Valuable Information
::సకలపూజలు.కామ్ అభిమానులకు శుభవార్త ! ప్రేక్షకులకు శ్రీ కాశీభట్ల బాలకృష్ణ శర్మ గారు అన్నిరకముల జాతక సమస్యలకు ఖచ్చితమైన జాతక పరిశీలన చేసి ఆయా సమస్యలకు సరైన పరిహారములను తెలియజేయుదురు. 1. విద్యా, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, సంతానము, ఆరోగ్యము, విదేశీయాన మొదలగు జాతక సమస్యలు 2. వివాహ, వ్యాపార, గృహారంభ, గృహప్రవేశ, ఉపనయ తదితర వాటికి శుభ ముహూర్తములను నిర్ణయము చేయుట 3. వివాహ సంబంద జాతక పొంతలనకు మరియు వాస్తు సంబంద విషయములు. ఆసక్తి ఉన్నవారు అన్ని విషయములకు క్రింద తెలిపిన మొబైల్ ఫోన్ ద్వారా గాని లేదా ఈమైల్ ద్వారాగాని సంప్రదించవచ్చును. హైదరాబాద్ లో వుండే వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చు. ఇతర దేశాల్లో వుండే వారు ముందుగా ఈమెయిలు లో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు అడిగే ప్రశ్నలకు ఫోన్ ద్వారా గాని, ఈ మెయిల్ ద్వారా గాని సంప్రదించవచ్చు. అందరికి ఇదే మా ఆహ్వానం. ఫోన్ చేయవలసిన మా మొబైల్ నంబర్ : 9247326197

pushkar histry

పుష్కరం అంటే 12 సంవత్సరాలు అని ఆర్ధం. భారతకాలమానం ప్రకారం భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులకు పుష్కరాలు బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించిన సమయంలో పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆయా నదుల రాశిలలో ఉన్నంత కాలం ఆ నదిలో పుష్కరాలు ఉన్నట్లే లెక్క. ఒక సంవత్సరం కాలంపాటు బృహస్పతి ఆయా రాశులలో ఉండడం జరుగుతుంది. ఆ సందర్భాల్లో ప్రవేశించిన మొదటి 12 రోజులు ఆది పుష్కరాలు,సంవత్సరాంతంలోని చివరి 12 రోజులు అంత్య పుష్కరాలుగా పిలవడం జరుగుతుంది. మొదటిచివరి 12 రోజులు ఎంతో ప్రత్యేకమైన రోజులుగా పరిగణించడం జరుగుతుంది.

పుష్కర అనే శబ్దానికి నీరువరుణుని కుమారుడు వంటి అనేక ఆర్థాలు ఉన్నాయి. పుష్కరాల ముఖ్య ఉద్దేశ్యం నది పర్యావరణ సంరక్షణ పరిశుభ్రతను తెలుసుకునేందుకే పుష్కరాలను ఆచరించాలనే సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం జరిగిందని పెద్దలు పేర్కొన్నారు. నదీ తీరంలో ఎక్కడ మెరక ఉందో ఎక్కడ పల్లం ఉందో ఎక్కడ నదితీర ప్రాంతం కోతకు గురైందోచెట్లు కొట్టివేసిన ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించేందుకు గాను పూర్వికులు ఈ ఇటువంటి సంప్రదాయాన్ని ప్రారంభించి నది పవిత్రతను కాపాడేందుకు ఆయా నదులలో పున్యస్నానాలు ఆచరించడం ద్వారా నీటి వనరుల ప్రాముఖ్యాన్ని చేప్పకనే చాటి చెప్పారు. హిందు సనాతన ధర్మంలో నదులకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చి పుజాదులు ఆచరించడం ద్వారా భవిష్యత్తరాలకు జలాల ప్రాముఖ్యాన్ని తీసుకువెళ్ళడమే ధ్యేయంగా పుష్కరాలను నిర్వహించడం జరుగుతుంది.

ఆయూ నదులలో బృహస్పతి ప్రవేశించే రాశుల వివరాలు:

గంగానదికి మేషరాశిలోనునర్మదానదికి వృషభరాశిసరస్వతీ నదికి మిధునరాశియమునానదికి కర్కాటరాశి,గోదావరి నదికి సింహరాశికృష్ణానదికి కన్యారాశికావేరి నదికి తులారాశిభీమానదికి వృశ్చికరాశిపుష్కరవాహిని/రాధ్యసాగనదికి ధనుర్రాశితుంగభద్ర నదికి మకరరాశిసింధునదికి కుంభరాశిప్రాణహిత నదికి మీనరాశిలోను బృహస్పతి ప్రవేశకాలం నుండి పుష్కరాలను నిర్వహించుకోవడం జరుగుతుంది.

గత ఎడాది జూలై 14 నుండి జూలై 25 వరకు గోదావరి పుష్కరాలు బృహస్పతిసింహరాశిలో ప్రవేశించిన సమయంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఎడాది కృష్ణా పుష్కరాలను బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించే ఆగష్టు 12 నుంచి ఆగష్టు 23 వరకు 12 రోజుల పాటు ఆది పుష్కరాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇదే రోజు (ఆగష్టు 12శుక్రవారం) హిందువులకు ఎంతో పవిత్రమైన వరలక్ష్మీవ్రతం పండుగ రావడం యాధృచ్చికం.

పుష్కరుని చరిత్ర:

 

పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తప్పసు ఆచరించి ఈశ్వరుని ప్రసన్నంతో తందిలునితో ఏమి వరం కావాలో కోరుకోమని ఈశ్వరుడు వరం ఇచ్చాడు. తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకాలని వరం కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తమ అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. ఇలా తుందిలుడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ధాలకు ఆధిపతి అయ్యే వరాన్ని పొందాడు.తద్వారా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి అతనికి లభించింది. పోషించే శక్తిని సంసృతంలో పుష్కరం అంటారు. అలా తందిలుడు పుష్కరుడైయ్యాడు.

బ్రహ్మదేవునికి సృష్టి చేయవలసిన అవసరం ఏర్పడినప్పడు జలంతో అవసరమేర్పడి జలంకోసం ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకుని జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుని తనకు ఇవ్వవలసినదని కోరుకున్నాడు. ఈశ్వరుడు అందుకు అంగీకారం తెలుపగానే పుష్కరుడు బ్రహ్మదేవుని కమండలంలోకి ప్రవేశించాడు.బ్రహ్మకార్యం పూర్తి అయిన తరువాత ప్రాణులను బ్రతికించే ధర్మము నెరవేర్చడానికి బృహస్పతి ప్రాణులకు జీవనాధారమైన జలంకావాలని బ్రహ్మదేవుని ప్రార్ధించాడు. ఆ కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు. కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదలి వెళ్ళలేనని చెప్పాడు.

అప్పడు బృహస్పతిబ్రహ్మపుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశులలో ప్రవేశించేటప్పడు పన్నెండు రోజులు మిగిలిన కాలం సంవత్సరమంతా మధ్యాహ్నం సమయంలో రెండు ముహుర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని నిర్ణయించాడు. ఆ సమయంలో సమస్త దేవతలు బృహస్పతి ఆధిపతిగా ఉన్న నదికి పుష్కరునితో వస్తారు కనుక పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యపధమని పురాణాలు చెప్తున్నాయి.

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

sharma

Watch

Rayaprolu
Mallikharjuna
Sharma Garu
  • ntv
  • bhakthi-tv
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb