Valuable Information
::సకలపూజలు.కామ్ అభిమానులకు శుభవార్త ! ప్రేక్షకులకు శ్రీ కాశీభట్ల బాలకృష్ణ శర్మ గారు అన్నిరకముల జాతక సమస్యలకు ఖచ్చితమైన జాతక పరిశీలన చేసి ఆయా సమస్యలకు సరైన పరిహారములను తెలియజేయుదురు. 1. విద్యా, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, సంతానము, ఆరోగ్యము, విదేశీయాన మొదలగు జాతక సమస్యలు 2. వివాహ, వ్యాపార, గృహారంభ, గృహప్రవేశ, ఉపనయ తదితర వాటికి శుభ ముహూర్తములను నిర్ణయము చేయుట 3. వివాహ సంబంద జాతక పొంతలనకు మరియు వాస్తు సంబంద విషయములు. ఆసక్తి ఉన్నవారు అన్ని విషయములకు క్రింద తెలిపిన మొబైల్ ఫోన్ ద్వారా గాని లేదా ఈమైల్ ద్వారాగాని సంప్రదించవచ్చును. హైదరాబాద్ లో వుండే వారు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవవచ్చు. ఇతర దేశాల్లో వుండే వారు ముందుగా ఈమెయిలు లో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీరు అడిగే ప్రశ్నలకు ఫోన్ ద్వారా గాని, ఈ మెయిల్ ద్వారా గాని సంప్రదించవచ్చు. అందరికి ఇదే మా ఆహ్వానం. ఫోన్ చేయవలసిన మా మొబైల్ నంబర్ : 9247326197

తొలిఏకాదశి

హిందూ సాంప్రదాయములో పరమపవిత్రమైన తిథి ఏకాదశి. ఎంత పవిత్రమైనదంటే ... ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులకు ఏదో ఒక విశిష్టతను ఆపాదించి హరినామస్మరణ చేస్తారు భక్తులు. ఒక్కోరోజుకు ఒక్కో ప్రాధాన్యత. వాటిలో ముఖ్యమయినది ఆషాడమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి. దీనినే "తొలిఏకాదశి" అంటారు. పూర్వం ఆషాడ శుద్ధ ఏకాదశినే సంవత్సరారంభంగా భావించేవారు కాబట్టి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. శ్రీమహావిష్ణువు పాలసముద్రంలో శేషతల్పం పై శయనించే రోజు కాబట్టి ఈ రోజును శయన ఏకాదశి అని కూడా అంటారని పురాణాలు చెబుతున్నాయి. ఖగోళపరంగా చూస్తే ఈ రోజు దాకా ఉత్తరదిశగా వాలి కనిపించే సూర్యుడు ఒకింత దక్షిణ దిశగా వాలినట్లు కనిపిస్తాడు. సూర్యుడు అంటే ప్రత్యక్ష నారాయణుడు. అందువల్ల కుడా మన పూర్వులు ఈరోజును శయనైకాదశిగా వ్యవహరించి ఉండొచ్చని పండితుల అభిప్రాయం.

మరోరకంగా చూస్తే

.... తొలిఏకాదశి వచ్చిందంటే ఇక వరుసగా పండుగలు వస్తాయన్నమటే! అప్పటికి రెండు నెలలుగా ఎలాంటి పండుగలూ లేక బోసిపోయిన ఇళ్ళకి కొత్తకళ వస్తుంది. ఈ ఏకాదశితో మొదలుపెడితే వెంటనే గురుపూర్ణిమ వస్తుంది. ఆషాడం వెళ్ళగానే శ్రావణమాసం నోములు, వ్రతాలు, తరువాత వినాయకచవితి, ఆపై దసరా, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి............. ఇలా సాగిపోతుందా చిట్టా.

ఈరోజున ఏకాదశి వ్రతం చేసి విష్ణువును పూజించడం ఆచారంగా పాటిస్తారు భక్తులు.

చాలా ప్రాంతాల్లో తొలి ఏకాదశినాడు "గోపద్మవ్రతం" చేస్తారు. అంటే గోవును పూజించడం అన్నమాట. ఈ నాలుగు నెలలు వర్షా కాలం కాబట్టి పశువుల కొట్టాలను శుభ్రం చేసి వాటికి ఎలాంటి అనారోగ్యం రాకుండా కాపాడుకునే ప్రయత్నం ఇది. అలాగే ఈనెల బహుళంలో వచ్చే ఏకాదశిని పాపనాశిని ఏకాదశి అంటారు. ఆరోజు విష్ణువును పూజించి ఏకాదశి వ్రతం చేస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయని నమ్మిక. శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రదాఏకాదశి, లలితైకాదశి అంటారు. ఆరోజున గొడుగు దానమిస్తే మంచిదని ప్రతీతి. ఇక బహుళంలో వచ్చేది కామిక ఏకాదశి. ఈరోజున వెన్న దానం చెయ్యాలంటారు. భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. ఈరోజు ఉపవాసం వుంది మరునాడు ద్వాదశి ఘడియల్లో హరిని పూజిస్తే కరువుకాటకాలు తొలగిపోతాయని పద్మపురాణంలో వుంది. విశ్వామిత్రుడికి మాటిచ్చి రాజ్యాన్ని భార్యాబిడ్డలను కోల్పోయిన హరిశ్చంద్రుడు భాద్రపద ఏకాదశి (దీన్నే అజ ఏకాదశి అంటారు. ) నాడు వ్రతం ఆచరించి అన్నిటినీ పొందగలిగాడని పురాణప్రవచనం.

ముక్కోటిఏకాదశి:

కార్తీక శుద్ధ ఏకాదశి బహుళంలోది ఉత్పత్తి ఏకాదశి.

విష్ణుమూర్తి శరీరం నుంచి పుట్టిన కన్య మురాసురుని సంహరించిన దినం. తొలిఏకాదశి నాడు శయనించిన విష్ణుమూర్తి యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఈరోజును ఉత్థాన ఏకాదశి అనికూడా అంటారు భక్తులు. మార్గశిర శుద్ధంలో మొక్షైకాదశి, సౌఖ్యదా ఏకాదశి. అప్పటికి ధనుర్మాసంకూడా వచ్చివుంటే ఆరోజును. "ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశి" అంటారు. చాంద్రమానాన్ని బట్టీ ఇది ఒక్కోసారి మార్గశిరంలో మరోసారి పుష్యంలో వస్తుంది. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణ్వాలయలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఆరోజున స్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకున్న వారికి మోక్షం లభిస్తుందని ప్రతీతి. అలాగే, అర్జునుడికి శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో విశ్వరూపం చూపి గీతాబోధన చేసింది. ఈరోజేనని పూరాణాలు చెబుతున్నాయి. ఇక మార్గశిర బహుళంలో వచ్చేది విమలైకాదశి. దీన్నే సఫలైకాదశి అని కుడా అంటారు. పుష్యశుద్ధంలో వచ్చేది నంద లేదా పుత్ర ఏకాదశి. అదే మాసం బహుళంలో వచ్చేది కళ్యాణైకాదశి.
 
పంచాంగం వివరములకు ఈక్రింది భాగాన్ని పూరించండి:
తేది:  
సమయము:  
: (0-24)
ప్రదేశ‌‌‌‌‍‌‍ము:( జి.యస్.టి)  
:

Advertise Here

sharma

Watch

Rayaprolu
Mallikharjuna
Sharma Garu
  • ntv
  • bhakthi-tv
© 2014 Sakalapoojalu , all Rights Reserved.
  • Follow us on
Design & Developed by Arjunweb