Valuable Information
::సకలపూజలు.కామ్ అభిమానులకు శుభవార్త ! ప్రేక్షకులకు శ్రీ కాశీభట్ల బాలకృష్ణ శర్మ గారు అన్నిరకముల జాతక సమస్యలకు ఖచ్చితమైన జాతక పరిశీలన చేసి ఆయా సమస్యలకు సరైన పరిహారములను తెలియజేయుదురు. 1. విద్యా, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, సంతానము, ఆరోగ్యము, విదేశీయాన మొదలగు జాతక సమస్యలు 2. వివాహ, వ్యాపార, గృహారంభ, గృహప్రవేశ, ఉపనయ తదితర వాటికి శుభ ముహూర్తములను నిర్ణయము చేయుట 3. వివాహ సంబంద జాతక పొంతలనకు మరియు వాస్తు సంబంద విషయములు. ఆసక్తి ఉన్నవారు అన్ని విషయములకు క్రింద తెలిపిన మొబైల్ ఫోన్ ద్వారా గాని లేదా ఈమైల్ ద్వారాగాని సంప్రదించవచ్చును. హైదరాబాద్ లో వుండే వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చు. ఇతర దేశాల్లో వుండే వారు ముందుగా ఈమెయిలు లో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు అడిగే ప్రశ్నలకు ఫోన్ ద్వారా గాని, ఈ మెయిల్ ద్వారా గాని సంప్రదించవచ్చు. అందరికి ఇదే మా ఆహ్వానం. ఫోన్ చేయవలసిన మా మొబైల్ నంబర్ : 9247326197

whats is pushkara snanam?

పుష్కరము అంటే పోషణ. పుష్కర అంటే పోషణకు కావలసిన శక్తి. అందుకే విష్ణు సహస్రనామంలో విష్ణువును పుష్కరాక్షుడు అని స్తుతిస్తారు. సమస్త విశ్వము యొక్క పోషణను వీక్షించువాడు అని భావం.

జ్యోతిష శాస్త్రంలో కూడా పుష్కర నవాంసము అనే ప్రస్తావన ఉంది. సంబంధిత గ్రహానికి లేదా ముహుర్తానికి బలం చేకూర్చేదని అర్ధం.

జీవనదులకు సంబంధించినంత వరకు నదులను ప్రత్యేకంగా పూజించే కాలం పుష్కరాలు. అంటే బృహస్పతి ఆయా నదులకు సంబంధించిన రాశులలోకి ప్రవేశించే పవిత్ర దినాలు. ఇది ప్రతి నదికీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.

బృహస్పతి రాశిలోకి ప్రవేశించే తొలి పన్నెండు దినాలు ఆది పుష్కరంగా, విడిచే చివరి పన్నెండు దినాలు అంత్య పుష్కరంగా నిర్వహిస్తారు.

ఋగ్వేదంలో ఇలా చెప్పబడింది.

జన్మప్రబృక్రియత పాపం స్త్రియావ పురుషేణ
పుష్కర్యోమాత్రశ్య సర్వయే ప్రణశ్యతి||

ఇక పురాణ కధనాలు అనేకం.

వరుణుడు కుమారుడైన పుష్కరుడు అన్ని నదీ తీర్ధాలకు పవిత్రత చేకూర్చాలనే సదుద్దేశ్యంతో బ్రహ్మదేవుని వాటిలో నివసింపమని తపస్సు చేశాడు. నిస్వార్ధమైన అతడి కోరికను బ్రహ్మ మన్నించి. బృహస్పతి ఏ రాశిలోకి ప్రవేశిస్తే తత్సంబంధిత నదిలో ఆ కాలం తానుండేట్లు అనుగ్రహించాడు. ఆ ప్రకారంగా పన్నెండు జీవనదులకు సంబంధించిన పన్నెండు రాశులు, సంవత్సరానికి ఒక నది చొప్పున పుష్కరాలు జరుపుకుంటాయి.

పన్నెండు నదులకు మాత్రమే పుష్కరాలు నిర్వహిస్తారు. అవి గంగ, నర్మద, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, భీమా, పుష్కరవాహిని, తుంగభద్ర, సిందు, ప్రాణహిత.

బ్రహ్మాండ పురాణం ఇలా చెప్తుంది. పుష్కర స్నానం జన్మజన్మల పాపాన్ని కడిగివేసి, సద్బుద్దిని ప్రసాదిస్తుంది. అశ్వమేధ యాగంతో సమమైన ఫలితాన్నిస్తుంది. నర్మదా నది వద్ద ధ్యానం, కురుక్షేత్రం వద్ద దానం, కాశీలో మరణం అత్యంత ఫలప్రదాలని ప్రతీతి. ఆ మూడు కలిపిన ఫలం పుష్కర స్నానం ప్రసాదిస్తుంది.

పుష్కర సమయంలో సమస్త దేవతలు, ఋషులు, పితృదేవతలు, గంగానది పర్యంతం సమస్త తీర్ధాలు ఆ నదిలోనే నివసిస్తుంటాయని విశ్వాసంతో పరమ పవిత్రంగా ఆ జలాలను స్వీకరిస్తారు సాధకులు, భక్తులు. అట్టి పవిత్ర సమయంలో ఆ నదుల వద్ద నివసించడం, ఆ జలాలను స్వీకరించడం సర్వ పాపహారకంగా, పుణ్యప్రదంగా భావిస్తారు.

మన ఋషులు పుష్కర విధిని కూడా నియమించారు. పుష్కర సమయంలో ఖచ్చితంగా చేసి తీరవల్సిందిగా పుష్కరస్నానం, పుష్కరవాసం, శిరోముండనం, ఉపవాసం, పుష్కర పితృకర్మ, పుష్కర దానం విధించారు.

పుష్కర స్నానం అంటే వేలాదిగా తరలివచ్చిన జన సందోహం మద్య తొక్కుకుంటూ, తోసుకుంటూ నదిలో మునక వేసి రావడం కాదు. నదీ జలాలతో భౌతికంగా దగ్గరగా రావడం ద్వారా మానసికంగా, ఆధ్యాత్మికంగా మనల్ని ఆ తీర్ధాలతో అనుసంధానం చేసుకోవాలని ఋషి ప్రోక్తం.

 

ఆ సమయంలో సూర్యుని వల్ల ప్రభావితమయ్యే భూమి యొక్క విద్యుదయస్కాంత క్షేత్రం మరింత తీవ్రతరంగా ఉండి, నదీజలాల రోగనిరోధక లక్షణాలను మరింత శక్తివంతంగా చేస్తాయి. ధ్యానం ద్వారా చేకూర్చుకొనే శక్తిని పుష్కర స్నానం ద్వారా సంగ్రహించవచ్చని శాస్త్రఙ్ఞుల అంచెనా.Pushkaraala samayam lo chese snanam గురువుతో మానసిక సంభందాన్ని పెంపొందిస్తుంది, గురు భక్తిని కలిగిస్తుంది, దోషములనూ, వ్యాధులను పోగొడుతుంది.

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

sharma

Watch

Rayaprolu
Mallikharjuna
Sharma Garu
  • ntv
  • bhakthi-tv
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb