాత్రమే గురువుతో మానసిక సంభందాన్ని పెంపొందిస్తుంది, గురు భక్తిని కలిగిస్తుంది. (మిగిలిన దోషాల ను నివృత్తి చేయడం తో పాటుగా) అందు వల్లనే దత్తాత్రేయ భక్తులందరికీ కృష్ణనది పుష్కర సమయంలో కృష్ణనది స్నానం అతి ముఖ్యమైనది.

 

భూమి మీద వివిధ దేశాలలో అనేక నదులున్నప్పటికీ కేవలం కర్మభూమి అయిన మనదేశం లోని నదులకే పుష్కరాలు లేదా కుంభమేళాలు ఉంటాయి. దానికి గల కారణం మిగిలిన దేశాలలోని నదులలో కేవలం ప్రవాహశక్తిమాత్రమే ఉంటుంది. కానీ మన దేశపు నదులలో ప్రవాహశక్తి తో పాటు తీర్థశక్తిఉంటుంది. అందుకే గొప్పగొప్ప క్షేత్రాల యొక్క నదులలో అనేక తీర్థాలు మనకు కని పిస్తాయి (ఉదా: గాణగాపూర్ భీమా-అమరజ నదులలో అష్టతీర్థాలు ఉంటాయి, తిరుమల లోని కపిలతీర్థం కూడా ఈ కోవలోకే వస్తుంది) నదులకు పాపాలనూ కడిగేప్రక్షాళనశక్తి తీర్థశక్తివల్లనే వస్తుంది

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

sharma

Watch

Rayaprolu
Mallikharjuna
Sharma Garu
  • ntv
  • bhakthi-tv
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb