Valuable Information
::వారఫలాలు తేదీ 5 may నుండి 11 may వరకు ....మేషరాశి: బంధు మిత్రువుల సందర్శనము, వ్యాపార వృద్ధి కలదు. ధన, భూ, గృహ లభా లుంటాయి. దూర ప్రయాణా లుంటాయి. వాహన సౌఖ్యము కలదు. నూతన పరిచయా లేర్పడుతాయి. స్త్రీ సౌఖ్యముండును. విందు, వినోదాలలో పాల్గొంటారు. శారీరక శ్రమ కలుగును. తొందర పాటు తనము పనికి రాదు. కలహాలేర్పడును. భాగస్వామి వ్యాపారస్తులు జాగ్రత్త పడాలి. కావలసిన వారు దూరమవుతారు. చేయు కార్యాల్లో ఆటంకాలు, సంతాన మూలము గా ఇబ్బందులుంటాయి. స్థాన చలనము లుండును. ఆరోగ్యము మీద దృష్టి పెట్టాలి. ధన సంబంధ విషయములో జాగ్రత్తగా ఉండాలి. ....పరిహారములు: సుబ్రహ్మణ్యస్వామి, గురుదత్తాత్రేయ మరియు ఆంజనేయ స్వామి ఆరాధనలు శుభకరము......................వృషభరాశి: స్వల్ప ధనలాభముండును. వ్యాపార వ్యవహారాల వల్ల శుభము. సహకారము లభించును. శుభప్రద ధన వ్యయము కలుగును. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు పొందుతారు. పదోన్నతులు, శుభ కార్యాలు జరుగుతాయి. ప్రయాణా లుంటాయి. ఆరోగ్య సమస్యలు, విరోదాలుంటాయి. చేయు పనులు ఆలస్య మవుతాయి. కుటుంబ సమస్య లుంటాయి. ఖర్చును నియ త్రించుకోవాలి. స్థానచలన ముండును. అనుకోని వార్త వింటారు. పరిహారములు: ఆదిత్యహృదయ పారాయణ, లక్ష్మీదేవి ఆరాధన మరియు నవగ్రహ ఆరాధనలు శుభకరము. ....................మిథునరాశి: నూతన పరిచయాల వల్ల లాభాలు. వ్యాపార, వ్యవహారాలు అను కూలిస్తాయి. స్వల్పధనలాభము కల్గును. ప్రయాణాల్లో సమస్యలుంటాయి. స్త్రీ సహాయము లభించును. భూలాభముండును. కలహ లుంటాయి. విలువైన వస్తువులను జాగ్రత్త పరచుకోవాలి. స్థాన మార్పు కలదు. అనవసర తిప్పట, అలసట కలుగును. పై అధికారులనుండి సమస్య లుంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యము పట్ల శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్య సమస్య లుంటాయి. పరిహారములు: ..... నవగ్రహ ఆరాధన, శనికి తైలాభిషేకములు, దుర్గాదేవి ఆరాధనలు శుభకరము .........కర్కాటకరాశి: చేయు వృత్తి, వ్యపారాలు అనుకూలిస్తాయి. నూతన ఆదాయ మార్గా లేర్పడును. భూ, గృహములు సమకూరుతాయి. ఇంటిలో శుభకార్యాలు, నూతన వ్యక్తుల ద్వారా లాభాలుంటాయి. జాయింట్ వ్యాపారస్తులు జాగ్రత్త పడాలి. సంతాన సౌఖ్యము, అధికారుల నుండి ఆదరణ లభించును. కీర్తి పెరుగును. విద్యార్థులకు, అవివాహితులకు మంచి కాలము. నిరుద్యోగులు కష్టపడాలి. మీమీద కొద్దిమందికి ద్వేషభావము కలుగును. ఆరోగ్య భంగమగును. స్థానచలనము కలదు. కుటుంబములోని వారి ఆరోగ్యము పట్ల జాగ్రత్త పడాలి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. పరిహారములు: లక్ష్మీదేవి ఆరాధన, శివారాధన మరియు నవగ్రహ ఆరాధనలు శుభకరము ............సింహరాశి: ....చేయు పనులు అనుకూలిస్తాయి. ఇళ్ళు, భూములు సమకూరును. దూర ప్రయాణా లుంటాయి. వాహన సౌఖ్యము కలదు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడు కోవాలి. గొడవలు రాకుండా చూడాలి. భాగస్వామి వ్యాపారస్తులు జాగ్రత్త పడాలి. సంతాన సమస్య లుంటాయి. స్థాన చలనము కలదు. స్తిరాస్థి విషయాల్లో సమస్య లుంటాయి. విలువైన వస్తువు లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఋణాలు చేస్తారు. పరిహారములు: శివ ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన మరియు సాయిబాబా ఆరాధనలు శుభకరము. ......... కన్యరాశి: చేయు వృత్తి, వ్యాపారములో కొద్దిపాటి లాభాలుంటాయి. అతి శ్రమతో ఇండ్లు, భూములు కొనుగోలు చేస్తారు. శుభ కార్యాలను చేస్తారు. అయితే కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా పడాలి. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్త పడాలి. మిత్రులతో సమస్యలు రాకుండా చూసుకోవాలి. అనవసర సంభాషణలు చేయరాదు. చేయు ఇతరులను నమ్మి మోసపోరాదు. ఉద్యోగస్తులు సమస్యలు రాకుండా చూసు కోవాలి. స్థాన భంగమునకు అవకాశము. రుణాల విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. ........పరిహారములు: రుద్ర్రాభిషేకము, గణపతి ఆరాధన మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు శుభకరము. ......తులారాశి: ...శుభకార్యాలు చేస్తారు. చేయు పనుల యందు శుభాలుంటాయి. మాటకు విలువ పెరుగును. ఉద్యగులకు అనుకూల స్తానమార్పులు. పై అధికారుల నుండి సహాయ సహ కారా లుంటాయి. నిరుద్యోగులకు, అవి వాహితులకు శుభ ఫలితా లుంటాయి. సమయానికి ధనము చేకూరును. కోర్టు కేసులు అనుకూలిస్తాయి. కీర్తిని పొందుతారు. నూతన సంపాదన మార్గాలకు ప్రయత్నిస్తారు. విద్యార్థులకు కొద్దిపాటి శ్రమతో శుభఫలితా లుంటాయి. షేర్ మార్కెట్ వ్యాపారము లాభించును. అకాల కోపానికి, తొందరబాటు తనమునకు గురిఅవుతారు. మనోవిచార ముండును. నిద్రలేమి వలన శిరోబాధ ఉండును. పరిహారములు: గణపతి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన మరియు సూర్య ఆరాధనలు శుభకరము......వృశ్చికరాశి: ...ఖర్చును అదుపులో ఉంచుకోవాలి. స్థాన మార్పు కలదు. దగ్గరివారితో విరోధా లుంటాయి. పనులందు ఆటంకా లుంటాయి. మధ్య వర్తిత్వ విషయాల జోలోకి పోరాదు. కుటుంబములో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. ధనవృద్ధి కలుగును. స్త్రీల వలన లాభముండును. తీర్థ యాత్రలు చేస్తారు. విందు వినోదా లలో పాల్గొంటారు. ఆరోగ్యము పై శ్రద్ధ పెట్టాలి. వ్యాపారాభి వృద్ధి విషయాల్లో ఆలోచించి నిర్ణయము తీసుకోవాలి. .....పరిహారములు: ఆంజనేయస్వామి ఆరాధన, గణపతి ఆరాధన, దుర్గాదేవి ఆరాధనలు శుభకరము.............ధనుస్సురాశి: చేయు వృత్తి వ్యాపారాలు కొంత మేర అనుకూలిస్తాయి. వాహన సౌఖ్యము కలదు. విలువైన వస్తువులు లేదా భూ, గృహములు కొనుగోలు చేయునప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మానసిక అశాంతి ఉండును. ఇతరులను నమ్మి మోసపోరాదు. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. శారీరక శ్రమ కల్గును. గర్భ సంబంధ రోగాల నుండి జాగ్రత్త పడాలి. ధనమూలముగా ఇబ్బందులు కలుగును. ఆస్తి తగాదా లుంటాయి. కుటుంబ సమస్యలు ఇబ్బంది కలిగించును. పరిహారములు: గోమాత సేవ, సూర్య ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధనలు శుభకరము......మకరరాశి: సువర్ణ, భూలాభము కలదు. స్థిరాస్తి విషయాలలో చిక్కులతో కూడిన విజయము సాధిస్తారు. ధనాదాయ మార్గాలేర్పడును. వాయిదా పడుచున్న శుభకార్యాలు పూర్తవును. పదవీ ప్రాప్తి కలదు. ప్రయాణా లుంటాయి. నూతన పరిచయా లుంటాయి. ఉద్యోగమార్పుకు అనుకూలము. వాహన లాభము కలదు. బంధు మిత్రులతో విందు, వినోదాలలో పాల్గొంటారు. వివాదాలకు తావివ్వరాదు. శారీరక శ్రమ కల్గును. కుటుంబ సఖ్యతను చూడాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయ రాదు. ఖర్చును నియత్రించుకోవాలి పరిహారములు: శ్రీ రామచంద్రమూర్తి ఆరాధన, సూర్య ఆరాధన మరియు ఆంజినేయ స్వామి ఆరాధనలు శుభకరము. .........కుంభరాశి: ధనప్రాప్తి కలదు. అనుకున్నపనులు పూర్తిచేస్తారు. స్థానమార్పు కలదు. సంతాన సమస్యలుంటాయి. ఒక వార్త ఇబ్బంది కల్గిస్తుంది. సంభాషణ చేయునప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ కలహలుంటాయి. ఆరోగ్యమును కాపాడుకోవాలి. జాయింటు వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. అతినమ్మకము పనికి రాదు. మిమ్ములను ఆదరించే వారి సలహాలతో కార్యములు పూర్తిచేయాలి. ...పరిహారములు: సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన, సాయిబాబా ఆరాధన మరియు విష్ణుమూర్తి ఆరాధనలు శుభకరము.......మీనరాశి: పదవీ ప్రాప్తి కలదు. ఇంటిలో శుభ కార్యాలు జరుగును. భూ, గృహ లాభముండును. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. సంతాన సౌఖ్య ముండును. నూతనముగా చేబట్టే కార్యములు అనుకూలిస్తాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పదోన్నతు లుంటాయి. స్థాన మార్పుకలదు. షేర్ మార్కెట్ వ్యాపారము అనుకూలము. విద్యార్థులకు అనుకూలము. విదేశీ ప్రయాణ కోరిక నేరవేరును. ఒక వార్త ఇబ్బంది కలిగించును. కుటుంబములో అశాంతి కలుగును. కలహ లుంటాయి. ఆరోగ్య సమస్య లుంటాయి. పరిహారములు: సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన, ఆంజినేయస్వామి ఆరాధన మరియు దుర్గాదేవి ఆరాధనలు శుభకరము.
::MAY 1 ... MAY DAY........May 3rd Masa shivaratri ...... 4th May . Dollu Karthari strats......... 6th May . Moon darshan ........ 7th May .. Akshaya trutiya ...... 9th May Shankaracharya Jayanti........ 11th May Krittika Karte starts at 3.21 AM...... 14th May Vrushabha Sankranti starts at 2.30 PM...... 14th May . Vasavi Jayanti....... 17th May Nrusimha Jayanti .......18th May..Vaishakha Poornima ......19th May .. Maha Abhishekam for Sharadamba in Shruneri....... 22nd May . Sankashtahara Chaturthi.... 25th May . Rohini Karthe... starts 00.50 AM..... 26th May .. Bhanu Saptami.......... 28th May Dollu Karthati Ends........ 29th May Hanumat Jayanti.

ఋషి పంచమి

భాద్రపద శుద్ధ పంచమిని రుషి పంచమిగా వ్యవహరిస్తారు. ఆరోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు. అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు. రాముని గురువు విశ్వామిత్రుడు. కులగురువు వశిష్టుడు. విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి. దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యపమహర్షి. రుషిపంచమినాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే.

ఆ మర్నాటి షష్ఠిని సూర్యషష్ఠిగా వ్యవహరిస్తారు. ఆరోజున సూర్యుని ఆరాధిస్తే మంచిదని నమ్మిక. అష్టమినాడు కొన్ని ప్రాంతాల స్త్రీలు కేదారవ్రతం చేస్తారు. ఇక దశమినాడు విష్ణుభక్తులు దశావతార వ్రతం ఆచరిస్తారు. నారాయణుడు వామనుడిగా అవతరించిన దినం భాద్రపద శుద్ధ ద్వాదశి. ఆరోజున శ్రవణా నక్షత్రం కూడా వస్తే మరింత ప్రశస్తం అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ మాసంలో శుద్ధ చతుర్దశిని అనంత పద్మనాభ చతుర్దశి అంటారు. ఈరోజున పాలకడలిపై మహాలక్ష్మీసమేతుడై శేష తల్పశాయిగా కొలువైన శ్రీమహావిష్ణువును పూజించడం ఆచారం. తిరువనంతపురం లోని అనంతపద్మనాభస్వామి వ్రతం ఆచరించడం వల్ల దారిద్ర్యం తొలిగి ఐశ్వర్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

సప్తర్షి రామాయణము - SAPTARSHI RAMAYANAM.

కశ్యపః
జాతః శ్రీ రఘునాయకొ దశరథాన్మున్యాశ్రయాత్ తాటకాం
హత్వా రక్షిత కౌశిక క్రుతువరః కృత్వాప్యహల్యాం సుభామ్
భంక్త్వా రుద్రశరాసనం జనకజాం పాణౌ గృహిత్వా తతొ
జిత్వార్ధా ధ్వని భార్గవం పునరగాత్ సీతా సమేతః పురీమ్ - 1
అత్రిః
దస్యా మంధరయా దయారహితయా దుర్భొధితా కైకయీ
శ్రీరామ ప్రధమాభిషేక సమయే మాతా ప్యయాచద్వరౌ
భర్తారం "భరతః ప్రశాస్తు ధరణీం" "రామోవనం గచ్ఛతా"
దిత్యాకర్ణ్య సచొత్తరం నహి దదౌ దుఃఖేన మూర్ఛాం గతః - 2
భరద్వాజః
శ్రీరామః పితృ శాసనా ద్వనమగాత్ సౌమిత్రి సీతాన్వితో
గంగాం ప్రాప్య జతాం నిదధ్య సగుహః సచ్చిత్రకూటేవసన్
కృత్వా తత్ర పితృ క్రియాం సభరతో దత్త్వా2భయం దండకే
ప్రాపా గస్త్య మునీశ్వరం తదుదితం ధృత్వా ధనుశ్చాక్షయమ్ - 3
విశ్వామిత్రః
గత్వా పంచవటీ మగస్త్య వచనాద్ దత్త్వా2భయం మౌనినాం
ఛిత్వా శూర్పణఖాస్య కర్ణ యుగళం త్రాతుం సమస్తాన్ మునీన్
హత్వా తం చ ఖరం సువర్ణ హరిణం భిత్వా తథా వాలినం
తారారత్న మవైరి రాజ్యమకరోత్ సర్వంచ సుగ్రీవసాత్ - 4
గౌతమః
దూతో దాశరథీస్సలీలముదధిం తీర్త్వా హనూమాన్ మహాన్
దృస్ట్వా2శోకవనే స్థితాం జనకాజాం దత్వాంగుళేర్ముద్రికాం
అక్షాదీనసురాన్ నిహత్య మహతీం లంకాచ దగ్ధ్వా పునః
శ్రీరామం చ సమేత్య "దేవ! జననీ దృష్టామ" యేత్యబ్రవీత్ - 5
జమదగ్నిః
రామో బద్ధ పయో నిధిః కపివరై ర్వీరై ర్నలాద్యై ర్వృతో
లంకాం ప్రాప్య సకుంభకర్న తనుజం హత్వా రణే రావణం
తస్యాం న్యస్య విభీషణం పునరసౌ సీతాపతిః పుష్పకా
రూఢస్సన్ పురమాగతః సభరతః సింహాసానస్థౌ బభౌ - 6
వసిష్టః
శ్రీరామో హయమేధ ముఖ్యమఖకృత్ సమ్యక్ ప్రజాః పాలయన్
కృత్వా రాజ్య మధానుజైశ్చ సుచిరం భూరిస్వధర్మాన్వితౌ
పుత్త్రౌ భ్రాతృ సుతాన్వితౌ కుసలవౌ సంస్థాప్య భూమండలే
సో2యోధ్యాపురవాసిభిశ్చ సరయూ స్నాతః ప్రపేదేదివమ్ - 7

ఫలశ్రుతిః
శ్రీరామస్య కధా సుధా తి మధురాన్ శ్లొకా నిమాన్ యే జనాః
శృణ్వంతి ప్రపఠంతి చ ప్రతిదినం తే2ఘౌమ విధ్వంసినః
శ్రీమంతొ బహుపుత్త్ర పౌత్త్ర సహితా భుక్త్వేహ భోగాం శ్చిరం
భోగాంతే తు సదార్చితం సురగణై ర్విష్ణో ర్లభంతే పదమ్

పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

sharma

Watch

Rayaprolu
Mallikharjuna
Sharma Garu
  • ntv
  • bhakthi-tv
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb